Maruti S-Presso: భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీల్లో ఒకటైన మారుతి సుజుకి..కేంద్ర ప్రభుత్వం సవరించిన జీఎస్టీ రేట్ల ప్రకారం కార్ల ధరలు తగ్గించింది. కార్ల ధరల తగ్గింపు తరువాత మారుతి ఆల్టో K10 అత్యంత తక్కువ ధరకు లభిస్తుంది. లగ్జరీ బైక్ ధరకే మారుతి కారు లభిస్తుంది. అయితే మారుతి S-ప్రెస్సో ఇప్పుడు ఆల్టో K10 కంటే రూ. 20,000 చౌకగా లభిస్తుంది.
వేరియంట్- మారుతీ S-ప్రెస్సో- మారుతి ఆల్టో K10- ధరలో తేడా
Std (O) :రూ.3.50 లక్షలు- రూ.3.70 లక్షలు- (-) రూ. 20,000
LXi (O): రూ.3.80 లక్షలు- రూ.4 లక్షలు- (-) రూ. 20,000
VXi (O) :రూ.4.30 లక్షలు- రూ.4.5 లక్షలు- (-) రూ. 20,000
LXi (O) CNG: రూ.4.62 లక్షలు -రూ.4.82 లక్షలు- (-) రూ. 20,000
VXi ప్లస్ (O) :రూ.4.80 లక్షలు- రూ.5 లక్షలు- (-) రూ 20,000
VXi (O) CNG: రూ. 5.12 లక్షలు- రూ. 5.32 లక్షలు -(-) రూ. 20,000
వేరియంట్ మారుతి S-ప్రెస్సో మారుతి ఆల్టో K10 ధరలో వ్యత్యాసం
VXi (O) AMT రూ. 4.75 లక్షలు రూ. 4.95 లక్షలు (-) రూ. 20,000
VXi ప్లస్ (O) AMT రూ. 5.25 లక్షలు రూ. 5.45 లక్షలు (-) రూ. 20,000
మారుతి S-ప్రెస్సో అన్ని వేరియంట్‌లు ఆల్టో K10 వేరియంట్‌ల కంటే రూ. 20,000 తక్కువకు లభిస్తున్నాయి.
మారుతి ఎస్-ప్రెస్సో, మారుతి ఆల్టో K10 రెండూ ఒకే విధమైన డాష్ బోర్డ్ కలిగి ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, వాయిస్ కంట్రోల్స్, ఫ్రంట్ పవర్ విండోస్, మాన్యువల్ ఏసీ ఉన్నాయి. అయితే, ఎస్-ప్రెస్సోలో ఎలక్ట్రికల్ ఓఆర్వీఎం, ఇంజిన్ ఐడిల్ స్టార్ట్/స్టాప్ (పెట్రోల్ వెహికల్స్) కూడా ఉన్నాయి. అయితే ఈ రెండు ఫీచర్స్ ఆల్టో K10లో లేవు. మరోవైపు, ఆల్టో K10లో 4-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉంది. ఇది ఎస్-ప్రెస్సో 2-స్పీకర్ సౌండ్ సిస్టమ్ కంటే క్లియర్ గా వినిపిస్తుంది.
సెక్యూరిటీ పరంగా ఎస్-ప్రెస్సోలో రెండు హ్యాచ్‌బ్యాక్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు, అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్ ఉన్నాయి. కానీ ఎస్-ప్రెస్సో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో ఆల్టో K10 ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి.