BigTV English

Hyundai i20 EMI Offer: ఇదేం గమ్మత్తు సామీ.. రూ.9845 వేలకే అదిరిపోయే కార్.. ఫీచర్లు కెవ్ కేక.. నమ్మకం కలగడం లేదా..? ఇది చదవండి!

Hyundai i20 EMI Offer: ఇదేం గమ్మత్తు సామీ.. రూ.9845 వేలకే అదిరిపోయే కార్.. ఫీచర్లు కెవ్ కేక.. నమ్మకం కలగడం లేదా..? ఇది చదవండి!

Hyundai i20 Down Payment And Emi: కారు కొనాలని అందరికీ ఉంటుంది. కానీ అధిక ధరల కారణంగా చాలా మంది తమ కోరికను చంపుకుంటున్నారు. అయితే ఎప్పట్నుంచో తక్కువ ధరలో అధిక ఫీచర్లు కలిగిన కార్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇదే బెస్ట్ ఛాయిస్. ఎందుకంటే అతి తక్కువ ధరలో మంచి కార్ అందుబాటులో ఉంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఐ20 భారత మార్కెట్లో ప్రసిద్ధి చెందిన కారు. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లోని ఈ ప్రీమియం కారు అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో అట్రాక్ట్ చేస్తోంది. ఇదే కాకుండా కారు సేఫ్టీ విషయంలో కూడా చాలా అద్భుతమైనదిగా ఉంది. మీరు కూడా ఈ ప్రీమియం కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కారు ధర, డౌన్ పేమెంట్, EMI ఆప్షన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.


ఈ కారు వెలుపలి డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. దీన్ని అమెజాన్ గ్రే, ఫైరీ రెడ్, అట్లాస్ వైట్, టైఫూన్ సిల్వర్‌తో సహా 2-డ్యూయల్ టోన్, 6-మోనో టోన్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ కారులో 5 మంది ప్రయాణించవచ్చు. ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో వస్తుంది. దీని ఇంజన్ గరిష్టంగా 83 PS శక్తిని, 115 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్ ఎంపికను పొందుతుంది.

వేరియంట్‌ను బట్టి లీటర్‌కు 16 – 20 కిమీ మైలేజీని ఇస్తుంది. హ్యుందాయ్ ఐ20 అనేక గొప్ప ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో మీకు 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో LED హెడ్‌లైట్లు, సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సన్‌రూఫ్ ఇవ్వబడ్డాయి. ప్రయాణీకుల భద్రత కోసం ఈ వాహనంలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్, ESC, హిల్ అసిస్ట్ కంట్రోల్, డే-నైట్ IRVM, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ప్రయాణికులందరికీ మూడు-పాయింట్ సీట్ బెల్ట్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హెడ్ల్యాంప్ వంటి ఆటోమేటిక్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.


Also Read: 26 కి.మీ మైలేజీ అందించే బెస్ట్ పెట్రోల్ కార్లు.. కేవలం రూ.10 లక్షల లోపే.. డోంట్ మిస్..!

ఇక ఈ కారు ధర విషయానికొస్తే.. ఢిల్లీలో హ్యుందాయ్ ఐ20 బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.7,04,400 లక్షలుగా ఉంది. అదే సమయంలో ఈ కార్ ఆన్-రోడ్ ధర రూ.7,96,738గా నిర్ణయించబడింది. దీంతోపాటు కారుపై బీమా, ఆర్టీఓ పన్ను దాదాపు రూ.92 వేలు వసూలు చేస్తున్నారు.

అయితే ఇప్పుడు హ్యుందాయ్ ఐ20 డౌన్‌పేమెంట్‌ను పరిశీలిస్తే.. ఈ వాహనం కోసం రూ. 2 లక్షల డౌన్‌పేమెంట్ చేస్తే.. దాదాపు 9.8 శాతం వడ్డీ రేటుతో 7 సంవత్సరాల పాటు ప్రతి నెలా దాదాపు రూ.9,845 EMI చెల్లించాల్సి ఉంటుంది. దీని బట్టి చూస్తే నెలకు రూ.10వేల లోపే చెల్లించుకోవచ్చు. ఇక హ్యుందాయ్ i20 డెలివరీ వెయిటింగ్ విషయానికొస్తే.. మీరు దాని CVT మోడల్ కోసం దాదాపు 10 వారాల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. అయితే అన్ని ఇతర వేరియంట్‌లు 6 వారాలలోపు డెలివరీ చేయబడతాయి. భారత మార్కెట్లో ఈ కారు ధర రూ. 7.04 లక్షల నుండి రూ. 11.21 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. కొత్త హ్యుందాయ్ ఐ20 ఎరా, మాగ్నా, స్పోర్ట్జ్, స్పోర్ట్జ్ (ఓ) వంటి అనేక వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

Tags

Related News

Personal loan: పర్సనల్ లోన్ వెనుక దాగిన భయంకర నిజం! జాగ్రత్తగా లేకుంటే మీకే నష్టం

Amazon Weekend Deals: అమెజాన్ దీపావళి స్పెషల్ డీల్స్! 65 వేల వరకు డిస్కౌంట్.. ఈ వీకెండ్‌ మిస్ కాకండి!

Jio recharge plan: ఖరీదైన రీచార్జ్‌లకు గుడ్‌బై!.. జియో 51 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్‌ 5G డేటా

Gold Capital of India: భారతదేశ గోల్డ్ రాజధాని ఏదో తెలుసా..? ఇక్కడ నుంచి భారీగా బంగారం ఉత్పత్తి..

Open beta: కలర్‌ఓఎస్ 16, ఆక్సిజన్‌ఓఎస్ 16 బీటా రిలీజ్.. మీ ఫోన్‌కి అర్హత ఉందా? చెక్ చేయండి!

Jio Offers: జియో రీచార్జ్ ప్లాన్స్ 2025.. 75 నుండి 223 రూపాయల వరకు సులభమైన ప్లాన్స్

BSNL Offers: రూ.229లో బిఎస్ఎన్ఎల్ అద్భుతమైన ప్లాన్.. రోజుకు 2జిబి డేటా, నెలపాటు అన్‌లిమిటెడ్ కాల్స్

Gold rate: అయ్యయ్యో.. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Big Stories

×