BigTV English

Bigg Boss 9 Telugu : మొదటి రోజే హౌస్ లో పచ్చళ్ళ పాప రచ్చ.. ఇలా అయితే కష్టమే..!

Bigg Boss 9 Telugu : మొదటి రోజే హౌస్ లో పచ్చళ్ళ పాప రచ్చ.. ఇలా అయితే కష్టమే..!

Bigg Boss 9 Telugu : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం సీజన్ 9 ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఐదు వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో 6 మంది ఎలిమినేట్ అయ్యారు. అంతే కాదు వైల్డ్ కార్డు ద్వారా కొందరు హౌస్ లోకి వచ్చేసారు. అందులో ఈమధ్య అలేఖ్య పికెల్స్ ద్వారా ఫేమస్ అయిన బ్యూటీ రమ్య మోక్ష కూడా ఒకరు.. పచ్చళ్ల ధరల గురించి కస్టమర్లతో మాట్లాడిన ఓ మాటే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.. అలా బాగా పాపులర్ అయిన ఈ అమ్మడు ప్రస్తుతం బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. అడుగు పెట్టిన మొదటి రోజే గొడవలకు కేరాఫ్ గా నిలిచింది. ఈమె టార్గెట్ చేసిన ఐదు మంది ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


వైల్డ్ కార్డు ద్వారా రమ్య మోక్ష ఎంట్రీ..

బిగ్ బాస్ లో వైల్డ్ కార్డు ద్వారా కొంతమంది ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.. ఐదో వరం ఎలిమినేషన్ తర్వాత వైల్డ్ కార్డు ద్వారా కొందరు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో అలేఖ్య చిట్టి పికెల్స్ ఫేమ్ రమ్య మోక్ష ఒకరు. కస్టమర్ తో ఇవి చేసిన ఒకే ఒక్క చాట్ ఆమెను ఓవర్ నైట్ స్టార్ని చేసేసింది. అప్పటివరకు ఎవరికీ తెలియని ఈ రమ్య పేరు తెలుగు రాష్ట్రాల ప్రజల నోట్లో నానింది. ఆ తర్వాత కస్టమర్కు క్షమాపణలు చెప్పిన సరే ట్రోలర్స్ మాత్రం ఈమెను వదల్లేదు అన్న విషయం తెలిసిందే.. మొదటి రోజు కంటెస్టెంట్స్ తో చాలా చక్కగా మాట్లాడింది కానీ, కొంతమంది కంటెస్టెంట్స్ తో మొదటి రోజే గొడవకు దిగింది. చూస్తుంటే ఈమెను కావాలనే బిగ్ బాస్ హౌస్ లోకి పంపించినట్లు తెలుస్తుంది. ముందు ముందు ఎలాంటి గొడవలకు తెరలేపుతుందో చూడాలి..

Also Read: టీవీ సీరియల్స్ రేటింగ్..కార్తీక దీపం తో ఆ సీరియల్ పోటీ..?


ఆ కంటెస్టెంట్స్ టార్గెట్..

రమ్య మోక్ష చూడటానికి ఎంతో ముద్దుగా బొద్దుగా ఉన్నా కూడా మొదట సైలెంట్ గానే ఉంటుంది. ఆ తర్వాత దిగుతుంది అన్న డైలాగ్ తగ్గట్లుగా మెల్లగా తన పనిని మొదలు పెట్టేసింది. హౌస్ లో ఎంట్రీ ఇవ్వగానే రచ్చ చేయడం ఆమెకే సాధ్యం. బిగ్ బాస్ టీం ఆమెకు ఒక టాస్క్ ఇచ్చి పంపించాడు. ఆమె చేతిలో 5 పచ్చడ్లు పెట్టి, వాటి పై ఓవర్ యాక్షన్, మ్యానిపులేటర్, ఫేక్, సేఫ్ గేమ్, సెల్ఫిష్ అని రాసి ఉంటుంది. ఇవి హౌస్ లోకి వెళ్లిన తర్వాత వీటి మీద రాసున్నవి ఎవరికీ సూట్ అవుతాయో ఇవ్వమని చెప్తాడు పోస్ట్ నాగార్జున.. భరణికి, డిమాన్, దివ్య, రామ్ రాథోడ్ కు ఇస్తుంది. అలా టాప్ 5 లో వాళ్ళని పెట్టాను అంటే నాకు వాళ్ళు నచ్చినట్టే కదా, వాళ్ళతోనే కలిసి ప్రయాణం చెయ్యాలని అనుకుంటాను అని మళ్లీ ప్రయత్నం చేసింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే ఇలాంటి రచ్చ చేయడం ఆడియన్స్ కి కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించిన సరే కొందరు మాత్రం కామెంట్ చేస్తున్నారు. మరి ఇలానే కొనసాగితే మరో వారం రెండు వారాల్లో హౌస్ నుంచి బయటికి రావడం తప్పదంటూ నెటిజన్లు సైతం కామెంట్లు పెడుతున్నారు..

Related News

Bigg Boss 9 Promo: బిగ్ బాస్ హౌస్‌కు నిప్పు పెట్టిన దివ్వెల.. రచ్చ చేసి.. ఏడ్చేసి.. వామ్మో మహానటి!

Bigg Boss 9: నాన్న ఆఖరి చూపుకు కూడా నోచుకోలేకపోయా..రమ్య ఎమోషనల్!

Bigg Boss 9: 5 వారాలకు గానూ.. ఫ్లోరా, శ్రీజ దమ్ము ఎంత సంపాదించారో తెలుసా?

Bigg Boss Buzzz Srija : నేను గ్రూపు దగ్గర కూర్చుంటే వాళ్ళు లేచి వెళ్ళిపోయే వాళ్ళు, ప్లాన్డ్ గా లవ్ యాంగిల్ నడిపాడు

Bigg Boss 9 Wild Card : తమిళ్ బిగ్ బాస్ లో 65 రోజులు ఉన్నా, ఈ లోపు నా బాయ్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయితో…

Bigg Boss 9 Wild Card : బిగ్ బాస్ లోకి దువ్వాడ మాధురి. షాక్ అయిన హౌస్ మేట్స్, శ్రీజ తో ఆర్గ్యుమెంట్ మొదలు 

Bigg Boss 9 : మైండ్ చెదిరిపోయే ట్విస్టులు, డబుల్ ఎలిమినేషన్స్, వైల్డ్ ఫైర్ వైల్డ్ కార్డు ఎంట్రీస్

Big Stories

×