BigTV English

Casting Call from Venkyanil3: వెంకటేష్ కొత్త సినిమాలో నటించాలని ఉందా..? ఇలా చేయండి!

Casting Call from Venkyanil3: వెంకటేష్ కొత్త సినిమాలో నటించాలని ఉందా..? ఇలా చేయండి!

Casting Call from Venky – Anil Movie: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ ఈ ఏడాది ‘సైంధవ్’ మూవీతో వచ్చారు. సంక్రాంతి సందర్భంగా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించినంత స్థాయిలో హిట్ కాలేకపోయింది. దీంతో వెంకీమామ తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు.


ఇందులో భాగంగానే తనకు వరుస రెండు హిట్లు అందించిన దర్శకుడు అనిల్ రావిపూడితో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎఫ్2’, ‘ఎఫ్ 3’ సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను రాబట్టాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యారు.

Venky – Anil

వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీ బిజీగా ఉంది. ఇందులో భాగంగానే సినిమాలో నటించే ఆర్టిస్టుల కోసం మూవీ యూనిట్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. మూవీలలో నటించాలనే ఆసక్తి ఉన్నవాళ్ల కోసం కాస్టింగ్ కాల్ ఏర్పాటు చేసింది. దీని గురించి పూర్తి వివరాలు ఇలా..


Also Read:ఎఫ్ 3 కాంబో.. ఇక అధికారికం!

వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం గోదావరి స్లాంగ్ మాట్లాడేవాళ్లు కావాలని మూవీ టీం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అందులో 6 నుంచి 14 ఏళ్ళు, 25 నుంచి 55 ఏళ్ళ మధ్య వయసున్న మగవారు, ఆడవాళ్లు కావాలని తెలిపారు. అందువల్ల ఆసక్తి ఉన్నవారు VENKYANILO3@GMAIL.COM లేదా WHATSAPP: 8247812007 కి మీరు చేసిన యాక్టింగ్ వీడియోలు పంపాలి. అయితే గమనించాల్సింది ఏంటంటే.. ఇన్‌స్టా రీల్స్ మాత్రం పంపకూడదు. అందువల్ల సినిమాల్లో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న గోదావరి స్లాంగ్ వాళ్లకి ఇదొక చక్కటి అవకాశమనే చెప్పాలి.

Venky - Anil
Venky – Anil

Also Read: Jyothika: తల్లిదండ్రులతో సూర్య.. జ్యోతిక మాత్రం రాకుండా.. ?

కాగా ఈ మూవీలో వెంకీమామతో ఇద్దరు హీరోయిన్లు జతకట్టనున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి అని ఈ మధ్య వార్తలు జోరుగా సాగుతున్నాయి. మరో హీరోయిన్ గురించి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఈ సినిమాకు గానూ మేకర్స్ ఓ టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి గానూ ‘నారి నారి నడుమ మురారి’ అనే టైటిల్‌ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×