BigTV English

Naga Vamsi on Devara Rights: సితార నాగవంశీ చేతికి ‘దేవర’ హక్కులు..? క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!

Naga Vamsi on Devara Rights: సితార నాగవంశీ చేతికి ‘దేవర’ హక్కులు..? క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!

Producer Naga Vamsi Clarifies on Jr Ntr Devara Movie Rights: ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఎన్టీఆర్ నటిస్తోన్న ‘దేవర’ మూవీ ఒకటి. ఈ చిత్రంపై ఎన్నో భారీ అంచనాలు ఉండగా.. సినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఇదే కావడంతో ఫుల్ హైప్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్‌ను ఎన్నడూ చూడని లుక్‌లో చూపించబోతున్నాడు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ టీజర్ ఓ రేంజ్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ముఖ్యంగా గ్లింప్స్‌లో ఎన్టీఆర్ మాస్ లుక్ చూసి సినీ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇకపోతే ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

devara ntr
devara ntr

ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. అయితే ఈ మూవీపై ఫుల్ బజ్ ఉండటంతో తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం ప్రముఖ బడా నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార నాగవంశీ చేతికి వచ్చాయని టాక్ నడుస్తోంది.


Also Read: బ్రేకింగ్.. ధర్మ ప్రొడక్షన్స్ చేతికి దేవర.. నార్త్ లో ఎన్టీఆర్…

ఇటీవల టిల్లు స్క్వేర్ ఈవెంట్‌లో ఎన్టీఆర్, త్రివిక్రమ్, నాగవంశీ కలిసి కనిపించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై తాజాగా నిర్మాత నాగవంశీ స్పందించాడు. ఈ మేరకు అతడు ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్‌ చేశాడు.. ‘‘బయట వినిపిస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ఏదైనా అప్డేట్ ఉంటే మేమే అధికారికంగా వెల్లడిస్తాం.

nagavamsi
nagavamsi

అంతవరకు ఎలాంటి వార్తలను నమ్మవద్దు. వాటిని పట్టించుకోకండి’’ అంటూ ఆ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. అయితే అందులో సినిమా పేరు మాత్రం వెల్లడించలేదు. దీంతో దేవర సినిమా రైట్స్ మీద వస్తున్న రూమర్లపైనే స్పందించి ఉంటాడని చాలామంది అనుకుంటున్నారు. మరి ఈ దేవర హక్కులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×