E-Paper
Advertisement

షాకిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంక్.. బుధవారం నుంచి వడ్డీ రేట్ల పెంపు, భారం ఎవరికి?

షాకిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంక్.. బుధవారం నుంచి వడ్డీ రేట్ల పెంపు, భారం ఎవరికి?
Advertisement

MCLR Rate Hike: ప్రభుత్వాలు మొదలు బ్యాంకుల వరకు సామాన్యుల నుంచి పన్నులు లేదా వడ్డీ రేట్లు పెంచడానికి రెడీగా ఉంటాయి. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా ఏ మాత్రం పట్టించుకోరు. తాము చేయాల్సింది చేసుకుంటూ పోతారు. వీరిని చూసి కొన్ని బ్యాంకులు అదే దారిలో నడుస్తాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా తమ కస్టమర్లకు ఊహించని విధంగా షాకిచ్చింది.  ఆగస్టు 12 నుండి రేటు పెంచుతామని బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్ సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

కస్టమర్లకు బ్యాంక్ ఆఫ్ బరోడా షాక్

దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడా. వివిధ రుణాలకు లింకైన బెంచ్ మార్క్ వడ్డీ రేట్లు-మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. ఫలితంగా పెంచిన వడ్డీ రేట్లు ఆగస్టు 12 అనగా బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. దీని ప్రభావం ఈఎంఐల పడనుంది. ఫండ్స్ ఆధారిత మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది బ్యాంక్ ఆఫ్ బరోడా. మూడునెలల కాల పరిమితి గల ఎంసీఎల్ఆర్-MCLR రేటును సవరించింది.

బుధవారం నుంచి వడ్డీ రేట్లు పెంపు

Advertisement

ఫలితంగా 3 నెలల ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రేటు 8.30 శాతానికి పెరిగింది. ఈ విషయాన్ని సదరు బ్యాంకు తెలిపింది. ఎంసీఎల్ఆర్ రేటును 8.20 శాతం ఉండగా, తాజా పెంపుతో అది కాస్త 8.30 శాతానికి చేరుకుంది. మిగిలిన ఎంసీఎల్ఆర్ రేట్లను యథాతథంగా కొనసాగించనుంది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 7.85 శాతం వద్ద ఉండగా, నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 7.95 శాతంగా ఉంది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.50 శాతం ఉంది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.75 శాతం వద్ద కంటిన్యూ అవుతుందని పేర్కొంది. ఇందులో ఎలాంటి మార్పు చేయలేదు. ఇక మూడు నెలల ఎంసీఎల్ఆర్ బెంచ్ మార్క్‌తో ముడిపడి ఉండే గృహ-వాహన-వ్యక్తిగత రుణాలపై వడ్డీ పెంపు పడబోతోంది. ఆ లెక్కన నెలవారీ ఈఎంఐ లేకుంటే రుణాల కాల పరిమితి స్వల్పంగా పెరిగే ఛాన్స్ ఉందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి.

పెంపు భారం ఎవరిపై ఎక్కువగా?

వినియోగదారులు తీసుకున్న రుణాలు.. ఎంసీఎల్ఆర్ ఆధారిత వడ్డీ రేటుతో లింక్ అయ్యిందా? ఆర్‌బీఐ రెపో రేటు ఆధారింగా లింక్ అయ్యిందో స్టేట్మెంట్ ద్వారా ఒకసారి చెక్ చేసుకోండి. తాజా మార్పుల వల్ల మీరు తీసుకున్న లోన్‌పై ప్రభావం చూపుతుందా? లేదా అనేది తెలుసుకోవచ్చు. వడ్డీ రేట్ల మార్పు అనేది ఫ్లోటింగ్ రేట్ ఎంచుకున్న వారికి, కొత్తగా రుణాలు తీసుకునే వారికి వర్తించనుంది. ఫిక్స్‌డ్ వడ్డీ రేటుతో తీసుకున్నవారిపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆ బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ఏమైనా డౌట్ ఉంటే సదరు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి వివరాలు తెలుసుకోవడం బెటర్. బ్యాంక్ ఆఫ్ బరోడా దారిలో మరి కొన్ని బ్యాంకులు నడవాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి, అన్ని కాలపరిమితులకు తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు-MCLRను 5 బేసిస్ పాయింట్లు తగ్గించడం గమనార్హం.

Advertisement

ALSO READ: ప్రతి నెలా రూ.5000 పెట్టుబడి ప్లాన్ చేస్తున్నారా? FD లేదా SIP ఏది బెస్ట్

Related News

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు పెట్టుబడి ప్రత్యామ్నాలు వెతుకుతున్న భారతీయులు.. ఎందుకంటే?

30 ఏళ్లు వచ్చేలోపు..ఈ 7ట్రిక్స్ పాటిస్తే, మీ ఫ్యూచర్ సెట్టైనట్టే!

మీకు 4-5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా? ఎక్కువ అకౌంట్లు ఉంటే జరిగే నష్టాలు ఇవే!

క్రెడిట్ కార్డ్ Vs వర్సెస్ బ్యాంక్ లోన్.. అత్యవసర సమయంలో ఏది బెటర్?

మీ బంగారంపై ఉన్న హాల్‌మార్క్ అసలైనదా? లేదా ?ఇలా గుర్తించండి!

ఒక్క ఏడాదిలోనే రూ.3.2 లక్షల నుంచి రూ.40 లక్షల ప్యాకేజీకి.. ప్రభుత్వ కాలేజీ విద్యార్థి కెరీర్ సూపర్ ఫాస్ట్

గోల్డ్ లోన్ చెల్లించినా మీ బంగారాన్ని బ్యాంక్ తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇది తెలుసుకోండి

బ్యాంకుకు వెళ్లకుండానే..ఫోన్ నంబర్ మార్చుకోవడం ఎలా? సింపుల్ ప్రాసెస్ ఇగో!

Big Stories

Advertisement
×