E-Paper
Advertisement

రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టాలి.. ఓటర్లను పాలకులు నిర్ణయించే పరిస్థితి వచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి

రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టాలి.. ఓటర్లను పాలకులు నిర్ణయించే పరిస్థితి వచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

Revanth Reddy: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ‘సంవిధాన్ రక్షా మార్చ్’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

రాజ్యాంగం, ఓటు హక్కు ప్రాధాన్యత

Advertisement

అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో గాంధీ, నెహ్రూ, పటేల్, అంబేడ్కర్ వంటి మహనీయులు మనకు రాజ్యాంగాన్ని అందించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. గతంలో రాచరిక వ్యవస్థలో రాజుల వారసులకే అధికారం దక్కిదన్నారు. కానీ, పాలన సామాన్య ప్రజల చేతుల్లోకి రావాలంటే రాజ్యాంగం అవసరమని నెహ్రూ, అంబేడ్కర్ భావించారని ఆయన పేర్కొన్నారు. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన వందల ఏళ్ల వరకు అక్కడ మహిళలకు ఓటు హక్కు లేదు. కానీ, మన దేశంలో అంబేడ్కర్ ఆలోచనలతో గిరిజనులు, దళితులు, మహిళలు, మైనార్టీలు అందరికీ సమానంగా ఓటు హక్కు లభించిందని ఆయన వివరించారు. ప్రజలు ఇచ్చిన అవకాశం, దేవుని ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని, ప్రజాస్వామ్యం కల్పించిన గొప్ప అవకాశం ఇదని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు

Advertisement

కొందరు తమ అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. గతంలో పాలకులను రాజ్యాంగం నిర్ణయిస్తే.. దురదృష్టవశాత్తు నేడు పాలకులే ఓటర్లను నిర్ణయించే పరిస్థితి వచ్చిందన్నారు. దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలకు చెందిన 13 కోట్ల ఓట్లను ఇప్పటికే తొలగించారు. మరో 7 కోట్ల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, నల్లధనం తెస్తామని ఇచ్చిన హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ, ఇప్పుడు ఓట్ల తొలగింపు ద్వారా నాలుగోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ చరిత్ర.. భవిష్యత్ లక్ష్యం

స్వాతంత్ర్య సాధన, సమాన అవకాశాల కల్పన కోసం 1885లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని ముఖ్యమంత్రి తెలిపారు. అహింస మార్గంలో స్వాతంత్ర్యం సాధించిన ఘనత కాంగ్రెస్‌దని, దేశం కోసం గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం కోసం పుట్టిన కాంగ్రెస్ వందేళ్ల క్రితం ఉంది.. ఇప్పుడు ఉంది.. మరో వందేళ్లూ ఉంటుంది అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబం పక్షాన నిలిచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 90 అసెంబ్లీ, 15 ఎంపీ స్థానాలను గెలిపించాలని ఆయన పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

Also Read: స్నాప్‌చాట్ పరిచయం.. ఉద్యోగం పేరుతో హోటల్‌కు పిలిచి యువతిపై లైంగిక దాడి!

Tags

Related News

డేంజర్ బెల్స్.. తెలంగాణలో ఈ నాలుగు జిల్లాలకు నీటి గండం!

టెక్ ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో యాపిల్ ఫస్ట్ స్టోర్, ముంబై- ఢిల్లీ తర్వాత..

స్నాప్‌చాట్ పరిచయం.. ఉద్యోగం పేరుతో హోటల్‌కు పిలిచి యువతిపై లైంగిక దాడి!

మా ర్యాలీ దెబ్బకు బీజేపీలో భయం.. అందుకే కౌంటర్ ర్యాలీలు: మహేష్ కుమార్ గౌడ్

300 మందిని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్.. కాచిగూడ స్టేషన్‌లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు!

పదవులు తీసుకుని కూర్చుంటే సరిపోదు.. పనిచేయాల్సిందే! ఫ్రంటల్ నేతలకు ఏఐసీసీ క్లాస్!

ఐవీఎఫ్ అండాల దందా వెనుక కేటీఆర్ హస్తం? బల్మూర్ వెంకట్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×