Gold loan tips: అత్యవసరంగా.. డబ్బు అవసరమైనప్పుడు మనందరికీ.. ముందుగా గుర్తొచ్చేది ఇంట్లోని బంగారమే. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47 వేలకు పైగానే ఉంది. బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో.. బంగారంపై భారీగానే లోన్ వస్తోంది. కానీ.. తొందరపడి ఏదో.. ఒక బ్యాంకులో బంగారం తాకట్టు పెడితే.. తర్వాత వడ్డీల భారం, హిడెన్ ఛార్జీలతో.. ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే.. గోల్డ్ లోన్ తీసుకునే ముందు కొన్ని రకాల జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు బయట బోర్డులపై.. 8.5% లేదా 9% నుంచే వడ్డీ ప్రారంభం అని రాస్తాయి. కానీ..మీరు తీసుకునే లోన్ మొత్తాన్ని బట్టి,టైం బట్టి వడ్డీ రేటు 9% నుంచి 15% వరకు మారొచ్చు. అంతే.. కాకుండా..మీరు ఎంచుకున్న వడ్డీ రేటు లోన్ పూర్తయ్యే వరకు ఒకేలా ఉంటుందా.. లేక మార్కెట్ ఒడిదుడుకులను బట్టి మారుతుందా అనేది ముందే.. స్పష్టంగా అడగండి. కొన్ని ప్రైవేట్ సంస్థలు మొదటి మూడు నెలలు తక్కువ వడ్డీ వేసి, ఆ తర్వాత.. వడ్డీని అమాంతం పెంచేస్తుంటాయి .ఈ విషయంలో చాలా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.
చాలా మంది కేవలం వడ్డీ రేటు మాత్రమే.. చూసి లోన్ తీసుకుంటారు. కానీ..అసలు కథ లోన్ తీసుకున్న తర్వాత మొదలవుతుంది. బంగారం క్వాలిటీ చెక్.. చేసేందుకు.. ‘వాల్యుయేషన్ ఛార్జీలు’, లోన్ ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ఎస్ఎంఎస్ అలర్ట్ ఛార్జీలు అంటూ రకరకాల పేర్లతో మీ లోన్ మొత్తం నుంచే డబ్బులు కట్ చేస్తారు. కొన్ని బ్యాంకులు జీరో.. ప్రాసెసింగ్ ఫీజు ఆఫర్లు ఇస్తుంటాయి. కాబట్టి.. అసలు మీ చేతికి ఎంత డబ్బు వస్తుంది, ఎన్ని రకాల ఛార్జీలు విధిస్తున్నారు అనే పూర్తి వివరాలను ముందే అడిగి తెలుసుకోండి.
గోల్డ్ లోన్ తిరిగి చెల్లించడానికి బ్యాంకులు రకరకాల ఆప్షన్లు ఇస్తాయి. ప్రతి నెలా కేవలం వడ్డీ మాత్రమే కడుతూ చివర్లో.. అసలు కట్టే ‘బుల్లెట్ రీపేమెంట్’ పద్ధతి ఉందా? లేదా ప్రతి నెలా అసలు, వడ్డీ కలిపి ఈఎంఐ రూపంలో కట్టాలా? అనేది అడగండి. అన్నింటికంటే ముఖ్యంగా, మీ దగ్గర డబ్బులు సర్దుబాటు అయినప్పుడు గడువు కంటే ముందే లోన్ క్లోజ్ చేస్తే ఏమైనా పెనాల్టీ విధిస్తారా అని కచ్చితంగా అడగండి. చాలా ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రీ-క్లోజర్ ఛార్జీలు ఉండవు, కానీ కొన్ని ప్రైవేట్ సంస్థలు 1% నుంచి 2% వరకు పెనాల్టీ వసూలు చేస్తాయి.
అనుకోని ఆర్థిక ఇబ్బందుల వల్ల.. ఒకటి రెండు నెలలు వడ్డీ కట్టడం ఆలస్యమైతే .. బ్యాంకు విధించే జరిమానా ఎంత ఉంటుందో ముందే తెలుసుకోండి. సాధారణ వడ్డీకి.. అదనంగా 2% నుంచి 4% వరకు పెనాల్టీ వేసే అవకాశం ఉంటుంది. అలాగే.. లోన్ గడువు ముగిసిన తర్వాత కూడా డబ్బులు కట్టకపోతే.. బంగారాన్ని వేలం వేసే ముందు బ్యాంకు ఎన్ని నోటీసులు ఇస్తుంది ? ఎంత సమయం ఇస్తుంది అనే నిబంధనలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవాలి.
Also Read: పెళ్లి కోసం లోన్ తీసుకుంటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి!
మీరు తాకట్టు పెట్టేది మీ కష్టార్జితం, సెంటిమెంట్‌తో కూడా ముడిపడిన అంశం. మీరు బ్యాంకు లాకర్లో పెట్టిన బంగారానికి పూర్తి స్థాయి ఇన్సూరెన్స్ కవరేజ్.. ఉందా లేదా అని అడగండి. ఒకవేళ బ్యాంకులో.. దొంగతనం జరిగినా లేదా అగ్నిప్రమాదం వంటివి సంభవించినా మీ బంగారం విలువకు బ్యాంకు పూర్తి బాధ్యత వహిస్తుంది అనేది అగ్రిమెంట్లో ఉందో లేదో సరి చూసుకోండి. లోన్ తీసుకునేటప్పుడు.. బంగారం బరువు, క్యారెట్ల వివరాలు ఉన్న రిసిఫ్ట్ జాగ్రత్తగా దాచుకోవడం మర్చిపోవద్దు.
ఈ 5 ప్రశ్నలు అడగడం వల్ల .. మీకు ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకి, తక్కువ ఛార్జీలతో లోన్ దొరుకుతుందో స్పష్టమైన అవగాహన వస్తుంది. కనీసం రెండు మూడు బ్యాంకులను సంప్రదించి, వడ్డీ రేట్లను పోల్చుకున్న తర్వాతే.. మీ బంగారాన్ని తాకట్టు పెట్టడం మంచిది.