BigTV English

Office Harassment: 15 నిమిషాల కంటే ఎక్కువ సేపు బ్రేక్ తీసుకుంటే ఉద్యోగం ఊడుతుంది.. కంపెనీ హెచ్చరిక

Office Harassment: 15 నిమిషాల కంటే ఎక్కువ సేపు బ్రేక్ తీసుకుంటే ఉద్యోగం ఊడుతుంది.. కంపెనీ హెచ్చరిక

Office Harassment 15 Minutes Break| ఇటీవలి కాలంలో బాగా చదువుకున్నవారు సైతం ఉద్యోగాలు లభించక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. కార్పొరేట్ కంపెనీల్లో వేలు, లక్షల్లో వేతంన పొందే ఉద్యోగులు పని ఒత్తిడికి గురై మానసికంగా కుంగిపోతున్నారు. పోటీ ప్రపంచంలో ఉత్పత్తి పెంచేందుకు దాదాపు కంపెనీలన్నీ తక్కువ ఉద్యోగులతో ఎక్కువ పనిచేయించాలని శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. అందుకోసం ఉద్యోగులు విరామం తీసుకోకుండా పనిచేయలి.. ఆదివారం సెలవు ఉన్నా పనిచేయాలి, రోజుకు 12 గంటలు, 18 గంటలు పనిచేయాలని కొత్త కొత్త రూల్స్ పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారు.


ఈ క్రమంలో తాజాగా ఒక ఉద్యోగి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన రెడ్డిట్ లో తన కంపెనీ సీఈఓ ఏ విధంగా వేధిస్తున్నాడో ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. ఆ బడా కంపెనీలో కొత్తగా ఉద్యోగంలో చేరిన ఈ యువకుడు.. ఆఫీసులో పని విధానాల గురించి ఆశ్చర్యపోయాడు. అక్కడ పూర్తిగా సైలెంట్ గా ఉండాలి. యజమాన్యం చాలా కఠినంగా ఉంటుందని రాశాడు. దీంతో పాటు అతను తన సిఈఓ ఉద్యోగులందరికీ పంపిన ఈ మెయిల్ బయటపెట్టాడు. అందులో కంపెనీ సీఈఓ కఠినంగా రూల్స్ పెట్టాడని వాటిని ఉల్లంఘిస్తే ఉద్యోగం నుంచి తొలిగిస్తానని హెచ్చరించినట్లు రాశాడు.

“మా కంపెనీ సీఈఓ కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరికీ ఒక మాస్ ఈ మెయిల్ పంపించారు. ఆయన అందులో చాలా కఠినంగా రూల్స్ పెట్టాడు. ఆఫీసు బ్రేక్ టైమ్ 15 నిమిషాలు దాటితే ఆ ఉద్యోగిని ఫైర్ చేస్తారట. పనిచేసే సమయంలో తల కూడా తిప్పకుండా పనిచేయాలట. ఆఫీసులో కనీసం టీ, కాఫీ కూడా ఇవ్వరు. తాగడానికి బయటికి వెళ్లాలి. మరి సమయం ఎలా సరిపోతుంది. ఇంతకుముందు నేను మరో ఆఫీసులో 18 నెలల పనిచేశాను. చాలా సౌకర్యంగా ఉండేంది. ఎన్నిసార్లు బ్రేక్ తీసుకున్నా ఏమనేవారు కాదు? పని పూర్తి చేస్తే చాలు. అని చెప్పేవారు. కొత్త ఉద్యోగంలో చేరిన తరువాత నాకు ఊపిరి తీసుకోవడం సమస్యగా మారింది.” అని రెడ్డిట్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. నెటిజెన్లు “ఆ కంపెనీ పేరు చెప్పు.. అందులో ఉద్యోగం ఉన్నా మేము వెళ్లము” అని కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్ ని ఆ యూజర్ రెస్పాన్స్ ఇచ్చాడు. “నాకు ప్రస్తుతం మరో ఉద్యోగం లేదు. నేను పేరు చెబితే నా ఉద్యోగం పోతుంది.” అని సమాధానం ఇచ్చాడు.


Also Read: ఐపిఎల్ చూస్తూ ప్రమాదవశాత్తు తుపాకీ పేల్చిన బాలుడు.. పొరుగింటి వ్యక్తి మృతి

ఇంకొక యూజర్ అయితే.. “మీ కంపెనీ నిన్ను ఫైర్ చేసేముందు నువ్వే రాజీనామా చేసేయ్.. మరొక ఉద్యోగం దొరుకుతుంది. భయపడకు” అని రాశాడు.మరొక యూజర్ అయితే.. “మీ కంపెనీ సీఈఓ బాగా పిసినారిలా ఉన్నాడే.. ఏదో చిల్లర కొట్టు నడుతున్నట్లుగా ఉంది. అతని తీరు” అని సరదాగా రాశాడు.

అంతకు కొన్ని రోజుల ముందే ఒక 22 ఏళ్ల యువతిని ఆమె మేనేజర్ ఉద్యోగం నుంచి తొలగించేశాడు. కేవలం ఆదివారం తాను పనిచేయడానికి నిరాకరించిందనే కారణమే ఉద్యోగం తొలగింపునకు కారణం. ఆమె లింక్‌డ్ ఇన్ ఓ పోస్ట్ పెట్టింది. చాలా మంది నెటిజెన్లు ఆమెకు మద్దతు తెలుపుతూ వెంటనే లేబర్ విభాగంలో ఫిర్యాదు చేయాలని.. కంపెనీపై కోర్టులో కేసు ఫైల్ చేసి నష్టపరిహారం కోరమన్నారు.

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×