Big Stories

Israel: యుద్ధానికి ఆజ్యం పోస్తున్న అమెరికా.. ఇజ్రాయెల్‌కు 2,000 బాంబులు అందజేత

Israel Hamas War updateIsrael Hamas War update(Today’s international news): ఇజ్రాయెల్-హామాస్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ దళాలు సిరియాపై భీకర దాడికి పాల్పడుతున్నాయి. యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో ఇజ్రాయెల్ సైన్యానికి అమెరికా భారీగా ఆయుధాలను అందించింది. తమ మిత్రదేశ మైన ఇజ్రాయెల్ కు అమెరికా 2,000 బాంబులను అందించింది.

- Advertisement -

ఇజ్రాయెల్ దళాలు గాజాలోని రఫాపై సైనిక దాడులు చేస్తున్న నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్ సైన్యానికి బాంబులు అందించడంతో యుద్ధానికి మరింత చేయూతనిచ్చినట్లు అయ్యింది. 2,000 బాంబులతో పాటుగా సైనిక సహాయం కింద 3.8 బిలియన్ డాలర్లను కూడా అందజేసింది. మిత్రదేశమైన ఇజ్రాయెల్ కు అమెరికా కొత్త ఆయుధ ప్యాకేజీలో భాగంగా బాంబులను, F-25 ఫైటర్ జెట్ లను అందజేసింది.

- Advertisement -

అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అమెరికా అందించిన సాయంపై అంతర్జాతీయ మీడియా నిర్థారించినా సరే అమెరికాలోని వైట్ హౌస్ ఇంకా స్పందించలేదు. అయితే వాషింగ్టన్ లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం కూడా ఈ విషయంపై స్పందించలేదు. గతేడాది అక్టోబరు 7వ తేదీన దక్షిణ ఇజ్రాయెల్ పై హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి.

ఈ ఘటనపై ప్రపంచ దేశాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇటువంటి తరుణంలో అమెరికా ఇజ్రాయెల్ కు ఆయుధాలను అందించడంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇజ్రాయెల్ దళాలు ఇంతవరకు గాజాపై జరిపిన దాడుల్లో దాదాపు 32,000 మంది వ్యక్తులు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇటీవలే గాజాలో ఇజ్రాయెల్ దళాలు తక్షణమే కాల్పులకు విరమణను కోరే తీర్మానంపై ఓటింగ్ జరగగా.. అమెరికా దానికి దూరంగా ఉంది. జ్రాయెల్ కు అందించే సైనిక నిధులను నిలుపుదల చేయాలని కోరానా సరే అమెరికా దాన్ని పెడచెవిన పెట్టింది. అగ్రరాజ్యం అమెరికా యుద్ధానికి మద్దతు ఇవ్వడంతో దీని తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు అభిప్రాయపడుతున్నాయి.

Also Read: Famous Conjoined Twins: అవిభక్త కవలలకు ఆర్మీ అధికారితో పెళ్లి..

హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇజ్రాయెల్ దళాలు శుక్రవారం సిరియాపై దాడి చేశాయి. ఈ దాడిలో మొత్తం 42 మంది మృతి చెందగా.. వారిలో 36 మంది సిరియా సైనికులే ఉన్నట్లు ఓ యుద్ధ పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. మిలిగిన వారు స్థానిక పౌరులుగా గుర్తించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News