EPFO Passbook Lite: ఈపీఎఫ్ఓ 3.0 సంస్కరణలో భాగంగానే ఆన్‌లైన్ పాస్‌బుక్ సింపుల్ వెర్షన్ ‘పాస్‌బుక్ లైట్’ను ప్రారంభించింది. గతంలో ఖాతాదారులు పీఎఫ్ లావాదేవీలను వీక్షించడానికి ప్రత్యేక పోర్టల్‌లోకి లాగిన్ అయ్యేవారు. పాస్‌బుక్ లైట్‌తో చందాదారులు బ్యాలెన్స్ తనిఖీ, విత్ డ్రా వివరాలు నేరుగా చెక్ చేసుకోవచ్చు. పాస్ బుక్ తనిఖీ చేయడానికి సభ్యులు రెండుసార్లు లాగిన్ అయ్యేవారు. పాస్ బుక్ లైట్ లో పలుమార్ల లాగిన్ అవసరం లేదు. అందువల్ల ఉద్యోగులు వేగంగా, సులభంగా పీఎఫ్ వివరాలు తనిఖీ చేయవచ్చు.
పీఎఫ్ పాస్‌బుక్ లో ప్రతి లావాదేవీ, జమ అయిన వడ్డీ, ప్రతి నెల డిపాజిట్ వివరాలు ఉంటాయి. అయితే, మొత్తం బ్యాలెన్స్, విత్ డ్రా సమాచారాన్ని త్వరగా యాక్సెస్ చేయడానికి పాస్‌బుక్ లైట్ ను ఈపీఎఫ్ఓ అందుబాటులోకి తీసుకొచ్చింది. పూర్తి సమాచారం, గ్రాఫికల్ డిస్‌ప్లే చూసేందుకు చందాదారులు ఓల్డ్ పాస్‌బుక్‌ను ఉపయోగించవచ్చు. ప్రత్యేక సైట్‌ల ద్వారా కాకుండా త్వరగా బ్యాలెన్స్‌లను చెక్ చేసుకునేందుకు పాస్‌బుక్ లైట్ ఉపయోగపడుతుంది.
ఈపీఎఫ్ఓ 3.0 సంస్కరణల్లో భాగంగా పాస్‌బుక్ లైట్‌ను ప్రారంభించింది. ఖాతాదారులు ఈ పోర్టల్ ద్వారా ‘Annexure k’ సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో ఉద్యోగులు ఉద్యోగాలు మారేటప్పుడు పీఎఫ్ బదిలీని ట్రాక్ చేయవచ్చు. ఈ ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడానికి క్లెయిమ్‌లు, బదిలీల ఆమోదాల కోసం దిగువ స్థాయి అధికారులకు ఈపీఎఫ్ఓ అధికారం అప్పగించింది. దీంతో ఖాతాదారులు వేగవంతంగా ఈపీఎఫ్ఓ సేవలు పొందవచ్చు. పీఎఫ్ ఖాతాల తనిఖీల్లో చందాదారుల ఇబ్బందులను తగ్గించడానికి డిజిటల్ వైపు ఈపీఎఫ్ఓ అడుగులు వేస్తుంది.
Also Read: నెలకు రూ.4,000 పెట్టుబడితో రూ.80 లక్షలు మీ సొంతం.. ఈ గోల్డ్ SIP గురించి తెలుసా?
ఉద్యోగులు పీఎఫ్ బ్యాలెన్స్‌లను తనిఖీ చేయడం అనేది గతంలో పెద్ద ఇబ్బందిగా ఉండేది. లాగిన్ సమస్యలు ఎదుర్కొనేవారు. పాస్‌బుక్ ఓపెన్ అవ్వడానికి చాలా సమయం పట్టేది. పదవీ విరమణకు దగ్గరగా ఉన్నవారికి లేదా తరచూ ఉద్యోగం మారుతున్న వారికి తమ పీఎఫ్ వివరాలు సులభంగా తెలుసుకునేందుకు పాస్‌బుక్ లైట్ ఉపయోగపడుతుంది. ‘Annexure k’ కి సులభమైన యాక్సెస్, వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెసింగ్‌కు ఇది సహాయపడుతుంది.