BigTV English

CIBIL Score: సిబిల్ స్కోర్ ఎలా లెక్కిస్తారో తెలుసా.. ఈ నాలుగు అంశాలే చాలా ప్రధానం

CIBIL Score: సిబిల్ స్కోర్ ఎలా లెక్కిస్తారో తెలుసా.. ఈ నాలుగు అంశాలే చాలా ప్రధానం

CIBIL Score: ప్రస్తుతం అనేక మంది ఉద్యోగుల ఆర్థిక జీవనంలో సిబిల్ స్కోర్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. లోన్ కావలన్నా, క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా కూడా ఈ స్కోర్ తప్పనిసరిగా మారిపోయింది. దీంతో ఒక వ్యక్తి ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించిన ఇది ఒక ముఖ్యమైన సూచికగా మారిపోయింది. సాధారణంగా ఇది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఈ క్రమంలో 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉన్నప్పుడు మంచి క్రెడిట్ రేటింగ్‌గా పరిగణిస్తారు. ఈ స్కోరు మీ క్రెడిట్ చరిత్ర బాగుందని చెబుతుంది.


చెల్లింపుల విషయంలో

మీరు తీసుకున్న రుణాలు, చెల్లింపులు, ఆర్థిక వ్యవహారాలపై ఆధారపడి ఈ స్కోర్‎ను నిర్ణయిస్తారు. అయితే సిబిల్ స్కోరు ఎలా లెక్కించబడుతుందో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి దీని గురించి తెలుసుకుంటే ఆర్థిక చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండవచ్చు. ఈ క్రమంలో సిబిల్ స్కోరు లెక్కించడానికి నాలుగు ప్రధాన అంశాలు ఉన్నాయని ఆయా సంస్థలు చెప్పడం విశేషం. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

సరిగ్గా చెల్లింపు చేస్తున్నారా

మీ చెల్లింపు చరిత్ర (30%) సిబిల్ స్కోరులో అత్యంత ముఖ్యమైన అంశంగా ఉంటుంది. మీరు ఎన్ని చెల్లింపులు ఏ సమయానికి చేశారు, ఎన్ని చెల్లింపులు ఆలస్యం అయ్యాయి. దీంతోపాటు మీరు ఎన్ని EMIలను కోల్పోయారనే అంశం ఆధారంగా లెక్కిస్తారు. చెల్లింపుల ఆలస్యం మీ స్కోరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి సమయానికి చెల్లింపులు చేయడం అనేది చాలా ముఖ్యమనేది గుర్తుంచుకోవాలి.


Read Also: BoAt Airdopes 91 Prime: బ్రాండెడ్ వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్‌బడ్స్.. ఏకంగా 3వేల తగ్గింపు ఆఫర్

క్రెడిట్ వినియోగం ఎలా ఉంది

మీ పేరుపై ఉన్న మొత్తం క్రెడిట్ ఎంత, మీరు ఎంత క్రెడిట్ ఉపయోగిస్తున్నారనే దానిపై (25%) కూడా ఈ స్కోరు పరిగణించబడుతుంది. మీ క్రెడిట్ లిమిట్‌ మీ వినియోగంలో ఉన్న క్రెడిట్‌తో పోలిస్తే, ఈ నిష్పత్తి 30-40 శాతానికి మించి ఉండకూడదు. అంటే మీ శాలరీ కంటే, ఎక్కువ క్రెడిట్ వినియోగం ఉంటే మీ స్కోరుకు ప్రతికూల ప్రభావం పడుతుంది.

రుణాల ఎంపిక కూడా..

మీ రుణాలు ఏ రకమైనవి (25%) అనేది కూడా చాలా ముఖ్యం. అంటే సురక్షిత రుణాలు, అసురక్షిత రుణాలనే విషయాలను కూడా పరిగణిస్తారు. సురక్షిత రుణాలంటే ఉదాహరణకు హోమ్ లోన్ లేదా కార్ లోన్స్ వంటి వాటి విషయంలో మీ స్కోర్ అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ రుణాల వ్యవధి కూడా ముఖ్యమైనది. దీని ద్వారా మీరు తీసుకున్న రుణాల రకం, వాటి వ్యవధి మీ స్కోరును ప్రభావితం చేస్తుంది.

ఇతర కార్యకలాపాలు

మీ రుణాలకు సంబంధించిన ఇతర కార్యకలాపాలు (20%) కూడా స్కోరులో పరిగణించబడతాయి. మీరు ఇటీవల ఎన్ని రుణాలు తీసుకున్నారు, మీ పేరు మీద ఎన్ని రుణ ఖాతాలు ఇంకా అలాగే ఉన్నాయి. ఇవన్నీ కూడా దీనిలోకి వస్తాయి. ఈ అంశం కూడా మీ క్రెడిట్ చరిత్రను మరింత పెంచుకోవడానికి లేదా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ క్రమంలో సిబిల్ స్కోరు లెక్కించడానికి ఈ నాలుగు అంశాలు ప్రధానంగా పరిగణించబడతాయి. మీరు ఈ నాలుగింటిని అదుపు చేసుకుంటే, మీ సిబిల్ స్కోరు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

Related News

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Big Stories

×