Hyderabad News: ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఒకేసారి ఆరుగురు అదృశ్యం అయ్యారు. ఆర్థిక సమస్యలా? లేక మరేదైనా కారణామా? అనేది తెలియరాలేదు. బంధువులు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగేశారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఎక్కడికి వెళ్లారనే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆ ఫ్యామిలీ ఏం జరిగింది? అన్నదే అసలు ప్రశ్న.
హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలో ఆరుగురు అదృశ్యమయ్యారు. న్యూబోయిన్‌పల్లి ఏడుగుళ్ల సమీపంలో ఉంటున్నారు మహేష్-ఉమా దంపతులు. ఈ ఫ్యామిలీకి నలుగురు రిషి, చైతు, శివన్ సంధ్య పిల్లలు ఉన్నారు. మహేశ్ స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఫ్యామిలీ అంతా గురువారం ఉదయం బయటకు వెళ్లింది. కానీ శుక్రవారం సాయంత్రం వరకు తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిప్ట్ చేయలేదు. దీనిపై అనుమానం వచ్చిన ఉమా బ్రదర్ భిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఉమా బంధువులు ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్‌పై ఫోకస్ చేశారు. భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా ఆరుగురి ఆచూకీ తెలుసుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి విజయవాడకు వెళ్లినట్టు ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది.
ALSO READ: మిస్సయిన మూడేళ్లకి ప్రియుడితో ఆ మహిళ
ఎర్రగడ్డ, ఈఎస్ఐ ఆసుపత్రులకు వెళ్లి చూశామని బిక్షపతి చెబుతున్నాడు. బోయినపల్లిలో ఆటో బుక్ చేసుకుని ఎంజీబీఎస్‌కు వెళ్లారు. డ్రాప్ చేసిన ఆటోడ్రైవర్‌ని పిలిచి పోలీసులు విచారించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు తమకు ఎలాంటి సమాచారం లేదన్నాడు. వాట్సాప్‌కు కాల్ చేస్తుంటే రిసీవ్ చేయలేదని అంటున్నాడు. సోదరి ఫ్యామిలీ గురించి ఎప్పటికప్పుడు విషయాలు పోలీసులు చెబుతున్నట్లు వెల్లడించాడు. పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
ALSO READ: ప్రాణం తీసిన ఎర్రచీర