E-Paper
Advertisement

మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్లు.. థార్ రాక్స్‌ పై ఏకంగా రూ.1.20 లక్షల తగ్గింపు!

మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్లు.. థార్ రాక్స్‌ పై ఏకంగా రూ.1.20 లక్షల తగ్గింపు!
Advertisement

Mahindra SUV Discounts August 2026: మహీంద్రా కస్టమర్లకు ఆగస్టు నెలలో మంచి ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. కంపెనీ తన ఐసీఈ వాహనాల్లోని పలు మోడళ్లపై డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాలను ప్రకటించింది. ముఖ్యంగా థార్ రాక్స్, స్కార్పియో ఎన్‌లపై రూ.లక్షకు పైగా ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ ఆఫర్లు ఆగస్టు 31 వరకు ఉంటాయి. అయితే డీలర్, ప్రాంతం, వాహనం స్టాక్, కస్టమర్ అర్హతను బట్టి ఆఫర్లలో మార్పులు ఉండొచ్చు.

స్కార్పియో ఎన్‌: రూ.1.25 లక్షల బెనిఫిట్స్

మహీంద్రా స్కార్పియో ఎన్‌పై ఈ నెలలో రూ.1.25 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు. ఇందులో రూ.1 లక్ష నగదు తగ్గింపుతో పాటు రూ.25,000 విలువైన యాక్సెసరీలు ఉన్నాయి. ఈ ఆఫర్ ప్రస్తుతం డీలర్ల వద్ద ఉన్న ప్రీ ఫేస్‌లిఫ్ట్ స్టాక్‌ కు వర్తిస్తుంది. స్కార్పియో ఎన్ ధర రూ.13.69 లక్షల నుంచి రూ.25.49 లక్షల వరకు ఉంది.

థార్ రాక్స్: రూ.1.20 లక్షల బెనిఫిట్స్

Advertisement

థార్ రాక్స్ కొనాలనుకునే వారికి కూడా ఆగస్టు నెలలో అద్భుతమైన ఆఫర్ ఉంది. ఈ ఎస్‌యూవీపై రూ.1.20 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇందులో రూ.92,000 నగదు తగ్గింపుతో పాటు రూ.28,000 విలువైన సిరామిక్ కోటింగ్ ప్యాకేజీ ఉంటుంది. థార్ రాక్స్ ధర రూ.12.52 లక్షల నుంచి రూ.23.52 లక్షల వరకు ఉంది. ఐదు డోర్ల డిజైన్ కారణంగా సాధారణ థార్‌తో పోలిస్తే కుటుంబ అవసరాలకు మరింత అనుకూలంగా ఉంటుంది.

స్కార్పియో క్లాసిక్‌: రూ.75,000 బెనిఫిట్స్

స్కార్పియో క్లాసిక్‌పై కూడా రూ.75,000 వరకు ప్రయోజనాలను మహీంద్రా అందిస్తోంది. ఇందులో రూ.50,000 నగదు తగ్గింపు, రూ.25,000 విలువైన యాక్సెసరీలు ఉన్నాయి. దీని ధర రూ.13.37 లక్షల నుంచి రూ.17.40 లక్షల వరకు ఉంటుంది. పాత తరహా డిజైన్, బలమైన డీజిల్ ఇంజన్‌ను ఇష్టపడేవారికి ఇది ఇప్పటికీ మంచి ఆప్షన్ గా కొనసాగుతోంది.

మూడు డోర్ల థార్‌:  రూ.50,000 తగ్గింపు

Advertisement

మూడు డోర్ల మహీంద్రా థార్‌పై రూ.50,000 వరకు నగదు తగ్గింపు లభిస్తోంది. దీని ధర రూ.10.32 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఉంటుంది. ఆఫ్‌ రోడ్ సామర్థ్యం ఈ వెహికల్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అయితే వెనుక సీట్లకు వెళ్లడం,  లగేజ్ స్పేస్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

బొలెరో పైనా భారీ తగ్గింపు

బొలెరో నియో, బొలెరో నియో ప్లస్ మోడళ్లపై కూడా రూ.45,000 వరకు నగదు తగ్గింపు అందుబాటులో ఉంది. బొలెరో నియో ధర రూ.8.99 లక్షల నుంచి రూ.10.79 లక్షల వరకు ఉండగా, నియో ప్లస్ ధర రూ.11.39 లక్షల నుంచి రూ.12.49 లక్షల వరకు ఉంది. గ్రామీణ ప్రాంతాలు, గుంతల రోడ్లపై ఎక్కువగా ఉపయోగించే వారికి ఈ మోడళ్లు అనుకూలంగా ఉంటాయి. ఇక XUV 3XOపై రూ.40,000 వరకు నగదు డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర రూ.7.79 లక్షల నుంచి రూ.15.04 లక్షల వరకు ఉంది. మంచి ఫీచర్లు, శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్లు ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి బాగా కలిసి వస్తున్నాయి.

Read Also: మారుతి సుజుకి నుంచి మరో ఈవీ వచ్చేస్తోంది.. ఏ మోడల్ అంటే?

Tags

Related News

Y43 మైక్రో SUV To ఎలక్ట్రిక్ MPV.. మారుతి వస్తున్న 4 క్రేజీ యుటిలిటీ వెహికల్స్ ఇవే!

మహీంద్రా BE 07 ఇంటీరియర్ లీక్.. వారెవ్వా.. ఏముంది గురూ!

2027 నాటికి 10 లక్షల కనెక్టెడ్ కార్లు.. హ్యుందాయ్ ప్లాన్ మామూలుగా లేదుగా!

మారుతి సుజుకి నుంచి మరో ఈవీ వచ్చేస్తోంది.. ఏ మోడల్ అంటే?

విన్ ఫాస్ట్ మ్యాక్సీ స్కూటర్ కు పేటెంట్.. స్టన్నింగ్ లుక్ తో మెస్మరైజ్!

జీరో To హీరో.. ఈవీ మార్కెట్ లో దుమ్మురేపుతున్న విన్‌ఫాస్ట్‌!

టాటా నానో మళ్లీ వస్తుందా? అదీ ఎలక్ట్రిక్ వెర్షన్ లో!

Big Stories

Advertisement
×