Onion Exports: భారత ప్రభుత్వం తాజాగా ఉల్లి రైతులకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేఉల్లి ఎగుమతిపై విధించిన 20 శాతం సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చి 22న ఉపసంహరించుకుంది. సెప్టెంబర్ 2024లో ప్రారంభమైన ఈ ఎగుమతి సుంకాన్ని తొలగించడంపై రెవెన్యూ శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఈ నిర్ణయం రైతులకు మరింత ప్రోత్సాహకరంగా మారనుంది. దీంతోపాటు ఉల్లి ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎగుమతిపై నిషేధం ఎందుకు?
ప్రభుత్వం గత సంవత్సరం డిసెంబర్ 8, 2023న ఉల్లిపాయ ఎగుమతిపై కొన్ని కీలక పరిమితులను విధించింది. ఈ క్రమంలో 20 శాతం ఎగుమతి సుంకం, కనీస ఎగుమతి ధర (MEP) నిర్ణయం, అలాగే ఎగుమతిపై నియంత్రణ విధించారు. ఈ నియంత్రణలను మే 3, 2024 వరకు కొనసాగించారు.
తాజా పరిణామాలతో
ఈ పరిమితులను విధించడానికి ప్రధాన కారణం దేశీయ మార్కెట్‌లో ఉల్లి ధరలను నియంత్రించడం, దీంతోపాటు వినియోగదారులకు తక్కువ ధరల్లో అందుబాటులో ఉండేలా చూడడమే. అయితే, తాజా పరిణామాలతో ఉల్లి ఉత్పత్తి అధికంగా ఉండటం, మార్కెట్ ధరలు స్థిరంగా మారిన కారణంగా ఈ పరిమితులను ప్రభుత్వం తొలగించింది.
Read Also: Merge PF Accounts: మీ ఎక్కువ పీఎఫ్ ఖతాలను ఇలా ఈజీగా …
లక్షల టన్నులు
2023-24 & 2024-25లో ఉల్లి ఎగుమతిపై పరిమితులు ఉన్నప్పటికీ, 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఉల్లి ఎగుమతి 17.17 లక్షల టన్నులుగా నమోదైంది. అలాగే, 2024-25లో (మార్చి 18 వరకు) 11.65 లక్షల టన్నులు ఎగుమతయ్యాయి.
నెలవారీ ఎగుమతి వివరాలు:
-సెప్టెంబర్ 2024లో ఉల్లిపాయ ఎగుమతి పరిమాణం 0.72 లక్షల టన్నులు
-జనవరి 2025 నాటికి ఇది 1.85 లక్షల టన్నులకు పెరిగింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, ఉల్లిపాయ ఎగుమతిపై నియంత్రణలు ఉన్నప్పటికీ, దేశీయ ఉత్పత్తి స్థాయిలను బట్టి ఎగుమతులు స్థిరంగా కొనసాగినట్లు తెలుస్తోంది.
ధరల స్థిరీకరణ
ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం రబీ సీజన్‌లో ఉత్పత్తి అధికం కావడమే. అధిక ఉత్పత్తి వల్ల ధరలు తగ్గిపోయాయి. అలాగే రిటైల్ ధరల స్థాయిలో కూడా తగ్గుదల ఉంటుంది. 2024లో రబీ పంట ద్వారా 227 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యింది. ఇది 2023లో నమోదైన 192 లక్షల మెట్రిక్ టన్నుల కంటే 18 శాతం ఎక్కువ కావడం విశేషం.
మండి & రిటైల్ ధరల మార్పు
-గత సంవత్సరంతో పోలిస్తే, అఖిల భారత సగటు మోడల్ ధరల్లో 39 శాతం తగ్గుదల నమోదైంది.
-జనవరి 2024తో పోలిస్తే, గత నెలలో రిటైల్ ధరలు 10 శాతం తగ్గాయి.
-రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందించేందుకు, ఉల్లి వినియోగదారులకు సరసమైన ధరలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఉత్పత్తి పెరుగుదల & మార్కెట్ స్థిరీకరణ
భారతదేశంలో ఉల్లి ప్రధాన ఉత్పత్తిలో 70-75% వాటా రబీ సీజన్‌కు చెందుతుంది. రబీ ఉల్లిపాయల నిల్వ అక్టోబర్-నవంబర్ వరకు సరఫరా కొనసాగించడానికి కీలకంగా మారుతుంది. అంచనా వేసిన అధిక ఉత్పత్తి వల్ల మార్కెట్‌లో ఉల్లి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.