Rithvik Jothi Raj: సూపర్‌స్టార్ రజనీకాంత్ మనవడిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రిత్విక్ జ్యోతి రాజ్ (Rithvik Jothi Raj).. మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టాడు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఈ 13 ఏళ్ల కుర్రాడు.. తన స్నేహితులతో కలిసి ఓ సాఫ్ట్‌వేర్ వెంచర్‌ను ప్రారంభించి సర్ ప్రైజ్ చేస్తున్నాడు. కేవలం నటనలోనే కాకుండా కోడింగ్, రోబోటిక్స్ వంటి రంగాలపై తనకున్న ఆసక్తిని చాటుకుంటున్నాడు.
ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యాపార ప్రయోగం గురించి రిత్విక్ మాట్లాడాడు. ఎలాంటి ప్రణాళిక లేకుండానే సరదాగా వ్యాపారాన్ని ప్రారంభించినట్లు తెలిపాడు. ‘వీడియో కాల్ లో మాట్లాడుకుంటున్నప్పుడు ఈ వ్యాపార ఆలోచన పుట్టింది. ఎందుకు ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయకూడదు అని ఆలోచించాం. కొద్దిగా కోడింగ్ వచ్చు కాబట్టి ప్రయత్నిద్దాం అనుకున్నాం’ అని రిత్విక్ చెప్పుకొచ్చాడు.
అలా సరదాగా మిత్రుల మధ్య జరిగిన డిస్కషన్.. చిన్న వ్యాపార సంస్థగా రూపుదిద్దుకుంది. కోడింగ్ గురించి అడిగినప్పుడు తనకు పైథాన్ (Python) ప్రోగ్రామింగ్ భాషపై అవగాహన ఉందని రిత్విక్ చెప్పాడు. ఇక ఇతర టెక్నాలజీ నైపుణ్యాలేంటి అని అడిగితే ‘రోబోలు తయారు చేయడం.. అంతే’ అంటూ ఎంతో సింపుల్‌గా సమాధానమిచ్చాడు.
తన స్నేహితులు కలిసి చేస్తున్న పని గురించి కూడా రిత్విక్ వివరించాడు. తమ వెబ్‌సైట్ ద్వారా ఉత్పత్తులను విక్రయించడంతో పాటు కోర్సులు కూడా అందిస్తున్నట్లు తెలిపాడు. అయితే వెబ్‌సైట్‌కు ఇంకా పెద్దగా విజిటర్స్ రావడం లేదని.. స్పందన తక్కువగా ఉన్నప్పటికీ టీమ్ అంతా కలిసి దాన్ని మెయింటెయిన్ చేస్తున్నామని తెలిపాడు. ఈ సంస్థలో కీలక సభ్యులు ఐదుగురు ఉండగా మరో ఐదుగురు గ్రూప్‌తో కలిసి పనిచేస్తున్నట్లు రిత్విక్ చెప్పుకొచ్చాడు.
Also Read: ప్రపంచంలోనే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. మన ఇండియాలోనే.. అస్సలు మిస్సవ్వకండి!
కోయంబత్తూరుకు చెందిన రిత్విక్.. ‘రితు రాక్స్’ (Rithu Rocks) అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి ‘ఓ2’ (O2), ‘సర్దార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాల్లో నటించాడు. అయితే రజనీకాంత్‌తో కలిసి నటించిన ‘జైలర్’ (2023) అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ తమిళ సూపర్ హిట్ చిత్రంలో రజనీ మనవడిగా రిత్విక్ నటించాడు. అక్టోబర్ 2026లో విడుదలైన సీక్వెల్ ‘జైలర్ 2’లోనూ అదే పాత్రలో కనిపించాడు.
Also Read: మీ ఫోన్ నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవ్వాలా? ఈ రియల్‌మీ కొత్త పవర్ బ్యాంక్ మీకోసమే