Trump Tariff Iphone| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఫలితంగా యాపిల్ సంస్థ తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఐఫోన్ ధరలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోడల్‌ను బట్టి ధరలు 30-40 శాతం వరకు పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్ని దేశాలపై ట్రంప్ సుంకాలు విధించడంతో ఆయా దేశాల నుంచి అమెరికాలో దిగుమతి అయ్యే ఉత్పత్తుల రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో ఆయా ఉత్పత్తుల కొనుగోళ్లు లేక మార్కెట్లు వెలవెల బోతున్నాయి. ఈ పరిస్థితి యాపిల్ ఐఫోన్ పైనా పడనుంది. ఐఫోన్లు చైనాలో తయారవుతాయి. చైనా నుంచి వచ్చే దిగుమతుల ట్రంప్ 36 శాతం దాకా సుంకాలు విధించారు.
ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లు వీటిపై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితిలో యాపిల్ సంస్థ ఉత్పత్తుల ధరలను పెంచడం లేదా టారిఫ్ల భారం వినియోగదారులపై మోపడం వంటి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంది.
ధరల పెరుగుదల అంచనాలు:
ఐఫోన్ 16 మోడల్: ప్రస్తుత ధర $799 (₹68,000). టారిఫ్‌లు విధించబడితే, ధర $1,142 (₹97,000) వరకు చేరవచ్చు.
ఐఫోన్ 16 ప్రోమ్యాక్స్ (1 టెరాబైట్ మోడల్): ప్రస్తుత ధర $2,300 (₹2 లక్షలు). టారిఫ్‌లు అమలులోకి వస్తే, ధర మరింత పెరుగుదల చెందే అవకాశం ఉంది.
గతంలో యాపిల్‌కు ఉన్న మినహాయింపులు: ట్రంప్ కంటే ముందు ఉన్న ప్రభుత్వాలు..యాపిల్ సంస్థకు అదనపు పన్నుల నుంచి మినహాయింపులు ఇచ్చింది. కానీ ఈసారి అలాంటి మినహాయింపులు లభించకపోవచ్చు, ఇది సంస్థకు, వినియోగదారులకు భారంగా మారవచ్చు.
Also Read: ఇప్పుడే కొనేయండి.. ట్రంప్ దెబ్బకు బంగారం రప్పారప్పా..
ట్రంప్ సుంకాలతో కుదేలైన భారత రొయ్యల ధరలు
ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం.. పెద్ద టెక్ కంపెనీలపైనే కాదు.. చిన్నపాటి రైతుల మీద పడింది. భారత్ నుంచి దిగుమతి అయ్యే వ్యవసాయ, మాంస ఉత్పత్తులపై కూడా ట్రంప్ సుంకాలు భారీగా పెంచేశారు. దీంతో అమెరికాలో భారత రొయ్యలకు గిరాకీ దెబ్బతింది. దీని ఫలితంగా, పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల ధరలు కిలోకు ₹40 వరకు పడిపోయాయి. ఇది రైతులు, ఆక్వా రంగంపై ఆధారపడిన కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.విదేశాలకు ఇండియా నుంచి ఎగుమతి అవుతున్న మాంస ఉత్పత్తుల్లో మూడో స్థానంలో రొయ్యలున్నాయి. దేశీయ ఎగుమతుల్లో సింహభాగం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాదే. జిల్లాలో రొయ్యల సాగు మొత్తం 1.20 లక్షల ఎకరాల్లో జరుగుతోంది.
ప్రతీ సంవత్సరం.. జిల్లా నుంచి 3.5 లక్షల టన్నుల రొయ్యలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. బుధవారం నుంచి ట్రంప్ సుంకాలు అమలులోకి రావడంతో ఇప్పుడు ఒక్కసారిగా ఎగుమతులు తగ్గిపోయాయని సమచారం. బుధవారం సుంకాల ప్రభావం కారణంగా.. 100 కౌంట్ నాణ్యత ఉన్న రొయ్య ధర కిలో రూ.240 ఉండగా.. 24 గంటల్లోనే అంటే గురువారం రోజున ధర రూ.200కి తగ్గిపోయింది.
ట్రంప్ విధించిన సుంకాలు దాదాపు అన్ని ప్రపంచ దేశాలు ప్రభావితమయ్యాయి. ఈ పరిణామాలతో అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య యుద్ధాన్ని తలపిస్తున్నాయి.