E-Paper
Advertisement

ప్రతి నెలా ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఎంత వరకూ చేయొచ్చు? డబ్బు ఆదా చేసే సూపర్ ఫార్ములా ఇదే!

ప్రతి నెలా ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఎంత వరకూ చేయొచ్చు? డబ్బు ఆదా చేసే సూపర్ ఫార్ములా ఇదే!
Advertisement

Online shopping budget tips: ఉదయం లేవగానే మొబైల్‌లో.. నోటిఫికేషన్లు, రాత్రి పడుకునే ముందు ఇన్‌స్టా రీల్స్.. ఎక్కడ చూసినా 50% డిస్కౌంట్, ఫ్లాష్ సేల్స్ అంటూ ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ ఊరిస్తున్నాయి. కేవలం రూ.299కే టీ-షర్ట్, రూ.999కే స్మార్ట్ వాచ్ అనిపించగానే మనకు తెలియకుండానే ‘బై నౌ’ నొక్కేస్తున్నాం. తీరా నెలాఖరుకు బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే షాక్ తగులుతోంది. అసలు ప్రతి నెలా ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. ఎంత ఖర్చు చేయడం కరెక్ట్?ఎక్కువ డబ్బులు పడకుండా తెలివిగా.. షాపింగ్ చేసే సూత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం.

నేటి డిజిటల్ యుగంలో.. క్విక్ కామర్స్ యాప్స్ వచ్చాక.. కేవలం 10 నిమిషాల్లోనే కావాల్సిన వస్తువులు ఇంటి ముందుంటున్నాయి. ఒకప్పుడు షాపింగ్ అంటే.. పండగలకో, పెళ్లిళ్లకో వెళ్లేవాళ్లం. కానీ.. ఇప్పుడు బోర్ కొడితే.. చాలు ఫోన్ తీసి ఏదో. ఒకటి ఆర్డర్ పెట్టడం అలవాటుగా మారింది. చిన్న చిన్న మొత్తాలే కదా అనుకుంటూ రూ.300, రూ.500 చొప్పున ఖర్చు చేస్తూ పోతే..నెలాఖరుకు అది వేల రూపాయలకు చేరుతోంది. ఆర్థిక నిపుణుల ప్రకారం, మీ ఆదాయంలో ఆన్‌లైన్ షాపింగ్‌కు ఒక కచ్చితమైన పరిమితి ఉండాలి.

అసలు ఎంత ఖర్చు చేయాలి?

Advertisement

మీరు నెలకు ఎంత సంపాదిస్తున్నారు .. అనే దానిపై మీ షాపింగ్ బడ్జెట్ ఆధారపడి ఉంటుంది. దీని కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక నిపుణులు సూచించే అత్యంత సులభమైన ఫార్ములా ’50-30-20 రూల్’.

50% (అవసరాలు – Needs): మీ నెల వారీ జీతంలో 50 శాతాన్ని ఇంటి అద్దె, కరెంట్ బిల్లులు, పిల్లల ఫీజులు, నిత్యావసర సరుకుల కోసం కేటాయించాలి. మీరు కిరాణా సరుకులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే.. అది ఈ 50 శాతం బడ్జెట్ కిందకే వస్తుంది.

Advertisement

30% (కోరికలు – Wants): బట్టలు, గాడ్జెట్లు, కాస్మెటిక్స్, బయట ఫుడ్ ఆర్డర్లు, సినిమాలు వంటి.. వాటికి మీ జీతంలో గరిష్టంగా 30 శాతం మాత్రమే వాడాలి. ఇందులోనూ.. కేవలం ఆన్‌లైన్ షాపింగ్ కోసం మీ నెల వారి ఆదాయంలో 5% నుంచి 10% మించకుండా చూసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఉదాహరణకు, మీ నెల జీతం రూ. 40,000 అనుకుంటే.. బట్టలు, ఇతర వస్తువుల ఆన్‌లైన్ షాపింగ్ కోసం నెలకు రూ. 2,000 నుంచి రూ. 4,000 లోపు మాత్రమే ఖర్చు చేయాలి.

20% (పొదుపు – Savings): మిగిలిన 20 శాతాన్ని కచ్చితంగా సిప్, గోల్డ్ లేదా ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో పొదుపు చేయాలి.

