E-Paper
Advertisement

టెలికాం గేమ్‌ ఛేంజర్స్.. అసలు Local, STD, PCO అంటే ఏంటి? 1990’s జ్ఞాపకాలు!

టెలికాం గేమ్‌ ఛేంజర్స్.. అసలు Local, STD, PCO అంటే ఏంటి? 1990’s జ్ఞాపకాలు!
Advertisement

Telecom History: భారత టెలికాం చరిత్రలో Local, STD, PCO అనే పదాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులు, స్నేహితులతో మాట్లాడాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. అలాంటి రోజుల్లో టెలికాం వ్యవస్థను సామాన్యుడికి దగ్గర చేసిన ప్రధాన సాధనాలు ఇవే. ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ యుగంలో వీటి పేరలు పెద్దగా వినిపించకపోయినా.. భారత్‌లో కమ్యూనికేషన్ విప్లవానికి పునాది పడింది మాత్రం వీటితోనే. ఈ నేపథ్యంలో అసలు ఈ పదాలకు అర్థాలేంటి? వాటికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Local, STD, PCO అంటే ఏంటి?

టెలికాం పరిభాషలో ఈ మూడు పదాలకు స్పష్టమైన అర్థాలు ఉన్నాయి. ఒకే టెలికాం పరిధి లేదా ఒకే నగరం/జిల్లా సరిహద్దుల లోపల చేసే ఫోన్ కాల్స్‌ను లోకల్ కాల్స్ (Local Calls) అంటారు. వీటి ఛార్జీలు చాలా తక్కువగా ఉండేవి. దేశంలో ఉన్న వేర్వేరు నగరాలు, రాష్ట్రాల మధ్య ఆపరేటర్ సాయం లేకుండా నేరుగా కాల్ చేసుకునే సదుపాయాన్ని STD అంటారు. నిర్దిష్ట నగరానికి కేటాయించిన STD కోడ్ (ఉదా: హైదరాబాద్‌కు 040) డయల్ చేసి ఈ కాల్స్ చేసేవారు. ఇక పీసీఓ (Public Call Office) అంటే సొంతంగా ఫోన్ లేని సామాన్య ప్రజలు డబ్బులు చెల్లించి మాట్లాడుకోవడానికి వీలుగా అప్పట్లో ఉన్న టెలిఫోన్ బూత్ లను PCOలు అని పిలిచేవారు.

ఇవి ఎప్పుడు అమల్లోకి వచ్చాయి?

Advertisement

దేశంలో టెలికాం సేవలు స్వాతంత్రానికి ముందే ఉన్నప్పటికీ.. STD సేవలు 1960 నవంబర్ 25న కాన్పూర్ – లక్నో నగరాల మధ్య తొలిసారి ప్రారంభమయ్యాయి. అంతకుముందు సుదూర ప్రాంతాలకు కాల్ చేయాలంటే ‘ట్రంక్ కాల్’ బుక్ చేసుకుని గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఆ తర్వాత 1980, 1990ల కాలంలో టెలికాం శాఖ నామమాత్రపు డిపాజిట్లతో వేలాది మందికి PCO స్వయం ఉపాధి కేంద్రాలను మంజూరు చేసింది. పసుపు రంగు బోర్డులతో దర్శనమిచ్చే ఈ PCO బూత్‌లు దేశవ్యాప్తంగా కమ్యూనికేషన్‌ను అమితంగా పెంచేశాయి.

ఎలా మాయం అయ్యాయి?

మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన కొత్తలో కూడా లోకల్, STD ఛార్జీల వ్యత్యాసం ఉండేది. అంతేకాకుండా రోమింగ్ ఛార్జీలు కూడా చెల్లించాల్సి వచ్చేది. కానీ సాంకేతికత పెరిగేకొద్దీ వినియోగదారులకు విప్లవాత్మకమైన బెనిఫిట్స్ దక్కాయి. ‘వన్ నేషన్ – వన్ టారిఫ్’ అనే టెలికాం సంస్కరణల వల్ల దేశంలో ఎక్కడికైనా ఒకే ధరకు మాట్లాడే సదుపాయం వచ్చింది. ప్రస్తుతం ఉన్న 4G, 5G యుగం మొదలయ్యాక లోకల్, STD అనే తేడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఫోన్లలో ఫ్రీ అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులోకి వచ్చాయి.

Advertisement

Also Read: వీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్తగా రూ.249, రూ.250 ప్లాన్స్ లాంచ్.. నిజంగా అదిరిపోయాయ్!

ఉపాధి, ఆర్థిక స్వతంత్రం

పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఉన్న కాలంలో వేలాది మందికి లభించిన ఉపాధి.. ఆ తర్వాతి కాలంలో మొబైల్ రీఛార్జ్, సర్వీసింగ్ షాపులుగా రూపాంతరం చెందాయి. ఒకప్పుడు నిమిషానికి రూపాయిల చొప్పున లెక్కగట్టి మాట్లాడిన రోజుల నుంచి.. నేడు దేశంలో ఎక్కడ ఉన్నారనే దానితో సంబంధం లేకుండా అపరిమితంగా మాట్లాడే స్థాయికి చేరుకోవడంలో Local, STD, PCOల పాత్ర ఎనలేనిదని టెలికాం నిపుణులు చెబుతుంటారు.

Also Read: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. రేట్లు ఇలా తగ్గించేశారేంటీ!

Tags

Related News

మైక్రోవేవ్ ఓవెన్లలపై భారీ డిస్కౌంట్లు..ఆఫర్ పోతే రాదు వెంటనే కొనేయండి

రూ.20 వేలలోపు బెస్ట్ కెమెరా, బ్యాటరీ ఫోన్ కావాలా? Amazon Freedom Saleలో బెస్ట్ ఆప్షన్స్ ఇవే!

హోటళ్లు-పబ్లిక్ ప్రాంతాల్లో వైఫై వినియోగం.. సైబర్‌ దాడులపై మైక్రోసాఫ్ట్ వార్నింగ్, తస్మాత్ జాగ్రత్త అంటూ..

వీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్తగా రూ.249, రూ.250 ప్లాన్స్ లాంచ్.. నిజంగా అదిరిపోయాయ్!

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. రేట్లు ఇలా తగ్గించేశారేంటీ!

రూ.13,000 బడ్జెట్‌లో ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో హాట్‌కేక్‌లా అమ్ముడవుతున్న Moto G06 Power!

వర్షాకాలంలో ఇళ్లలోని నీరు, బురదను క్షణాల్లో.. క్లీన్ చేసే వాక్యూమ్ క్లీనర్స్!

Big Stories

Advertisement
×