Alekhya Chitti Sorry: గత కొద్ది రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న అలేఖ్య చిట్టీ పికెల్స్ వ్యవహారంపై ఎట్టకేలకు అలేఖ్య స్పందించింది. తప్పు చేశాను క్షమించాలంటూ వేడుకుంది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేసింది. “నేను అలేఖ్య చిట్టీని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే నేను ఇప్పటి వరకు తిట్టానో వాళ్లందరికీ సారీ” అని వీడియోలో చెప్పుకొచ్చింది. ఈ వీడియోను తన సిస్టర్ రమ్య ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. “మనుషులు అoదరూ తప్పులు చేస్తారు. తప్పు తెలుసుకుని, పశ్చాత్తాపం పడటo దాన్ని మిoచిన ప్రాయశ్చిత్తం!” అంటూ ఈ వీడియోను పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటికే స్పందించిన అలేఖ్య అక్క, చెల్లి
ఇక ఇప్పటికే అలేఖ్య చిట్టీ.. అక్క సుమ ఈ వివాదంపై స్పందించింది. అనవసరంగా ఈ వివాదంలోకి తన ఫ్యామిలీని లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన చెల్లి చేసింది తప్పే అని చెప్పిన సుమ.. అలా అని ఉండకూడదని చెప్పుకొచ్చింది. అలేఖ్య చెల్లి రమ్య కూడా తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. తమను చాలా మంది బూతులతో హింసిస్తున్నారని, వాళ్ల టార్చర్ తట్టుకోలేకే అక్క అలా చేసి ఉంటుందని చెప్పింది. అయితే, ఒకరికి పంపించాల్సిన వీడియోను మిస్టేక్ గా మరొకరికి పంపించడంతో ఈ వివాదం చెలరేగించిందని వివరణ ఇచ్చింది. ఇక ఫైనల్ గా అలేఖ్య చిట్టీ స్పందించింది. అందరికీ క్షమాపణలు చెప్పింది.
Read Also: పచ్చళ్లు అమ్ముకోండి పర్వాలేదు.. ఆ పచ్చి బూతులు ఎందుకమ్మా?
నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు
అలేఖ్య సారీ చెప్తూ వీడియో రిలీజ్ చేసిన వీడియోపై కొంత మంది సానుభూతి వ్యక్తం చేస్తుంటే, మరికొంత మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఓవర్ యాక్టింగ్ అదిరింది” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఈ బుద్ది ముందే ఉండాలి. ఇప్పటికైనా అమ్మాయిలాగా బిహేవ్ చేయడం నేర్చుకో” అని సూచించాడు. “సారీ చెప్పింది కదా.. ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలి వేయడం మంచిది. మానవత్వాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఇది” అని మరొకరు అభిప్రాయపడ్డారు. “ఇలా అడ్డగోలుగా నోటికి ఎంత మాట వస్తే, అంతమాట తిట్టే వారిని అస్సలు వదలకూడదు. ఒకసారి జైలుకు పంపిస్తే సెట్ రైట్ అవుతారు” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. కొంతమంది అలేఖ్యను క్షమించాలని కోరుతుంటే, మరికొంత మంది అస్సలు వదలకూడదంటున్నారు.
Read Also: ఏంటీ అలేఖ్య పచ్చళ్లు తింటే.. గర్భం వస్తుందా?
ఇంతకీ అలేఖ్య చిట్టీ వివాదం ఏంటంటే?
రాజమండ్రికి చెందిని ముగ్గురు అక్కా చెల్లెల్లు సుమ, అలేఖ్య, రమ్య కలిసి అలేఖ్య చిట్టి పికెల్స్ పేరుతో నాన్ వెజ్ పచ్చళ్ల వ్యాపారం చేస్తున్నారు. ముందుగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న వీళ్లు పచ్చళ్ల వ్యాపారంలోకి అడుగు పెట్టారు. మార్కెట్ లో ఇతరులతో పోల్చితే ఎక్కువ ధరకు నాన్ వెజ్ పికెల్స్ అమ్ముతున్నారు. రీసెంట్ గా ఓ వ్యక్తి వీళ్ల దగ్గర పచ్చళ్లు కొనుగోలు చేయాలని వాళ్ల వాట్సాప్ కు మెసేజ్ పెట్టాడు. వాళ్ల పికెల్స్ ధరలు చూసి, మరీ ఇంతా? అని అడిగాడు. వెంటనే అలేఖ్య, అతడిపై బూతులతో విరుచుకుపడింది. అతడిని పర్సనల్ లైఫ్ ను కించపరిచేలా కామెంట్స్ చేసింది. అతడు ఈ ఆడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తీవ్ర వివాదం చెలరేగింది. తాజాగా మరో మహిళా కస్టమర్ పైనా పచ్చళ్లుకొనుగోలు చేసే స్తోమత లేకపోతే ఇళ్లలో పాచి పని చేసుకుని బతకాలంలూ చీప్ గా మాట్లాడింది. ఈ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అక్కా చెల్లెళ్లు ముగ్గూరూ వివరణ ఇచ్చారు. తాజాగా అలేఖ్య సారీ చెప్పింది. ఇప్పటికైనా ఈ వివాదం ముగిసిపోతుందేమో చూడాలి.
Read Also: ఒసేయ్.. నీకెందుకే పచ్చళ్లు.. పాచిపని చేస్కో.. అలెఖ్య మరో ఆడియో లీక్!