Prabhakar Appointment: కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరులో ఎస్‌జీటీగా పనిచేస్తున్న ప్రభాకర్ నియామకం చుట్టూ పెద్ద దుమారమే నడుస్తోంది. ఈ ఇష్యూపై విచారణ కూడా షురువైంది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందేందుకు ఆయనకు అవసరమైన అర్హతలు ఉన్నాయా లేదా అన్నదే అధికారుల పరిశీలనలో కీలకంగా మారింది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాల్లో విద్యార్హతలు, క్రీడా అర్హతలు, సంబంధిత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎలా జరిగిందన్నదే ప్రశ్న.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో రాష్ట్రవ్యాప్తంగా వందల పోస్టులు భర్తీ కాగా, అర్హతలపై మొదటి నుంచీ అభ్యంతరాలు వచ్చాయి. ప్రాథమిక జాబితాలపైనా అభ్యంతరాలు స్వీకరించి, సర్టిఫికెట్లను పరిశీలించినట్లు అధికారులు ప్రకటించారు. మరి ప్రభాకర్ విషయంలో వెరిఫికేషన్ ఎలా జరిగింది..? జీఓ 15 నిబంధనలు ఏం చెబుతున్నాయి..? క్రీడా అర్హత ఉంటే సరిపోతుందా..? మిగితా సర్టిఫికెట్లు ఉన్నాయా లేదా అన్నది కనీసం చెక్ చేయరా? ఓవరాల్ గా చూస్తే 1-5 తరగతులకు బోధించడానికి అవసరమైన టెట్‌లో ప్రభాకర్ అర్హత సాధించలేదని నిర్ధారణ అయ్యింది. మరి ఈ ఇష్యూను ఎలా డీల్ చేస్తారో చూడాలి.