BigTV English

India Exports: ట్రంప్ సుంకాల బాదుడుతో భారత్‌కు బంపర్ ఆఫర్.. ఎలాగంటే

India Exports: ట్రంప్ సుంకాల బాదుడుతో భారత్‌కు బంపర్ ఆఫర్.. ఎలాగంటే

India Leather Cashew Exports| అమెరికా ప్రభుత్వం ఇతర దేశాల దిగుమతులపై విధించిన సుంకాలు ప్రపంచదేశాల్లో ఆందోళనలు రేకెత్తించగా.. భారతీయ తోలు పరిశ్రమకు మాత్రం ఇది కొత్త అవకాశాలను తెరిచింది. నిపుణుల అంచనా ప్రకారం.. ఈ సుంకాలు అమెరికాలో భారత్‌ తన ఎగుమతులను విస్తరించుకునే అవకాశం కల్పించాయి. ఏప్రిల్ 2024 నుండి ఫిబ్రవరి 2025 వరకు భారత్ 870 మిలియన్ డాలర్ల (సుమారు రూ.7,221 కోట్లు) విలువైన తోలు, తోలు ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. భారతీయ తోలు ఉత్పత్తులకు అమెరికాలో ఉన్న డిమాండ్‌ను ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.


భారత్ తో పోటీ పడే దేశాలపై అమెరికా భారీ సుంకాలు
భారతీయ తోలు పరిశ్రమకు ఈ అవకాశం లభించడానికి ముఖ్య కారణం.. ఇతర దేశాలపై అమెరికా భారీగా ప్రతీకార సుంకాలు విధించడమే. చైనా, కంబోడియా, వియత్నాం వంటి దేశాలు భారత్‌కు పోటీగా ఉన్నప్పటికీ.. అమెరికా ఈ దేశాలపై భారత్ కంటే కనీసం 20 శాతం ఎక్కువ సుంకాలను విధించడం భారతీయ ఎగుమతిదారులకు అనుకూలంగా మారింది. ఇది భారత్‌కు అమెరికా మార్కెట్లో మరింత బలంగా స్థిరపడే అవకాశాన్ని అందిస్తుంది.

అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ (FIEO) మాజీ వైస్ ప్రెసిడెంట్ ఇస్రార్ అహ్మద్ మాట్లాడుతూ.. “తోలు పరిశ్రమకు ఇది పెద్ద అవకాశం. భారతీయ ఎగుమతిదారులు తమ ఉత్పత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడం ముఖ్యమైన అంశాలు. అలాగే, మార్కెట్ విస్తరణపై దృష్టి పెట్టాలి” అని సూచించారు.


Also Read: ట్రంప్ దెబ్బకు ఐఫోన్ ధరలు పైపైకి.. రొయ్యల రేట్లు కిందికి

పరిమిత కాలం లోపల సద్వినియోగం చేసుకోవాలా
కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నది ఏమిటంటే.. పోటీ దేశాలు కూడా ఈ సుంకాలను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తాయని, దాంతో భారత్‌కు ఈ టారిఫ్‌ల ప్రయోజనం ఆరు నుంచి తొమ్మిది నెలల లోపల తగ్గిపోవచ్చు. కాబట్టి, భారతీయ తోలు పరిశ్రమ తన బలమైన సరఫరా నెట్‌వర్క్‌ను, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని ఉపయోగించి.. నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

భారతీయ జీడిపప్పు పరిశ్రమకు కూడా సానుకూల సంకేతాలు
అమెరికా ప్రభుత్వం ఇటీవల విధించిన సుంకాలు భారతీయ జీడిపప్పు పరిశ్రమకు కూడా కొత్త అవకాశాలను సృష్టించాయి. వియత్నాం వంటి దేశాలపై 46 శాతం టారిఫ్ విధించడం వల్ల అమెరికా మార్కెట్ లో భారతీయ జీడిపప్పుకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వియత్నాం కంటే భారత్‌కు తక్కువ సుంకాలు ఉండడం కారణంగా 26 శాతం టారిఫ్‌తో అమెరికా జీడిపప్పు మార్కెట్లో ఇండియా తన వాటా గణనీయంగా పెంచుకోగలదు.

వియత్నాం ఆధిపత్యంకు చెక్.. భారత్‌కు అవకాశాలు
అమెరికా జీడిపప్పు మార్కెట్లో చాలా కాలంగా వియత్నాం ఆధిపత్యం చూపుతోంది. అమెరికా దిగుమతులలో సుమారు 90 శాతం వియత్నాం వాటా కలిగివుండగా, భారత్ వాటా చాలా తక్కువగా ఉంది. ఇది సంవత్సరానికి 7,000 నుండి 8,000 టన్నుల ఎగుమతులకు పరిమితమైంది. కానీ కొత్త టారిఫ్ విధానం భారత్‌కు అమెరికా మార్కెట్లో తన వాటాను పెంచుకోవడానికి మార్గం సుగమం చేసింది.

ప్రాసెసింగ్ సామర్థ్యాలను వెంటనే పెంచుకోవాలి
ఆల్ ఇండియా క్యాష్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బోలా రాహుల్ కామత్ మాట్లాడుతూ.. “భారతీయ ఎగుమతిదారులకు ఈ టారిఫ్ విధానాలు స్వల్పకాలిక ప్రయోజనాలను కలిగిస్తాయి. వియత్నాం వంటి దేశాలతో పోలిస్తే భారత్‌పై సుంకాలు తక్కువగా ఉండడం దీనికి కారణం. కానీ, అమెరికా జీడిపప్పు మార్కెట్లో భారత్ వాటాను పెంచుకోవడానికి ప్రాసెసింగ్ సామర్థ్యాలను పెంచుకోవడం చాలా ముఖ్యం” అని అన్నారు.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×