BigTV English

Small Saving Schemes: ఆ ఖాతాల నుంచి డబ్బు తీయాలంటే ఆధార్, పాన్ కార్డులు ఉండాల్సిందే!

Small Saving Schemes: ఆ ఖాతాల నుంచి డబ్బు తీయాలంటే ఆధార్, పాన్ కార్డులు ఉండాల్సిందే!

Aadhar and Pan required for PPF, SSY, NSC Schemes for Withdrawal: భారత్ అభివృద్ది చెందుతున్న దేశం. దేశంలో మధ్యతరగతి జనాభా అధిక సంఖ్యలో ఉంటారు. కొందరికైతే పూట గడవను కూడా కష్టంగానే ఉంటుంది. దేశంలోని వివిధ వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది. ఈ క్రమంలోనే అనేక రకాల పొదుపు పథకాలను తీసుకొస్తుంటుంది. దీని కోసం మీరు ఏదైనా పోస్టాఫీసు లేదా బ్యాంకుకు వెళ్లి అకౌంట్ తీసుకోవచ్చు. అయితే PPF, SSY, NSC వంటి పొదుపు ఖాతాలను తెరవడానికి కొన్ని డాక్యుమెంట్ల అవసరం ఉంటుంది. అందులో ఆధార్ కార్డ్ ఉండాలనే సందేహం మీకు ఉంటే.. అవుననే చెప్పాలి. ఖాతాను తెరిచేటప్పుడు ఆధార్ కార్డును తప్పని సరిగా కలిగి ఉండాలి.


చిన్న పొదుపు ఖాతా తెరవడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జారీ చేసిన ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 3, 2024న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ వ్యక్తికి ఆధార్ కార్డు లేకుంటే ఆధార్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు వచ్చిన స్లిప్‌లో పేర్కొన్న ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను మీరు అందించాల్సి ఉంటుంది. దీని తర్వాత, ఖాతా తెరిచిన తర్వాత, మీరు ఆరు నెలల్లోపు ఆధార్ నంబర్‌ను అందించాలి.

మీరు ఖాతా తెరిచిన ఆరు నెలల్లోపు ఆధార్ నంబర్‌ను నమోదు చేయడంలో విఫలమైతే.. అటువంటి పరిస్థితిలో మీ చిన్న పొదుపు ఖాతాను బ్యాంక్ లేదా పోస్టాఫీసు నలిపివేస్తుంది. ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత మాత్రమే ఇది మళ్లీ యాక్టివేట్ అవుతుంది.


Also Read: రతన్ టాటా ఎమోషనల్ కార్.. టాటా ఇండికా చరిత్ర తెలుసా? 

ఆధార్ మాదిరిగానే చిన్న పొదుపు పథకాలకు పాన్ కార్డు కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఖాతాలో జమ చేసిన మొత్తం రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే అటువంటి పరిస్థితిలో పాన్ కార్డును అందించడం తప్పనిసరి. అంతే కాకుండా ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో రూ.లక్ష కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ తప్పనిసరి. ఇది కాకుండా ఖాతా నుండి ఒకేసారి రూ. 10,000 కంటే ఎక్కువ మొత్తాన్ని విత్‌డ్రా చేసినా పాన్, ఆధార్ అవసరం ఉంటుంది.

Tags

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×