Mohan Sri Vasta:ఏదైనా ఒక సినిమా తెరకెక్కుతోంది అంటే ఆ సినిమా సక్సెస్ పైన ఎంతోమంది జీవితాలు ఆధారపడి ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తే.. మరి కొంతమంది సక్సెస్ కోసమే సినిమాలు చేస్తూ ఉంటారు. అయితే అలా సక్సెస్ కోసం పట్టుదలతో సినిమాలు చేసిన వారికి అనూహ్యంగా ఫ్లాప్ ఎదురైతే.. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఇటీవల డైరెక్టర్ మోహన్ శ్రీ వత్స (Mohan Srivatsa) చూస్తే మనకు అర్థమవుతుంది. తాజాగా ఎన్నో ఆశలతో తెరకెక్కించిన చిత్రం డిజాస్టర్ అవడంతో ఆ బాధను ఆయన తట్టుకోలేక తనను తాను ఏకంగా చెప్పుతో కొట్టుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ డైరెక్టర్ మోహన్ శ్రీవత్స తాజాగా ‘త్రిభాణధారి బార్బరిక్’ సినిమాకి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. తన కష్టానికి తగిన ఫలితం లభించలేదంటూ ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పుతో కొట్టుకున్నారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. పైగా పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా మరొకసారి స్పందిస్తూ చెప్పుతో కొట్టుకోవడానికి అసలు కారణం చెబుతూ క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్.
మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ..” నేను ఒకవైపు నా కుటుంబాన్ని.. మరొకవైపు భావద్వేగానికి గురై అభిమానులను ఇబ్బంది పెట్టాను. ఈ విషయంలో చాలా రిగ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా నా ఈ సినిమా ఆడియన్స్ కి నచ్చకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. వాళ్లకు ఏదైనా కొత్తగా అందించాలని నేను త్రిభాణదారి బార్బరిక్ సినిమా ప్రయత్నించాను. మలయాళ సినిమాకు దక్కిన ఆదరణ నా చిత్రానికి దక్కకపోయేసరికి తట్టుకోలేకపోయాను. ఎవరు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం లేదు ఏంటి? అనేది నా ఆవేదన. ఇక ఆ బాధలో అలా చెప్పుతో కొట్టుకోవాల్సి వచ్చింది.. ముఖ్యంగా నా వీడియో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే దయచేసి క్షమించండి” అంటూ తెలిపారు మోహన్ శ్రీవత్స. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
త్రిబాణధారి బార్బరిక్ సినిమా విషయానికొస్తే.. ఆగస్టు 22న తమిళ్ మూవీగా విడుదలైంది. ఈ సినిమాకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించగా.. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో విడుదలయ్యింది. పాన్ ఇండియా నటుడు సత్యరాజ్, సత్యం రాజేష్, మేఘన, వశిష్ట ఎన్ సింహ, ఉదయభాను, మొట్ట రాజేంద్రన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకి విదేశాల నుంచి మంచి స్పందన లభించింది కానీ ఇక్కడ ఎవరు కూడా దీని గురించి మాట్లాడకపోవడంతోనే డైరెక్టర్ ఎమోషనల్ అయ్యారు.ముఖ్యంగా ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన ఉదయభాను కూడా కన్నీళ్లు పెట్టుకుంది అని డైరెక్టర్ తెలిపారు.
ALSO READ:Gayatri Gupta: రోజూ అలాంటి టచ్ ఉండాల్సింది… లేకపోతే గాయత్రికి నిద్రపట్టదట