BigTV English

Balesh Dhankar Rapist: బిజేపీ నాయకుడికి 40 ఏళ్ల జైలు.. మహిళలపై అత్యాచారం చేసి వీడియోలు..

Balesh Dhankar Rapist: బిజేపీ నాయకుడికి 40 ఏళ్ల జైలు.. మహిళలపై అత్యాచారం చేసి వీడియోలు..

BJP Balesh Dhankar Rapist| భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక నాయకుడికి కోర్టు 40 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. మహిళలపై అత్యాచారం చేయడం, వారిపై లైంగిక దాడులు చేసి.. ఆ ఆకృత్యాలను తన పైశాచిక ఆనందం కోసం వీడియోలు తీయడం వంటి నేరాలకు నిందితుడు పాల్పడ్డాడు. ఈ నేరాలన్నీ నిరూపితం కావడంతో న్యాయస్థానం అతని పట్ల కఠినంగా వ్యవహరించింది. విధించిన శిక్షాకాలంలో 30 ఏళ్ల వరకు జైలు బయట ప్రపంచం అతను చూడకూడదని న్యాయమూర్తి ఆగ్రహంగా చెప్పారు. అయితే ఇదంతా భారత దేశంలో జరగలేదు. ఆస్ట్రేలియాలో ఈ ఘటన జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో ఐదుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన నేరానికి గాను ఓ ప్రముఖ భారతీయడికి అక్కడి న్యాయస్థానం 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 30 ఏళ్ల వరకు ఎలాంటి పెరోల్‌కు అవకాశం లేదని శుక్రవారం వెలువరించిన తీర్పులో స్పష్టం చేసింది. దీంతో.. ఈ కేసు చర్చనీయాంశంగా మారింది.

భారతదేశంలోని హర్యాణా రాష్ట్రానికి చెందిన బాలేశ్ ధన్‌ఖడ్ (Balesh Dhankar, 43) మోసపూరిత ఉద్యోగ ప్రకటనలతో ఐదుగురు కొరియా మహిళలను ఆకర్షించి, ప్రణాళిక ప్రకారం వారిని సిడ్నీలోని తన నివాసానికి రప్పించాడు. అక్కడ వారికి డ్రగ్స్ కలిపిన డ్రింక్స్ ఇచ్చి మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువైందని డౌనింగ్ సెంటర్ డిస్ట్రిక్ట్ కోర్టు పేర్కొంది. తీర్పు వెలువడిన సమయంలో ధన్‌ఖడ్ కోర్టులోనే ఉన్నాడు. భవిష్యత్ లైంగిక సంతృప్తి కోసం అతను తన నేరాలను రికార్డు చేసి, వీడియోల రూపంలో భద్రపర్చుకోవడాన్ని జడ్జి మైకేల్ కింగ్ ప్రస్తావించారు.


ఇక, బాధితులంతా 21–27 ఏళ్ల మధ్య వయస్కులైన కొరియా మహిళలు. ఒక్కొక్కరికి వారి తెలివితేటలు, అందాన్ని బట్టి వేరుగా మార్కులు కూడా వేసేవాడని పోలీసులు తెలిపారు. బాధిత మహిళలతో జరిపిన చర్చలను సైతం రికార్డు చేశాడు. బాధిత యువతులకు ఉద్యోగం అవసరం ఎంతుందనే దాన్ని బట్టి వారిని లోబర్చుకేనేందుకు కుట్రను అమలు చేసేవాడు. ఈ క్రమంలో చివరి బాధితురాలు 2018 అక్టోబర్‌లో ధన్ ఖడ్‌ కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడంతో అతని పైశాచిక కృత్యాల గురించి బయటి ప్రపంచానికి తెలిసింది.

Also Read:  కాళ్లకు మేకులు కొట్టి ఆమెను దారుణంగా చంపేశారు- భయంతో వణికిపోతున్న జనం

పోలీసులు సిడ్నీ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని ఇతడి కార్యాలయంపై దాడి చేసి డ్రగ్స్‌తోపాటు టేబుల్ క్లాక్ మాదిరిగా ఉన్న వీడియో రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే అత్యాచారాల క్రమం అంతా నిక్షిప్తమై ఉండటం గమనార్హం. విచారణ జరిపిన కోర్టు ధన్‌ఖడ్ 39 నేరాలకు పాల్పడినట్లు గుర్తించింది. ఇందులో 13 నేరాలు లైంగిక దాడికి సంబంధించినవిగా ఉన్నాయి. సిడ్నీ నగరంలోని డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి మైకేల్ కింగ్ 40 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ.. ఆ శిక్షా కాలంలో పెరోల్‌కు వీలులేకుండా 30 ఏళ్లు గడపాలని చెప్పారు. దీంతో అని జైలు శిక్ష 2053తో ముగియనుంది. మొత్తం 40 ఏళ్ల జైలు శిక్ష పూర్తయ్యే సరికి ధన్‌ఖడ్‌కు 83 ఏళ్లొస్తాయి.

అయితే కోర్టులో న్యాయమూర్తి తీర్పు చెప్పే సమయంలో ధనఖడ్ కించిత్ కూడా స్పందించలేదు. పైగా లేచి మాట్లాడుతూ.. “నేను బలవంతం చేయలేదు. ఆ యువతలతో పరస్పర అంగీకారంతనే చేశాను. అయితే కోర్టు అందుకు అంగీకరించ లేదు. కోర్టు తీర్పుతో నేను ఏకీభవించడం లేదు,” అని చెప్పాడు.

ఉన్నత పదవుల్లో ఉంటూనే..
హర్యాణా రాష్ట్రానికి చెందిన ధన్ ఖడ్ 2006లో ఆస్ట్రేలియా దేశానికి చదువుకునేందుకు వెళ్లి.. అక్కడ భారతీయ ఆస్ట్రేలియన్లలో పేరున్న నాయకుడి స్థాయికి ఎదిగాడు. భారతీయ జనతా పార్టీ శాటిలైట్ గ్రూపును నెలకొల్పాడు. 2018లో అరెస్టయ్యే వరకు హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధిగా వ్యవహరించాడు. బ్రిటిష్ అమెరికన్ టొబాకో, టొయోటా, ఏబీసీ, సిడ్నీ ట్రెయిన్స్ కంపెనీలకు డేటా విజువలైజేషన్ కన్సల్టెంట్‌గా సేవలందించాడు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ప్రముఖుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×