Pawan Kalyan: టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ మాట కొంచెం కటువుగా ఉన్నా మనసు మాత్రం వెన్న అంటున్నారు ఆయన అభిమానులు. తన దగ్గరికి సాయం కోరిన వారికి సాయం అందించకుండా ఉండలేరు పవన్ కళ్యాణ్. ఆయన గొప్ప మనసు తెలుసుకున్న ప్రజలు ఆయనను డిప్యూటీ సీఎం గా ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోని చూసిన వాళ్లంతా పవన్ కళ్యాణ్ గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
పవన్ కళ్యాణ్ సినిమాలు..
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఒక్కో సినిమాతో స్టార్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలో పవర్ స్టార్ అయ్యాడు. పవనిజం పేరిట ఆయన అభిమానులు ఏకంగా ఓ స్టైల్‌నే క్రియేట్ చేశారంటే పవన్ కల్యాణ్ అంటే వారికి ఎంత అభిమానముందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో జనసేన అనే పార్టీని స్థాపించి ఆ పార్టీ నీ తరఫున ఎంతోమందికి సాయం చేశాడు ఇప్పుడు జనసేన అధినేత ఉపముఖ్యమంత్రిగా పదవి స్వీకరణ చేశారు. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న కూడా మరోవైపు ఆయన కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
పవన్ కళ్యాణ్ గొప్ప మనసుకు ఇదే సాక్ష్యం..
పవన్ కళ్యాణ్ రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా హీరోనే.. సాయం కోరి వస్తే వారిని తన సొంత మనిషిలాగ అక్కున చేర్చుకుంటారు. ఇప్పుడు ఓ వృద్ధ మహిళ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో ఒక షోకు సంబంధించింది ని తెలుస్తుంది. లక్ష్మీ మంచు హోస్ట్ గా వ్యవరిస్తున్నారు. అందులో ఓక ఓల్డ్ ఉమెన్ మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గొప్ప మనసు గురించి బయటపెట్టింది. అందులోఆమె మాట్లాడుతూ.. వృద్ధాశ్రమాన్ని నడపలేని అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్న ఖమ్మంకు చెందిన ఓ వృద్ధురాలు పవన్ కల్యాణ్ గురించి తెలుసుకుని హైదరాబాద్‌లో ఉన్న ఆయన ఇంటికి వచ్చింది.. ఆమె గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆమెను సొంత అమ్మలాగా దగ్గరకు తీసుకున్నారని చెప్పింది. ఆమెకు స్వయంగా భోజనం పెట్టి అనంతరం ఆమెకు కావల్సిన సహాయాన్ని అందించి తిరిగి పంపారు. ఓ టీవీ ఛానల్ వారు నిర్వహించిన కార్యక్రమంలో ఆ మహిళ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతోంది పవన్ ఎంత భోళా మనిషో. నటనతోనే కాదు తోటి మనిషికి సాయం చేయాలన్న స్పందించే హృదయం కలిగిన గొప్ప వ్యక్తిగా పవన్ మనకు కనిపిస్తారు.. ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పవన్ అభిమానులు ఇది పవన్ కళ్యాణ్ మనస్తత్వం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు..
ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. ఆయన చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు సినిమా ఈ నెలలో రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు..