BigTV English

Indian Beer Brands: మన సింబా బీరు ఇక వరల్డ్ ఫేమస్.. ఈ అవార్డును ఊహించి ఉండరు

Indian Beer Brands: మన సింబా బీరు ఇక వరల్డ్ ఫేమస్.. ఈ అవార్డును ఊహించి ఉండరు

Indian Beer Brands: మన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో బీర్ అంటే ఏంటో చెప్పండి? మనం చెప్పేమాట కింగ్ ఫిషర్, రాయల్ ఛాలెంజ్, బడ్వైజర్, ట్యూబర్గ్ ఇలా ఒకటో రెండో పేర్లు మన మైండ్‌లో మెదులుతాయి. కానీ, ఇప్పుడు నేను చెప్పే బీర్ ను మీరు ఎప్పుడైనా తాగారా? అదేనండి సింబా బీర్! పేరు ఎప్పుడైనా విన్నారా? పోనీ ఎక్కడైనా వెళ్లినప్పుడు ఒక్క సిప్ అయినా టేస్ట్ చేశారా? అసలు సింబా బీర్ ఉందని తెలుసా? అంతే కాదండోయ్ మన బీర్ బ్రాండ్స్ లోనే సింబా బీర్ ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ క్వాలిటీ బీర్ గా అవార్డులు కూడా అందుకుంది. సింబా బీర్ ఎందుకు స్పెషల్, దాని అవార్డుల వెనుక స్టోరీ ఏంటో తెలుసుకుందామా.


సింబా బీర్ – ఎవరు వీళ్లు?

సింబా బీర్ అనేది ఒక ఇండియన్ క్రాఫ్ట్ బీర్ బ్రాండ్, ఇది 2016లో మధ్యప్రదేశ్‌లోని ధమ్‌పూర్‌లో మంచి గుర్తింపు పొందింది. సింబా అంటే ఆఫ్రికన్ భాషలో “సింహం” అని అర్థం. సింహం లాంటి గర్జనతో ఈ బ్రాండ్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ బీర్‌ని తయారు చేసే కంపెనీ పేరు సింబా బ్రూయింగ్ కంపెనీ. ఇది ఇండియాలోనే కాదు, గ్లోబల్ స్టేజ్ మీద కూడా తనకంటూ మార్క్ సంపాదించుకుంది.


సింబా బీర్‌లో ప్రత్యేకత ఏమిటంటే

ఇది కేవలం మామూలు బీర్ కాదు. సింబా బీర్స్ లో వేర్వేరు రకాల రుచి అనుభవాలు, అత్యుత్తమ నాణ్యత కలిగిన పదార్థాలు ఉంటాయి. సింబా చాక్లెట్ (dark), సింబా గోధుమ (wheat), సింబా మల్టీ స్వీట్ అందరికీ కొత్త రుచి అనుభవాన్ని ఇస్తాయి. సింబా వీట్ తేలికపాటి, సిట్రస్ వాసనతో, రిఫ్రెషింగ్ అనుభూతిని ఇస్తుంది, మరి సింబా స్టౌట్ చాక్లెట్, కాఫీ గుణాలతో క్రీమి మరియు కొంచెం కాస్త తీపి రుచి కలిగినది. సింబా స్ట్రాంగ్, ఇతర వేరియంట్లతో పోలిస్తే, మరింత వివిధ రకాల రుచి, మంచి క్వాలిటీతో మద్యం ప్రియులను ఆకట్టుకుంటుంది. ప్రతి బీర్‌కి ఒక యూనిక్ టేస్ట్ ఉంటుంది, ఇది మద్యం ప్రియులకు కొత్త అనుభవాన్ని ఇస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ లాంటి సిటీస్‌లో ఇప్పటికే ఈ బీర్ బాగా పాపులర్ అవుతోంది,

Also Read: Smartphones: ఈ వారం లాంచ్‌ కానున్న నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లు! తెలుసుకోవాలని ఉందా?

సింబా బీర్‌కు అవార్డులు – ఏంటి స్పెషల్?

సింబా బీర్ ఎందుకు అంత స్పెషల్? ఎందుకంటే ఇది ప్రపంచ స్థాయిలో అవార్డులు గెలుచుకుంది. 2020లో వరల్డ్ బీర్ అవార్డ్స్‌లో సింబా స్టౌట్ బీర్ వరల్డ్స్ బెస్ట్ స్టౌట్, పోర్టర్ కేటగిరీలో అవార్డు గెలిచింది. ఇది ఒక్క ఇండియా నుంచి కాదు, ప్రపంచంలోని టాప్ బీర్ బ్రాండ్స్‌తో పోటీ పడి ఈ అవార్డు సాధించింది. సింబా స్టౌట్‌లో ఉండే రిచ్ కాఫీ, చాక్లెట్ ఫ్లేవర్స్, క్రీమీ టెక్స్చర్ దీనిని ప్రత్యేకం చేస్తాయి. అంతేకాదు, సింబా వీట్ బీర్ కూడా ఇంటర్నేషనల్ బీర్ ఛాలెంజ్‌లో సిల్వర్ మెడల్ గెలిచింది. ఈ బీర్‌లో నిమ్మ, ఆరెంజ్, మిరియాలు, కొరియాండర్, ఇతర మసాలా వంటి స్పైసీ రుచులు ఉంటాయి. దీంతో భారతీయ రుచికి అద్భుతంగా సరిపోతాయి. ఈ అవార్డులు సింబా బీర్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక ప్రముఖ, గౌరవనీయమైన బ్రాండ్‌గా నిలబెట్టింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సింబా పాపులారిటీ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సింబా బీర్ ఇప్పుడు స్లోగా పాపులర్ అవుతోంది. హైదరాబాద్‌లోని పబ్స్, రెస్టారెంట్లలో సింబా స్టౌట్, సింబా స్ట్రాంగ్ బీర్లు బాగా డిమాండ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా యూత్, కొత్త ఫ్లేవర్స్ ట్రై చేయాలనుకునే వాళ్లు సింబా వైపు మొగ్గు చూపిస్తున్నారు. అంతేకాదు, సింబా బీర్ తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో తయారవుతోంది. ఇక్కడి లీలాసన్స్ ఆల్కా బేవరేజెస్ కంపెనీ సింబా బీర్‌ను పూర్తిగా తయారు చేస్తోంది. అంటే, ఈ బీర్ బ్రాండ్ వేరు అయినా, దాని ఉత్పత్తి, నాణ్యత, రుచి అన్నీ ఈ కంపెనీ పూర్తిగా పర్యవేక్షిస్తుంది. ఇది ఇండియన్ మార్కెట్ కోసం డిజైన్ చేసిన బీర్ కాబట్టి, ఇక్కడి టేస్ట్‌కి తగ్గట్టు రకాల బ్రండ్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ట్రెడిషనల్ ఎక్సలెన్స్ ఇన్ క్వాలిటీ అనే బ్రాండ్ పేరుతో సింబా బీర్ అమ్మకాలు జరుగుతున్నాయి.

సింబా బీర్ ఎందుకు ట్రై చేయాలి?

సింబా బీర్ మన ఇండియన్ బ్రాండ్, మన సొంత బీర్! దీని క్వాలిటీ ప్రపంచ స్థాయిలో గుర్తుంపు పొందింది. సింబా బీర్‌లో వేరియంట్స్ ఎన్నో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, సింబా బీర్ భవిష్యత్తులో మన శరీరానికి ఎటువంటి ఇబ్బంది కాకుండా తయారయ్యింది. అందుకే, మీరు స్నేహితులో పబ్‌కి వెళితే, సింబా బీర్ ఆర్డర్ చేసి ట్రై చేయండి.

Related News

Smartphones: ఈ వారం లాంచ్‌ కానున్న నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లు! తెలుసుకోవాలని ఉందా?

OYO Offers: ఓయో హోటల్స్‌పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. 75% తగ్గింపు మిస్ కాకండి!

JioMart Offers: జియోమార్ట్ కొత్త ఆఫర్.. మొదటి ఆర్డర్‌పై అదిరిపోయే తగ్గింపు

Air India Offers: ఎయిరిండియా కొత్త డిస్కౌంట్‌.. 25 శాతం తగ్గింపు, ప్రయాణికులకు పండగే

Zomato: జొమాటో కీలక నిర్ణయం.. ఇక బాదుడు మొదలు, కస్టమర్లు షాక్

Big Stories

×