Big Stories

Rupee Falling Down: పడిపోతున్న రూపాయి విలువ.. అత్యంత కనిష్టంగా!

- Advertisement -

ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలవిల్లాడిపోతుంది. ట్రేడింగ్‌లో డాలర్‌తో పోల్చితే దేశీయ కరెన్సీ మారకం విలువ.. 83 రూపాయల 45 పైసలకి పడిపోయింది. అయితే దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆందోళనలు రూపాయి విలువపై దారుణంగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర 90 డాలర్లకు చేరుకుంది. గత ఐదు నెలల్లో ఇదే అత్యధికం. ఎట్ ది సేమ్ టైమ్.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్లను తగ్గించాలనుకున్న ఆలోచనను మరోసారి వాయిదా వేసింది. వచ్చే ఏడాది వరకు ఇది ఉండకపోవచ్చు. ప్రస్తుతం డాలర్ విలువ పెరుగుతుండటంతో వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచనను పక్కన పెట్టేసింది. ఈ ఎఫెక్ట్ కూడా రూపాయిపై పడింది. అభివృద్ధి చెందుతున్న దేశాలపై డాలర్ ప్రభావం ఎప్పటి నుంచో ఉన్నది. చమురు ధర పెరిగిందంటే.. ఓ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడినట్టే.. ముఖ్యంగా చమురును భారీగా దిగుమతి చేసుకునే మన దేశంపై ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. దీనికి తోడు ఫారిన్ ఇన్వెస్టర్సంతా  తమ షేర్లను అమ్మడంపైనే ఫోకస్ చేస్తుండటం కూడా రూపాయి విలువపై ప్రభావం చూపుతోంది..

- Advertisement -

అయితే షేర్ల అమ్మకంపైనే ప్రస్తుతం ఫుల్ ఫోకస్ కనిపిస్తోంది. దీనికి మెయిన్ రీజన్.. ప్రస్తుతం అమ్మితేనే ఫుల్ లాభాలు వస్తాయన్న ఆలోచన కనిపిస్తోంది. ఎట్ ది సేమ్ టైమ్.. యూస్‌ బాండ్స్‌ కూడా చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి ఇన్వెస్టర్లను.. మరోవైపు రూపాయి బలహీనపడటం ఇప్పుడు టెన్షన్లను పెంచుతోంది. ఎప్పుడైతే రూపాయి బలహీనపడితే.. దిగుమతులు భారంగా మారుతాయి. కరెంట్‌ అకౌంట్‌పై ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది.. ఫారిన్ కరెన్సీ నిల్వలు వేగంగా కరిగిపోయే చాన్స్ ఉంది. అదే సమయంలో ఎగుమతులపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇదే జరిగితే కరెంట్‌ అకౌంట్‌పై ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది. హిస్టారికల్‌గా చూస్తే ఇండియా, చారిత్రాత్మకంగా రూపాయి స్థిరంగా బలహీనపడిన ప్రతిసారి.. ద్రవ్యోల్బణం రూపంలో కనిపిస్తోంది.

Also Read: Small Saving Schemes: ఆ ఖాతాల నుంచి డబ్బు తీయాలంటే ఆధార్, పాన్ కార్డులు ఉండాల్సిందే!

అయితే రోజురోజుకి డాలర్ బలపడటం కూడా రూపాయిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇన్వెస్టర్లంతా ఫెడరల్‌ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తారన్న ఆశతో ఉన్నారు. అయితే యూఎస్‌ గవర్నమెంట్‌ తీసుకున్న చర్యలతో వారంత హ్యాపిగా ఉన్నారు. ఎకనామిక్‌ ఇండికేటర్స్ పాజిటివ్‌గా ఉన్నాయి.. మ్యానుఫ్యాక్టరింగ్ సెక్టార్‌కు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు.. కన్జ్యూమర్ సెంటిమెంట్‌ కూడా పాజిటివ్‌గా ఉండటంతో.. డాలర్ వ్యాల్యూ అంతకంతకు పెరుగుతోంది.

అయితే USలో వడ్డీ రేట్ల అంచనాలు డాలర్‌కు మద్దతు ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లంతా డాలర్‌వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ సెంటిమెంట్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశమైతే కనిపిస్తోంది. బట్.. ఇండియాలో పెరిగిన విదేశీ పెట్టుబడులు. ఎస్పెషల్లీ గ్లోబల్ బాండ్ సూచీలలో.. భారత ప్రభుత్వ బాండ్లను చేర్చడం. ఈ చర్యలు తీసుకోవడంతో ఇండియా చేసే పేమెంట్స్‌ను బ్యాలెన్స్‌ చేస్తుంది. కాస్త క్షిణించినా రూపీపై పాజిటివ్ లుక్ కనిపిస్తుంది.

Also Read: Discount on Toyota Cars: ఈ కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్.. ఏకంగా రూ.1.50 లక్షల తగ్గింపు.. ఆఫర్ ఈ మంత్ ఎండ్ వరకే!

అయితే ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్‌లో యూరో కరెన్సీతో కంపెర్ చేస్తే రూపీ మంచి స్థాయిలోనే ఉంది. అంతేకాదు ఫారెక్స్ నిల్వలు పెరగడం.. కరెంట్ ఖాతా లోటు తక్కువ ఉంటాయన్న అంచనాలు.. కాస్త భరోసాని ఇస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ -ఇరాన్ వార్ మధ్య ఉద్రిక్తతలు పెరిగితే మాత్రం.. కాస్త భయపడాల్సిందే.. ఎందుకంటే ఉద్రిక్తతలు పెరిగితే ఇరాన్‌పై ఆంక్షలు పెరుగుతాయి. ఇరాన్‌పై ఆంక్షలు విధించిన మరుక్షణం.. చమురు తరలింపుపై ఎఫెక్ట్ కనిపిస్తుంది. రెడ్ సీలో చమురు ట్యాంకర్ల రవాణాపై ఇరాన్, హౌతీ టార్గెట్ చేస్తుంది. దీంతో చమురు రవాణాకు ఇబ్బందులు తప్పవు.. దీంతో చమురు ధరలు పెరుగుతాయి. ఇవన్నీ కలిపి మళ్లీ రూపాయి విలువపైనే ఎఫెక్ట్ చూపుతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News