E-Paper
Advertisement

PF Accounts: 34 కోట్ల మందికి శుభవార్త.. పీఎఫ్ సభ్యులకు వడ్డీ జమ, ఆపై రూ.5 లక్షల వరకు

PF Accounts: 34 కోట్ల మందికి శుభవార్త.. పీఎఫ్ సభ్యులకు వడ్డీ జమ, ఆపై రూ.5 లక్షల వరకు
Advertisement

PF Accounts: ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 2025-26 ఆర్థిక ఏడాదికి ఈపీఎఫ్ వడ్డీని జూలై 15 నాటికి జమ చేస్తామని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ.5 లక్షల వరకు పీఎఫ్ క్లెయిమ్‌లను ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త-దేశంలోని 34 కోట్ల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు తీపి కబురు చెప్పింది కేంద్రం. 2025-26 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఈపీఎఫ్ వడ్డీని జూలై 15 నాటికి జమ చేస్తామని తెలిపింది. వడ్డీ చెల్లింపుల విలువ రూ.1.44 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్-సైట్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా తొలిసారి వడ్డీ పంపిణీ జరగనుంది.

Advertisement

34 కోట్ల మందికి తీపికబురు-ఆ తర్వాత పీఎఫ్‌కు సంబంధించి అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. వడ్డీని ఖాతాదారుల అకౌంట్లో జమ చేసే ముందు ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండేందుకు ప్రస్తుతం ధృవీకరణ జరుగుతోందని తెలిపింది. గతంలో వడ్డీ రేటు ప్రకటించిన తర్వాత అక్టోబర్ లేదా నవంబర్ వరకు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేది.

ఈనెల 15 లోపు వడ్డీ జమ-తాజాగా తీసుకొచ్చిన కేంద్రీకృత టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ వల్ల ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఈ క్రమంలో వడ్డీ వేగంగా ఖాతాల్లో జమ కానుంది. గతంలో ప్రతీ ప్రాంతీయ ఆఫీసుకు ప్రత్యేకంగా డేటాబేస్ ఉండేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా రికార్డులన్నీ జాతీయ డేటాబేస్‌లో ఏర్పాటు చేశారు.

Advertisement

దేశంలో ఎక్కడున్నా ఈపీఎఫ్‌ఓ కార్యాలయం ద్వారా ప్రాసెస్ చేయవచ్చు. ఈపీఎఫ్ సభ్యులకు ఒకే యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ అందుబాటులోకి రానుంది. సభ్యత్వ వివరాలు, పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్ స్థితి, పెన్షన్‌కు అర్హతలు, ఇతర ప్రయోజనాలు ఒకే చోట చూడొచ్చు.

ALSO READ: ప్రధాని మోడి ఇన్వెస్ట్ చేస్తున్న ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా? లక్షల్లో వడ్డీ! 

ఆటోమేటిక్ క్లెయిమ్  రూ. 5 లక్షలు- క్లెయిమ్‌లకు ఆటోమేటిక్ ప్రీ-వాలిడేషన్ పద్దతి ఉంటుంది. డబ్బు ఉపసంహరణ కోసం ఉద్యోగి దరఖాస్తు పంపే ముందు సిస్టమ్ అర్హతను తనిఖీ చేయడమేకాదు లోపాలు ఉంటే తెలియజేస్తుంది. అనుమతించిన మొత్తానికి క్లెయిమ్ చేస్తే ముందుగా సమాచారం ఇస్తుంది. దీనివల్ల క్లెయిమ్ తిరస్కరణలు తగ్గే అవకాశం ఉంది.

అదే సమయంలో ఈపీఎఫ్‌ఓ ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ విధానంపై ఫోకస్ చేసింది. ఆలస్యం లేకుండా రూ.5 లక్షల వరకు ఉండే ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ ద్వారా పొందవచ్చు. కొత్తగా తీసుకొచ్చిన వ్యవస్థ వల్ల పీఎఫ్ సేవలు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు వారాల తరబడి వేచి చేసేవారు. ఇకపై ఆ పని వేగంగా పూర్తికానుంది. అంతకుముందు ఈ పరిమితి కేవలం లక్ష వరకు మాత్రమే ఉండేది.

 

Related News

ఏటీఎం కార్డు పోయిందా? వెంటనే మీరు చేయాల్సిన పనులు ఇవే!

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి చేస్తున్న పసిబిడ్డ.. ప్రపంచంలోనే అతిపిన్న వయసు ఇన్వెస్టర్

ఆటో డ్రైవర్ పిల్లల స్కూల్ ఫీజు రూ.1.5 లక్షలు.. భార్య ఎలా సాయం చేస్తోందంటే

రూ.92 లక్షల ట్యాక్స్ చెల్లించాను.. ఇప్పుడు ఉద్యోగం ఊడింది.. దిక్కుతోచని స్థితిలో టెకీ

నెలకు రూ.2,000 SIP పెట్టబడితో రూ.10 లక్షల కార్పస్.. ఇలా చేస్తే సాధ్యమే?

తగ్గేది లేదంటున్న పసిడి, మదుపరుల చూపుతో పైపైకి పరుగులు, మార్కెట్లో ధరల మాటేంటి?

ఇండియన్ ఐటీ కంపెనీలపై అమెరికా కొరడా.. గ్రీన్ కార్డ్ PERM ప్రాసెస్ నిలిపివేత! టెక్కీలకు కోలుకోలేని దెబ్బ

యూపీఐ లావాదేవీల వ్యవహారం.. సంక్రాంతి తర్వాతే అంటున్న ట్రేడర్లు, ఆలోచనలో ఎన్‌పీసీఐ

Big Stories

Advertisement
×