E-Paper
Advertisement

షాకిచ్చిన బంగారం-వెండి ధరలు.. ఒక్కరోజు 10 వేలు, మార్కెట్లో ఇవాళ మాటేంటి?

షాకిచ్చిన బంగారం-వెండి ధరలు.. ఒక్కరోజు 10 వేలు, మార్కెట్లో ఇవాళ మాటేంటి?
Advertisement

Gold-Silver Price Today: అంతర్జాతీయ పరిణామాలు పుత్తడి మార్కెట్‌పై పడింది. దీనికితోడు అమెరికా ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం డేటా, మధ్యప్రాచ్య సంఘర్షణ నుండి వస్తున్న పరస్పర విరుద్ధ సంకేతాలు పెట్టుబడుదారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బంగారం కొనుగోళ్లకు చాలా దేశాల కేంద్ర బ్యాంకులు మొగ్గు‌చూపడంతో ఒక్కసారిగా బంగారం-వెండి ధరలు అమాంతంగా పెరిగాయి.

ఎగిసిపడిన బంగారం-వెండి ధరలు

అమెరికా ద్రవ్యోల్బణ డేటాకు ముందు బంగారం ధర 10 వారాల గరిష్ట స్థాయికి సమీపంలోకి చేరింది. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు ఉండడంతో పలు దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లపై ఫోకస్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం-వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లో బంగారం-వెండి ధరలు ఒక్కరోజులోనే భారీగా పెరిగాయి.

అంతర్జాతీయ మార్కెట్లో అదే జోరు

Advertisement

అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు భారీగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 42 డాలర్లకు పైగా పెరిగడం దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 4403 డాలర్లపై ట్రేడింగ్ జరుగుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.16 శాతం పెరిగింది. ప్రస్తుతం 65.17 డాలర్ల వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. ఆగస్టు 12న అనగా బుధవారం తెలుగురాష్ట్రాలతోపాటు మెట్రో సిటీల్లో బంగారం-వెండి ధరలకు ఒక్కసారి పరిశీలిద్దాం.

 

తెలుగు రాష్ట్రాల మార్కట్లో ధరలు ఈ విధంగా

Advertisement

హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు ఒక్కరోజులో మార్పులు జరిగాయి. నిన్నటి రోజున తగ్గిన బంగారం ధర, బుధవారం భారీగా పెరిగింది. బుధవారం 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.1850 మేర పెరిగింది. ప్రస్తుతం తులం రేటు రూ.1,53,820 వద్దకు పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు తులానికి రూ.1700 మేర పెరిగి రూ.1,41,000 మార్క్ ని టచ్ చేసింది. ఏపీలోని ప్రధాన మార్కెట్ విజయవాడలో పసిడి రేట్లు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.1850 పెరిగి రూ.1,53,820 వద్దకు పలుకుతోంది. అదే 22 క్యారెట్ల పసిడి రేటు తులంపై రూ.1700 ఎగబాకి రూ.1,41,000 వద్ద ఉంది.

కొద్దిరోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన వెండి రేటు ఎసిగిపడింది. దాదాపు వారం తర్వాత ధరలో మార్పు కనిపించింది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలోకు వెండి ధర ఏకంగా రూ.10,000 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,60,000 మార్క్ వద్ద కొనసాగుతోంది. మార్కెట్ ఓపెన్ తర్వాత ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశముంది.

ALSO READ: ఇంటర్య్వూలో కళ్లు మూసుకుని సమాధానం చెప్పాలి, షాకైన ఏఐ ఇంజనీర్

కొద్దిరోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన వెండి రేటు ఎసిగిపడింది. దాదాపు వారం తర్వాత ధరలో మార్పు కనిపించింది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలోకు వెండి ధర ఏకంగా రూ.10,000 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,60,000 మార్క్ వద్ద కొనసాగుతోంది.

మెట్రో సిటీల్లో బంగారం ధరలను ఒక్కసారి చూద్దాం. ముంబై- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర Rs 1,53,570 కాగా, ఢిల్లీ- Rs 1,53,300లుగా ఉంది. చెన్నై- Rs 1,54,010 కాగా, కోల్‌కతా- Rs 1,53,360, బెంగుళూరు- Rs 1,53,690 వద్ద ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర ముంబై-Rs 1,40,773, ఢిల్లీ-Rs 1,40,525, చెన్నై-Rs 1,41,176, కోల్‌కతా-Rs 140,580, బెంగుళూరు- Rs 1,40,883లుగా ఉంది.

Related News

బాబూ ఈ డిగ్రీలు చేస్తే ఉద్యోగాల్లేవ్.. ఏఐ దెబ్బ.. తక్కువ జీతానికి చేయాల్సిందే

నలుపు vs నీలం సోలార్ ప్యానెళ్లు.. ఏది ఎక్కువ కరెంట్ ఇస్తుంది? మీ ఇంటికి ఏది బెస్ట్?

ఇది కదా SIP పవరంటే.. రూ. 9 వేలతో రూ. 3 కోట్ల సంపద.. సామాన్యులకు జాక్ పాట్!

పోస్టాఫీస్ NSC vs SBI ఎఫ్‌డీ.. మీ డబ్బుకు ఎక్కడ ఎక్కువ లాభం? 5 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్?

తెల్లటి ఆధార్ తెలుసు.. మరి ఈ ‘బ్లూ ఆధార్’ కథేంటి? దీని వల్ల ఎవరికి బెనిఫిట్?

అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. సామాన్యులపై తీవ్ర ప్రభావం.. అలా చేయకపోతే సబ్సిడీ బంద్!

ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా? డీలర్లు ఈ 5 విషయాలు మీతో చెప్పరు

భారీగా బంగారం ధర పతనం.. మహిళల్లో ఆనందం, మార్కెట్లో రేటు ఎంతంటే..

Big Stories

Advertisement
×