E-Paper
Advertisement

రూ.1000కి రూ.2000, రూ.లక్షకు రెండు లక్షలు.. మీ డబ్బును రెట్టింపు చేసే ప్రభుత్వ పథకం

రూ.1000కి రూ.2000, రూ.లక్షకు రెండు లక్షలు.. మీ డబ్బును రెట్టింపు చేసే ప్రభుత్వ పథకం
Advertisement

Kisan Vikas Patra Scheme: పెట్టుబడి అనగానే మొదటిగా ఆలోచించేది ఎంత రాబడి వస్తుందనే. మన పెట్టుబడికి తక్కువ టైంలో ఎక్కువ రాబడి వచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అది ఎఫ్డీ, SIP, గవర్నమెంట్స్ స్కీమ్.. ఏదైనా సరే కాస్త రాబడి ఎక్కువగా వచ్చే పథకాన్ని చూస్తుంటాం. మీ పెట్టుబడికి ఎలాంటి ఢోకా లేకుండా రూ.1000కి రెండు వేలు, రూ. లక్షకు రెండు లక్షలు వచ్చే అద్భుతమైన కేంద్ర ప్రభుత్వం పథకం ఒకటి ఉంది. అదే కిసాన్ వికాస్ పత్ర.

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లో కనీస పెట్టుబడి రూ.1000 కాగా, గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ ఇస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటును కేంద్రం సవరిస్తుంది. మీ డబ్బులు డబుల్ అవ్వాలంటే కచ్చితంగా 9 ఏళ్ల 7 నెలల పాటు పెట్టుబడిని కొనసాగించాలి.

రూల్స్, లాక్ ఇన్ పీరియడ్

Advertisement

1. ఇందులో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నెల నెలా పెట్టుబడికి అవకాశం లేదు. మీరు ఎంత మొత్తానైనా ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

2. 2.5 ఏళ్ల పాటు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. మొదటి 2 సంవత్సరాల 6 నెలల పాటు డబ్బులు విత్ డ్రా చేయడానికి వీలు పడదు. ఆ తర్వాత అత్యవసరమైతే, కిసాన్ వికాస్ పత్ర క్యాన్సిల్ చేసి అసలు, వడ్డీ తీసుకోవచ్చు. మెచ్యూరిటీపై టీడీఎస్ కోత ఉండదు.

అదనపు ప్రయోజనాలు

Advertisement

1. కిసాన్ వికాస్ పత్ర పై లోన్ తీసుకోవచ్చు. ఈ సర్టిఫికెట్ ను బ్యాంకులో తాకట్టు పెట్టి సులభంగా లోన్ పొందవచ్చు.
2. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ ఇది. మీ పెట్టుబడికి నూటికి నూరు శాతం గ్యారెంటీ ఉంటుంది.
3. మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లో చాలా సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చు.
4. నామినీ పేరు యాడ్ చేసుకుంటే.. మీకు ఏదైనా జరిగినా నామినీ మీ పెట్టుబడిని పొందవచ్చు.

Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 90% సబ్సిడీతో స్వయం ఉపాధి పథకాలు.. అప్లై చేసుకోండిలా!

సర్టిఫికెట్ల రకాలు

  • సింగిల్ హోల్డర్ టైప్ అకౌంట్ – ఈ రకమైన అకౌంట్ ను వ్యక్తి తన కోసం లేదా మైనర్, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి తరపున లేదా పది ఏళ్లు వయస్సు నిండిన మైనర్ ఓపెన్ చేయవచ్చు.
  • జాయింట్ ఎ-టైప్ అకౌంట్– ఈ రకమైన అకౌంట్ ను గరిష్టంగా ముగ్గురి పేర్ల మీద జాయింట్ గా ఓపెన్ చేయవచ్చు. దీని ద్వారా వచ్చే సొమ్ము జాయింట్ అకౌంట్ హోల్డర్స్ కు ఉమ్మడిగా లేదా జీవించి ఉన్నవారికి చెల్లిస్తారు.
  • జాయింట్ బి-టైప్ అకౌంట్- ఈ రకమైన అకౌంట్ ను గరిష్టంగా ముగ్గురి పేర్ల మీద ఉమ్మడిగా తెరవచ్చు. దీని ద్వారా వచ్చే సొమ్మును అకౌంట్ హోల్డర్ ఎవరికైనా లేదా జీవించి ఉన్నవారికి చెల్లిస్తారు.

Related News

ఫుడ్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. SBI ఎటర్నల్ కార్డ్ లాంచ్.. ఉచితంగా జొమాటో గోల్డ్ సేవలు!

బంగారం-వెండి వస్తువుల ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

చిన్న వయసులోనే కోటీశ్వరుడు అవ్వడం ఎలా? ఇదిగో అత్యుత్తమ ప్లాన్.. రూ.10 వేలు ఉంటే చాలు!

పోటీకి మేం సిద్ధమే.. మస్క్ ఆరోపణలపై రిలయన్స్ స్ట్రాంగ్ కౌంటర్

మధ్యతరగతి రిటైర్మెంట్ కోసం రూ.1 కోటి సరిపోతుందా? భవిష్యత్తు కోసం మేజిక్ ఫిగర్ ఎంత?

భార్య లోన్ కట్టకపోతే భర్త పెన్షన్ డబ్బులు కట్ చేసిన బ్యాంక్.. కోర్టు తీర్పు ఇదే

తప్పుడు అకౌంట్‌కు యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ అయిందా? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయండి!

డబ్బులు కావాలని ఫోన్ చేస్తే.. బంధువులు, స్నేహితులకు ‘నో’ చెప్పడం ఎలా?

Big Stories

Advertisement
×