BigTV English

Travel Vlogger: మన రైల్వే స్లీపర్ క్లాస్ లో 15 గంటలు ప్రయాణించిన విదేశీయుడు.. దెబ్బకు ఆస్పత్రిపాలు!

Travel Vlogger: మన రైల్వే స్లీపర్ క్లాస్ లో 15 గంటలు ప్రయాణించిన విదేశీయుడు.. దెబ్బకు ఆస్పత్రిపాలు!

Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థలలో ఒకటిగా కొనసాగుతోంది. గత దశాబ్దకాలంగా సమూలంగా అభివృద్ధి చెందుతోంది. అత్యాధునిక సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి రవాణా అనుభవాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ ట్రావెలర్ నిక్ మాడాక్ ఇండియన్ రైల్వే జర్నీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. గత ఆరు సంవత్సరాలు తాను ట్రావెల్ చేస్తున్నట్లు చెప్పిన ఆయన, ఇంత దారుణమైన రైలు ప్రయాణం ఎప్పుడూ ఎదురుకాలేదన్నాడు. రైలు ప్రయాణం కారణంగా తాను హాస్పిటల్ పాలు కావాల్సి వచ్చిందన్నాడు.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

మిస్సోరీకి చెందిన నిక్ మాడాక్ గత ఆరు సంవత్సరాలుగా ఎన్నో దేశాల్లో పర్యటించారు. అలాగే ఇండియాకు వచ్చాడు.  రీసెంట్ గా అతడు వారణాసి నుంచి న్యూజల్పైగురికి ప్రయాణించాడు. థర్డ్ ఏసీ టికెట్ తీసుకొని జర్నీ చేశాడు. 15 గంటల పాటు జర్నీ అనంతరం అతడు హాస్పిటల్ పాలయ్యాడు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు తాను ఇలాంటి ప్రయాణం ఎప్పుడూ చేయలేదని చెప్పుకొచ్చాడు. “ఇండియన్ స్లీపర్ రైలులో ప్రయాణించండి, ఓ అనుభవం అవుతుంది” అంటూ తన వీడియోను షేర్ చేశాడు. హాస్పిటల్ బెడ్ మీది నుంచి ఈ వీడియోను తీసి నెట్టింట పోస్టు చేశాడు.


నిక్ మాడాక్ ఏం చెప్పాడంటే? 

తన ట్రావెల్ కెరీర్ లో ఇండియన్ ట్రైన్ జర్నీ అత్యంత దారుణమైన ప్రయాణం ఎక్కడా చేయలేదన్నాడు నిక్ మాడాక్. “ఇండియా అంటే నాకు ఎంతో ఇష్టం. నేను ఈ దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను. ఉదారమైన ప్రజలు, అందమైన ప్రకృతి దృశ్యాలు, గొప్ప చరిత్ర కలిగి ఉంది. అదే సమయంలో వారణాసి నుంచి న్యూ జల్పైగురికి థర్ ఏసీ రైలులో 15 గంటలు ప్రయాణించాను. నా 6 సంవత్సరాల ట్రావెల్ జర్నీలో నేను చూసిన అత్యంత దారుణమైన ఎక్స్ పీరియెన్స్ ఎదుర్కొన్నాను. ప్రయాణం తర్వాత మూడు రోజులకు నాకు తీవ్రమైన శ్వాసకోశ సమస్య తలెత్తినట్లు నిర్దారణ అయ్యింది. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. కానీ, కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. ప్రస్తుతం భూటాన్ లోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను” అని నిక్ చెప్పుకొచ్చాడు. ఇక రైలు ప్రయాణంలో పరిశుభ్రత సరిగా లేదని నిక్ చెప్పుకొచ్చాడు. రైలు వాష్ రూమ్ అత్యంత దారుణంగా ఉన్నట్లు వెల్లడించాడు. ఇదే విషయాన్ని సూచిస్తూ ఓ వీడియోను షేర్ చేశాడు.

ఎవరీ నిక్ మాడాక్?

నిక్ మాడాక్ గత ఆరు సంవత్సరాల్లో 120 దేశాల్లో ప్రయాణించాడు.  ఇద్దరు వ్యక్తులు తనను రైలు ప్రయాణం చేయాలని కోరాడు. రైలు ప్రయాణం చాలా సరదాగా ఉంటుందన్నాడు. కానీ, వారి మాటలు పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. ఇక ఈ వీడియో కాసేపట్లోనే నెట్టింట వైరల్ అయ్యింది. కొంత మంది ఆయనకు జరిగిన ఇబ్బందిపై సానుభూతి వ్యక్తం చేయగా, మరికొంత మంది ఆయన ఎంచుకున్న రైలు ప్రయాణం సరైనది కాదని విమర్శించారు. వ్యూస్ కోసం ఇండియన్ రైలు ప్రయాణం మీద నెగెటివ్ ప్రచారం చేయడం మంచిది కాదని సూచించారు. వచ్చేసారి ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించి రివ్యూ ఇస్తే బాగుంటుందన్నారు.

Read Also: స్పెయిన్ లో అర్ధరాత్రి అలజడి.. రైళ్లలోనే ప్రయాణీకులు బంధీ, అసలు ఏమైంది?

Related News

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Big Stories

×