BigTV English

Investment Formula: రూ. 1.2 కోట్ల అప్పుల తీర్చి.. రూ. 5 కోట్ల సంపాదించి.. ఏం ప్లాన్ గురూ!

Investment Formula: రూ. 1.2 కోట్ల అప్పుల తీర్చి.. రూ. 5 కోట్ల సంపాదించి.. ఏం ప్లాన్ గురూ!

Smart Investment: ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందంటారు పెద్దలు. సంపాదన ఎంతైనా కానీ, కొంత మొత్తాన్ని సేవ్ చేయాలని చెప్తుంటారు. అచ్చం ఇలాగే ఓ జంట ఆర్థిక క్రమశిక్షణ పాటించి.. ఆర్థిక స్వాతంత్ర్యం, రిటైర్ ఎర్లీ (FIRE) ప్రయాణంలో తమ అప్పులు తీర్చడంతో పాటు పెద్ద మొత్తంలో డబ్బులు వెనుకేసుంది. తాజాగా తమ ఫైనాన్సియల్ మేనేజ్ మెంట్ గురించి ఓ జంట రెడ్డిట్ వేదికగా వెల్లడించారు. ఇంతకీ అసలు వాళ్లు ఏం చెప్పారంటే..


ఇద్దరు పిల్లలు ఉన్న ఓ జంట ఆర్థిక క్రమశిక్షణ ద్వారా ఎలాంటి చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది? అనే విషయాల గురించి వివరించింది. ప్రస్తుతం  36 ఏళ్ల భార్య, 37 ఏళ్ల భర్త ఇద్దరూ ఎంబీఏలో పట్టభద్రులు. సదరు మహిళ దిగువ మధ్య తరగతి నుంచి వచ్చినవారే. అయినప్పటికీ చదువు విషయంలో ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు. వారు ఓ పూట భోజనం మానేసినా, చదువు విషయంలో వెనుకాడలేదు. తను, తన సోదరి చక్కగా చదువుకున్నారు. ఆమె పెళ్లి నాటికి భర్త వయసు 22 కాగా ఆమె వయసు 21 ఏళ్లు. 22 ఏళ్ల వయసులో ఆమె భర్త ఉద్యోగం మొదలుపెట్టారు. 25 ఏళ్ల వయసు వచ్చే నాటికి రూ. 5 లక్షలు ఆదా చేశారు. ఆ డబ్బులు ఎక్కువ భాగం తన ఎంబీఏకి ఖర్చు చేయడానికి ఉపయోగించారు. వివాహం తర్వాత, ఈ జంట ఎడ్యుకేషన్, హోమ్ లోన్ సహా సుమారు రూ.1.2 కోట్ల రుణాలతో తమ జీవితాన్ని ప్రారంభించారు.

కరోనా సమయంలో కీలక మలుపు


కరోనా సమయంలో వాళ్లు FIRE మూవ్ మెంట్ లో అడుగుపెట్టారు. ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి పెట్టారు. 2021 (32 సంవత్సరాలు) నాటికి అప్పులను క్రమపద్ధతిలో క్లియర్ చేశారు. ఆపై మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ బాండ్లతో (గత 4 సంవత్సరాలు) పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించారు.  గత కొన్ని సంవత్సరాలలో రియల్ ఎస్టేట్, స్టాక్స్‌ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2022 రియల్ ఎస్టేట్ బూమ్ నుంచి ప్రయోజనం పొందారు. వారి ప్రస్తుత పోర్ట్‌ ఫోలియోలో దాదాపు రూ. 3.5 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్, రూ. 1 కోటి స్టాక్‌లు, రూ. 25 లక్షల మ్యూచువల్ ఫంఢ్స్, దాదాపు రూ.40 లక్షల ప్రావిడెంట్ ఫండ్‌లు, PPF, ఇతర పొదుపులు ఉన్నాయి. వారి మొత్తం నికర విలువ సుమారు రూ. 5 కోట్లకు చేరుకుంది.

పక్కా భవిష్యత్ ప్రణాళికలు  

ఈ జంట చివరికి పదవీ విరమణ కోసం రూ. 10 కోట్ల నికర ఆస్తులను సంపాదించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  తన ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి రూ. 2 కోట్ల చొప్పున పక్కన పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విదేశాలలో వృత్తిపరమైన అవకాశాలు ఉన్నప్పటికీ, వారు తమ తల్లిదండ్రులకు దగ్గరగా ఉండటానికి ఎంచుకున్నారు. ఎవరైనా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే చక్కగా డబ్బులు వెనుకేసుకోవచ్చంటున్నారు.

Read Also:  జుడియో తరహాలోనే వీటిలో కూడా దుస్తులు చాలా చీప్, వెంటనే ట్రై చెయ్యండి!

Related News

Americans Investments: బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా చేతినిండా సంపద.. అమెరికన్ల బుర్రే బుర్ర!

Maruti Suzuki e-Vitara: ప్రధాని మోదీ చేతుల మీదుగా.. మారుతీ సుజుకీ ఈవీ కారు, టార్గెట్ 100 దేశాలు

Gold Rates Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా?

కుటుంబ సభ్యుల నుంచి తీసుకునే కానుకలపై టాక్స్ ఉంటుందా..ఐటీ రూల్స్ ఏం చెబుతున్నాయి..

ఆడుతూ, పాడుతూ రూ. 10 కోట్లు వెనకేసుకోవడం ఎలా..? డబ్బు సంపాదనకు ఈజీ మార్గం..

Big Stories

×