E-Paper
Advertisement

Gold ETFs: పెట్టుబడిదారుల విశ్వాసం.. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడుల ప్రవాహం, మరి మార్కెట్ మాటేంటి?

Gold ETFs: పెట్టుబడిదారుల విశ్వాసం.. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడుల ప్రవాహం,  మరి మార్కెట్ మాటేంటి?
Advertisement

Gold ETFs: దేశీయ బాంబే స్టాక్‌ మార్కెట్ పెట్టుబడుదారులను ఆకట్టుకుంటోంది. మే నెలలో రూ. 725 కోట్ల నిధుల ఉపసంహరణను చవిచూసిన గోల్డ్ ఈటీఎఫ్‌, జూన్‌లో రూ. 3,443 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా-AMFI డేటా వెల్లడించింది. ఆకస్మిక మార్పు మే నెలలో నిధుల ఉపసంహరణ అనేది మందగమనానికి నాంది కాకుండా తాత్కాలిక విరామం మాత్రమేనని సూచిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

పెట్టుబడిదారుల విశ్వాసం

Advertisement

జూన్‌ నెలలో ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్‌ స్కీముల్లోకి నిధుల ప్రవాహం అమాంతంగా పెరిగింది. మార్కెట్‌ ఒడుదొడుకులున్నా దాదాపు రూ. 29 వేల నికర పెట్టుబడులు నమోదయ్యాయి. గడిచిన నెలతో పొలిస్తే 26 శాతం పెట్టుబడులు పెరిగాయి. మ్యూచువల్‌ ఫండ్ పరిశ్రమ నుంచి జూన్‌‌లో నికరంగా రూ.52,949 కోట్లు తరలిపోయాయి. మే నెలతో పోల్చితే రూ.64,131 ఊరట కల్పించే అంశం.

డెట్‌ స్కీమ్‌ల నుంచి రూ.1.09 లక్షల కోట్లు ఉపసంహరణలు నమోదయ్యాయి. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల నిర్వహణలో ఆస్తుల విలువ రూ.81.6 లక్షల కోట్లు కాగా, జూన్ చివరి నాటికి రూ.82.22 లక్షల కోట్లకు అమాంతంగా పెరిగింది. ఈ ఏడాది మే నెలలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో రూ.22,908 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి.

Advertisement

గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడుల ప్రవాహం

జూన్‌ నాటికి అది రూ.28,973 కోట్లకు పెరిగింది. జనవరిలో రూ.24,028 కోట్లు,ఫిబ్రవరిలో రూ.25,978 కోట్లు, మార్చిలో రూ.40,450 కోట్లు, ఏప్రిల్‌లో రూ.38,440 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ఈక్విటీ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.6,090 కోట్లతో అత్యధిక పెట్టుబడులను సాధించింది.

స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోకి రూ.5,602 కోట్లు, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌లోకి రూ.5,231 కోట్లు, లార్జ్ క్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,067 కోట్లు చొప్పున పెట్టుబడులు వచ్చినట్టు ఆ నివేదక పేర్కొంది. డివిడెండ్ ఈల్డ్‌ ఫండ్స్‌, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌ల్లో-ELSS జూన్‌లో పెట్టుబడుల ఉపసంహరణ స్పష్టంగా కనిపించింది.

ALSO READ: మళ్లీ యుద్ధం తీవ్రరూపం.. బంగారం-వెండి ధరలు భారీగా పతనం, కొన్నాళ్లు ఇదే పరిస్థితి తప్పదా?

గోల్డ్ ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్-ETFs లో మేలో రూ.725 కోట్లు తరలిపోగా.. జూన్‌ నాటికి రూ.3,443 కోట్ల మేరా పెట్టుబడులు తరలివచ్చాయి. 2026లో గోల్డ్ ఈటీఎఫ్‌ల నుండి పెట్టుబడిదారులు తమ డబ్బును ఉపసంహరించుకున్న ఏకైక నెల మే నెల ప్రత్యేకంగా నిలిచింది.

ఒక నెల అంతరాయం ఏర్పడినప్పటికీ గోల్డ్ ఈటీఎఫ్‌లకు డిమాండ్ బలంగానే ఉందని సూచిస్తోంది. డేటా ఆధారంగా మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈక్విటీ మార్కెట్లు కోలుకున్నప్పటికీ పెట్టుబడిదారులు బంగారం నుండి వైదొలగలేదు.

Related News

బ్యాంకులకు కొత్త కష్టాలు..రూల్స్ మార్చేసిన ఆర్బీఐ, అసలు మేటరేంటి?

మీ కార్ లోన్, పర్సనల్ లోన్ల ఈఎంఐ పెరగబోతోందా? ఇలా తెలుసుకోండి

నెలకు రూ.2.28 లక్షలు ఆదాయం పొందుతున్న జొమాటో మాజీ ఉద్యోగి.. జాబ్ మానేసి ఏం చేస్తోందంటే

పండగల వేళ షాకిస్తున్న బంగారం ధర, పెంపు ఖాయమన్న బులియన్ వర్గాలు, మార్కెట్లో రేటు మాటేంటి?

తాతల ఆస్తి రెండో భార్యకు రాసిచ్చిన భర్త.. కోర్టుకెక్కిన మొదటి భార్య కూతురు.. చివరికి ఏం జరిగిందంటే

ఏటీఎం కార్డు పోయిందా? వెంటనే మీరు చేయాల్సిన పనులు ఇవే!

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి చేస్తున్న పసిబిడ్డ.. ప్రపంచంలోనే అతిపిన్న వయసు ఇన్వెస్టర్

ఆటో డ్రైవర్ పిల్లల స్కూల్ ఫీజు రూ.1.5 లక్షలు.. భార్య ఎలా సాయం చేస్తోందంటే

Big Stories

Advertisement
×