ఆన్‌లైన్ షాపింగ్ ఖర్చులను కంట్రోల్ చేసే 4 స్మార్ట్ ట్రిక్స్:

1. 24 గంటల రూల్ పాటించండి:
ఆన్‌లైన్‌లో ఏదైనా రూ. 1,500 లేదా రూ. 2,000 విలువైన వస్తువు నచ్చగానే వెంటనే కొనేయకండి. దాన్ని ‘కార్ట్’లో వేసి 24 గంటలు వదిలేయండి. మరుసటి రోజు కూడా ఆ వస్తువు మీకు నిజంగానే అవసరమనిపిస్తేనే కొనండి. 80 శాతం సందర్భాల్లో మరుసటి రోజుకు ఆ వస్తువుపై ఆసక్తి తగ్గిపోతుంది. తద్వారా మీ డబ్బు ఆదా అవుతుంది.

2. ‘బై నౌ పే లేటర్’ ఉచ్చులో పడకండి:
ప్రస్తుతం చాలా యాప్స్ ‘నో కాస్ట్ ఈఎంఐలేదా ‘పే లేటర్’ ఆప్షన్లు ఇస్తున్నాయి. చేతిలో డబ్బు లేకపోయినా రూ. 15,000 ఫోన్ లేదా రూ. 5,000 బ్రాండెడ్ షూస్ కొనేలా ఇవి ప్రోత్సహిస్తాయి. ఇది మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెడుతుంది. మీ అకౌంట్‌లో పూర్తి డబ్బు ఉన్నప్పుడే.. ఆ వస్తువును కొనడం అలవాటు చేసుకోండి.

3. షాపింగ్ కోసం ప్రత్యేక వాలెట్ లేదా అకౌంట్:
ప్రతి నెలా జీతం పడగానే.. మీ ఆన్‌లైన్ షాపింగ్ బడ్జెట్ (ఉదాహరణకు రూ. 3,000) ను ఒక డిజిటల్ వాలెట్‌లోకి లేదా సెపరేట్ యూపీఐ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. ఆ నెలంతా కేవలం ఆ డబ్బుతోనే షాపింగ్ చేయాలి. ఆ బ్యాలెన్స్ అయిపోగానే ఆ నెలకు షాపింగ్ ఆపేయాలి.

4. అనవసర నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి:
“సేల్ ముగియడానికి ఇంకా 2 గంటలే ఉంది”, “మీ కోసం ప్రత్యేక కూపన్” అంటూ షాపింగ్ యాప్స్ పంపే నోటిఫికేషన్ల వల్లే మనం ఎక్కువగా కొనుగోలు చేస్తాం. కాబట్టి, ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి షాపింగ్ యాప్స్ నోటిఫికేషన్లను మ్యూట్ చేయండి.

ఆన్‌లైన్ షాపింగ్ మన సమయాన్ని, డబ్బును ఆదా చేయడానికి ఒక మంచి సాధనం మాత్రమే కావాలి కానీ.. అది మన ఆర్థిక ప్రశాంతతను దెబ్బతీసే వ్యసనంగా మారకూడదు. పైన చెప్పిన 10% బడ్జెట్ పరిమితిని పాటిస్తే.. మీకు నచ్చినవి కొనుక్కుంటూనే భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేసుకోవచ్చు.

Related News

రూ. 30 వేలు ఆదాయం.. కష్టపడకుండా ప్రతీ నెలా, ఇంతకీ ఏం చెయ్యాలో తెలుసా?

బంగారంపై లోన్ తీసుకుంటున్నారా? బ్యాంకు వాళ్లను ఈ 5 ప్రశ్నలు కచ్చితంగా అడగండి!

డిసెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు మొదలు ఆధార్ వరకు, ఇంకా ఏంటంటే..

నటనలో రజనీకాంత్ మనవడు.. టెక్నాలజీలో సీఈఓ.. ఆశ్చర్యపరుస్తున్న 13 ఏళ్ల రిత్విక్!

అంచనాలు తారుమారు.. ఒక్కసారిగా ఎగిసిన బంగారం ధర, కొనుగోలుదారులకు షాక్

అమెరికా మళ్లీ సుంకాల అస్త్రం.. భారత్‌పై 25 శాతం విధించే ఛాన్స్, వాషింగ్టన్ వాదనను ఖండించిన కేంద్రం

నెలకు 15 వేల పెట్టుబడి… 15 ఏళ్లలో కోటి… ఈ 15-15-15 రూల్ తెలుసా?

Big Stories

Advertisement
×