BigTV English

2025 Hyundai Santa Cruz : ఇక సమరమే.. హ్యుందాయ్ క్రూజ్ వెహికల్ వచ్చేస్తోంది!

2025 Hyundai Santa Cruz : ఇక సమరమే.. హ్యుందాయ్ క్రూజ్ వెహికల్ వచ్చేస్తోంది!
2025 Hyundai Santa Cruz
2025 Hyundai Santa Cruz

2025 Hyundai Santa Cruz : ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన కొత్త కారును లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. న్యూయార్క్‌లో జరిగిన 2025 ఆటో షోలో హ్యుందాయ్ శాంటా క్రూజ్‌ను సంస్థ ప్రదర్శించింది. మొదటిగా అమెరికన్ ఆటోమొబైల్ మార్కెట్ ఈ కారును తీసుకొస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. శంటా క్రూజ్ చాలా అప్‌డేట్ లుక్‌తో వస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇందులోని ఇంటీరీయర్, ఎక్ట్సీరియర్‌‌లో మార్పులు చేశారు. ఇది కొత్త రకం ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ వెహికల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి


హ్యుందాయ్ శాంటా క్రూజ్ 2.5 లీటర్ డైరెక్ట్ ఇంజెక్ట్ చేయబడిన ఇన్‌లైన్ ఫోర్ సిలిండ్ ఇంజన్‌తో రానుంది. ఇది 191 హార్స్‌పవర్ మరియు 245 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. అదనంగా మెరుగైన ఎర్గోనామిక్స్ సీటింగ్ పొజీషన్ ఉంటుంది.

Also Read : కేక పుట్టిస్తున్న ఫోర్స్ గుర్జా SUV లుక్.. ఇక ఆ కార్లకి చుక్కలే!


ఇందోని మరో వేరియంట్ విషయానికి వస్తే.. 2.5-లీటర్ డైరెక్ట్ ఇంజెక్ట్ చేయబడిన టర్బోచార్జ్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 281 హార్స్‌పవర్ మరియు 420 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా పొందుతుంది కానీ టార్క్ కన్వర్టర్‌కు బదులుగా.. ఇది డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ కాంబో గేర్‌బాక్స్ యొక్క మాన్యువల్ నియంత్రణను తీసుకోవడానికి స్టీరింగ్ వీల్ వెనుక ప్యాడిల్ షిఫ్టర్‌లను కూడా అమర్చారు.

కారు డిజైన్‌ను చూసినట్లయితే.. ఫ్రంట్ బంపర్‌లో మార్పులు చేయబడ్డాయి. ఇందులో కొత్త అప్‌డేటెడ్ గ్రిల్, అల్లాయ్ వీల్స్ మరియు డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఇంటీరియర్ 2025 హ్యుందాయ్ టక్సన్‌తో డిజైన్ చేసింది. ఇంటీరియర్ గురించి చెప్పాలంటే.. 12.3-అంగుళాల డ్రైవర్ ఇన్ఫర్మేషన్ క్లస్టర్ అందుబాటులో ఉంది. 12.3-అంగుళాల ఆడియో-వీడియో నావిగేషన్ ఉంటుంది. అధునాతన కొత్త పనోరమిక్ ఫోల్డబుల్ డిస్‌ప్లే కూడా ఉంది.

Also Read : Xiaomi నుంచి స్టైలిష్ ఎలక్ట్రిక్ కార్.. సింగిల్ ఛార్జ్‌తో 1200 కిమీ రేంజ్..?

హ్యుందాయ్ ప్రాక్టికాలిటీని మెరుగుపరచడానికి స్టోరేజ్‌బాక్స్‌పైన కొత్త షెల్ఫ్‌ను మరియు రెండు కప్ హోల్డర్‌లతో వెనుక సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌ను అందిస్తోంది. ఇంటీరియర్‌లో ఇతర మార్పులు కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు ఎయిర్ వెంట్స్ ఉన్నాయి.

Related News

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

Big Stories

×