HarGhar Lakhpati: ప్రతి ఒక్కరికీ కూడా లక్షాధికారి కావాలని ఉంటుంది. కానీ అందుకోసం ఏం చేయాలి, ఏలా కావాలనేది అనేక మందికి తెలియదు. దీని కోసం ఒకేసారి పెద్ద మొత్తాన్ని కాకుండా నెల నెలా కాస్త పొదుపు చేస్తే మీరు సులభంగా లక్షాధికారి కావచ్చు. అందుకోసం SBI తీసుకొచ్చిన ప్రత్యేక పథకం ‘హర్ ఘర్ లఖపతి’ స్కీం చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ ఆదాయం పెద్దగా లేకపోయినా, మధ్యతరగతి కుటుంబాలకు ఈ స్కీం బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ స్కీం ద్వారా ప్రతి నెలా కొంత మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే చాలు మీరు లక్షాధికారి అవుతారు. ఈ రికరింగ్ డిపాజిట్ పథకం నుంచి వచ్చే మొత్తాన్ని భవిష్యత్తులో పిల్లల చదువు లేదా ఏదైనా అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.
ఈ పథకంలో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?
ఏ భారతీయుడైనా కూడా ఈ పథకంలో పెట్టుబడి చేయవచ్చు. ఆయా వ్యక్తులు దీనిలో సింగిల్ లేదా జాయింట్ ఖాతాను తెరవవచ్చు. తల్లిదండ్రులు 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న తమ పిల్లల కోసం కూడా ఖాతా తెరవవచ్చు. ప్రతి నెలా క్రమం తప్పకుండా పొదుపు చేసి, నిర్ణీత సమయంలోపు మీ లక్ష్య మొత్తాన్ని ఈ స్కీం ద్వారా ఈజీగా చేరుకోవచ్చు.
ఈ స్కీం ద్వారా ఎంత వడ్డీ లభిస్తుంది..
ఈ పథకంలో సాధారణ పౌరులకు సంవత్సరానికి గరిష్టంగా 6.75% వడ్డీ రేటు లభిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి గరిష్టంగా 7.25% వడ్డీ రేటు అందిస్తారు. ఈ పథకంలో ప్రతి నెలా డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీ లభిస్తుంది. ఆ క్రమంలో ప్రతి మూడు నెలలకు వడ్డీ చక్రవడ్డీగా మారుతుంది. RD కాలపరిమితిని బట్టి వడ్డీ రేటు మారుతుంది.
మెచ్యూరిటీ వ్యవధి ఎంత ఉంటుంది
‘హర్ ఘర్ లఖపతి’ స్కీం’ పథకం మెచ్యూరిటీ వ్యవధి సాధారణంగా 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే మీరు 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు పెట్టుబడి చేయవచ్చు.
Read Also: CMF Phone 2 Pro: దమ్మున్న ఫీచర్లతో CMF ఫోన్ ప్రో2.. …
మీరు ప్రతి నెలా ఎంత పెట్టుబడి చేయాలి
SBI ‘హర్ ఘర్ లఖపతి’ పథకం కింద, సీనియర్ సిటిజన్లు, సాధారణ పౌరులు ప్రతి నెలా ఎంత డబ్బు జమ చేస్తే, ఎంత వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
-మీరు ప్రతి నెలా రూ. 593 పెట్టుబడి పెడితే, రాబోయే 10 సంవత్సరాలలో మీరు రూ. 1 లక్ష సంపాదిస్తారు.
-3 సంవత్సరాలలో రూ. 10 లక్షలు సేకరించడానికి, మీరు ప్రతి నెలా రూ. 25020 పెట్టుబడి పెట్టాలి.
-4 సంవత్సరాలలో రూ. 10 లక్షల మొత్తాన్ని దక్కించుకునేందుకు, పెట్టుబడి చేయాల్సింది రూ. 18120 అవుతుంది.
-5 సంవత్సరాలలో రూ. 10 లక్షలు సేకరించడానికి, రూ. 13910 పెట్టుబడి పెట్టాలి.
-10 సంవత్సరాలలో రూ. 10 లక్షలు సంపాదించడానికి, మీరు ప్రతి నెలా రూ. 5760 పెట్టుబడి పెట్టాలి.
నేను ఎంత పన్ను చెల్లించాలి?
రికరింగ్ డిపాజిట్ (RD) నుంచి వడ్డీ ఆదాయం రూ. 40 వేల వరకు ఉంటే, అప్పుడు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. సీనియర్ సిటిజన్ల విషయంలో ఈ పరిమితిని రూ.50 వేలుగా నిర్ణయించారు. దీని కంటే ఎక్కువ ఆదాయం ఉంటే, 10% TDS ద్వారా తగ్గించబడుతుంది.
పన్ను ఆదా కావాలంటే ఏం చేయాలి? (HarGhar Lakhpati)
మీరు పన్ను పరిధిలోకి రాకపోతే, ఫారం 15H-15G నింపండి. సీనియర్ సిటిజన్లు బ్యాంకులో ఫారం 15H ని సమర్పించాలి. ఇతరులు ఫారం 15G ని సమర్పించాలి. ఫారం 15G లేదా ఫారం 15H అనేది మీరు మీ ఆదాయం పన్ను పరిమితికి వెలుపల ఉందని తెలిపేది.