Tollywood : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు.. ఈ మధ్యకాలంలో ఈ హీరో నటిస్తున్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకోగా.. అతనికి వరుస అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి.. ప్రస్తుతం వెంకీ మామ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా కోసం ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. అయితే ఇప్పుడు మరో మల్టీస్టారర్ కు సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి… ఇటీవల ఆయన నటించిన మల్టీస్టారర్ చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. ఇప్పుడు మరోసారి మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఆ హీరో ఎవరు? వీళ్ళిద్దరితో సినిమా చేస్తున్న డైరెక్టర్ ఎవరు అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల నటించిన చిత్రాలన్నీ కూడా బిగ్గెస్ట్ హిట్గా నిలిచాయి. ఈ మధ్యకాలంలో మల్టీ స్టార్ సినిమాలు కూడా చేస్తున్న వెంకీ మామ ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘డేర్ డెవిల్’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.. ఈ మూవీలో వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ఉన్నాడని ఓ వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో వెంకటేష్ పాత్ర హైలెట్గా నిలిచి, స్టోరీని మలుపు తిప్పేలా ఉంటుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. అజిత్ లాంటి స్టార్ హీరోలతో వెంకీ మామ స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ చేతిలో మూడు లేదా నాలుగు భారీ ప్రాజెక్టులో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆ సినిమాల గురించి వెంకటేష్ వెల్లడించే అవకాశం ఉంది అని సమాచారం..
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 సినిమా పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఇటీవల చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కొక్క అప్డేట్ ని వదులుతూ సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు.. చిత్ర యూనిట్ సినిమాలో నటిస్తున్న కీలక పాత్రలు పరిచయం చేస్తూ వీడియోలను రిలీజ్ చేసింది. ఆ వీడియోలు జనాలని బాగా ఆకట్టుకోవడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. త్వరగా షూటింగ్ పూర్తిచేసుకుని ఈ సినిమాని వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్స్ సలహాలు చేస్తుంది.. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ని అందుకుంటుందో అని వెంకటేష్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు..
Also Read :Intinti Ramayanam : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..