BigTV English

Hyundai Offers: ఇదే సరైన టైమ్.. హ్యాండాయ్ ఎలక్ట్రిక్ SUV పై లక్షల్లో డిస్కౌంట్..!

Hyundai Offers: ఇదే సరైన టైమ్.. హ్యాండాయ్ ఎలక్ట్రిక్ SUV పై లక్షల్లో డిస్కౌంట్..!

Rs 2 Lakhs Discount on Hyundai Kona EV: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఇండియా తన ఎలక్ట్రిక్ SUV కోనా EV తయారీని అధికారికంగా నిలిపివేసింది. గత నెలలో మాత్రమే కంపెనీ తన వెబ్‌సైట్ నుండి దానిని తొలగించింది. ఈ నేపథ్యంలో కంపెనీ తన మిగిలిన స్టాక్‌ను క్లియర్ చేయాలని చూస్తోంది. మిగిలిన యూనిట్లను డీలర్లు విక్రయిస్తున్నారు. దీనిపై కంపెనీ జూలైలో రూ.2 లక్షల డిస్కౌంట్ ఇస్తోంది. కంపెనీ మేలో రూ.4 లక్షలు, జూన్‌లో రూ.3 లక్షల క్యాష్ డిస్కౌంట్ అందించింది. స్టాక్ ఉంటేనే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందా. దీని ప్రారంభ ధర రూ.23.84 లక్షలు.


కోనా EV దేశీయ మార్కెట్‌లో హ్యుందాయ్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోడల్. కంపెనీ దీనిని 2019లో ప్రారంభించింది. అప్పటి నుంచి దానికి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. గత కొన్ని నెలలుగా కోనా ఈవీ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. లక్షల విలువైన డిస్కౌంట్లు కూడా దాని అమ్మకాలను పెంచలేకపోయాయి. కంపెనీ క్రెటా EVని తీసుకువస్తోందని, దాని కారణంగా దీని ఉత్పత్తి నిలిపివేసింది. ఏప్రిల్, మే నెలల్లో ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు. అలానే జూన్ డేటా వెల్లడి కాలేదు.

Also Read: గెట్ రెడీ.. తక్కువ ధరకే 5G ఫోన్లు.. మనందరికోసమే!


హ్యుందాయ్ కోనా EV కోనా ఎలక్ట్రిక్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు 48.4 kWh, 65.4 kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో మార్కెట్లో లాంచ్ చేశారు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 490 కిలోమీటర్ల WLTP రేంజ్ ఈ కారు అందిస్తోందని కంపెనీ పేర్కొంది. EV క్రాస్ఓవర్ స్టాండర్డ్, లాంగ్ రేంజ్ మోడల్‌లో అందుబాటులో ఉంది. ఈ కారులో 12.3-అంగుళాల డ్యూయల్ స్క్రీన్ డాష్‌బోర్డ్, ADAS, LED లైటింగ్, ఎలక్ట్రానిక్ గేర్ సెలెక్టర్ వంటి ఫీచర్లు ఉంటాయి.

కారు ముందు భాగంలో ర్యాప్‌రౌండ్ ఫ్రంట్ లైట్ బార్ అందుబాటులో ఉంది. Kona EV హ్యుందాయ్ Ioniq 5 అలాగే స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్‌ల మాదిరిగానే అదే పిక్సెల్ గ్రాఫిక్స్ లైన్‌లను కలిగి ఉంది. కారు పొడవు 4,355 మిమీ. ఇది పాత కోనా కంటే దాదాపు 150 మిమీ ఎక్కువ. వీల్‌బేస్ కూడా 25 మిమీ పెరిగింది. డాష్‌బోర్డ్ Ioniq 5 మాదిరిగానే 12.3-అంగుళాల ర్యాప్‌రౌండ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను పొందుతుంది.

Also Read: ఐఫోన్ లాంటి ఫోన్.. రూ.6,500కే.. డబుల్ ధమాకా!

కోనా EV సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే ఇది ADAS, బ్లైండ్-స్పాట్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. అదే సమయంలో ఇది బోస్ 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్, కీ లెస్ ఎంట్రీ, OTA అప్‌డేట్‌లు, హెడ్స్-అప్ డిస్‌ప్లే, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, పవర్ టెయిల్ గేట్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

Tags

Related News

Jio Special Offer: జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. జస్ట్ రూ.91కే వాలిడిటీ అన్ని రోజులా!

Jan Dhan Yojana: జన్‌ధన్ ఖాతాల్లో నిధుల వెల్లువ.. 10 ఏళ్లలో భారీగా పెరిగిన డిపాజిట్లు

GST on Cable TV: 18 నుంచి 5 శాతం జీఎస్టీ.. నెలవారీ టీవీ బిల్లులకు భారీ ఊరట!

Gold Rate Hikes: పసిడి ప్రియులకు షాక్! మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

BSNL vs JIo Airtel: BSNL నుంచి అదిరిపోయే ప్లాన్.. జస్ట్ రూ. 147కే నెల రోజుల వ్యాలిడిటీ!

Gas cylinder scams: నకిలీ సీల్, నకిలీ బిల్.. గ్యాస్ సిలిండర్ మోసాలు ఎలా గుర్తించాలి?

Big Stories

×