Gold Rates: బంగారం కొనాలనుకునే వారికి మార్కెట్ నుండి ఒక అద్భుతమైన శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతూ, సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు నేడు ఒక్కసారిగా భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, రూపాయి విలువలో మార్పుల కారణంగా స్థానిక మార్కెట్లలో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అయితే రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గుతాయా లేదా మళ్లీ పుంజుకుంటాయా అనే ఊహాగానాలు ఎలా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికైతే ఈ క్షీణత పసిడి ప్రియులకు ఒక మంచి అవకాశమనే చెప్పాలి. నేటి ధరలు చూసుకుంటే..
నేడు బంగాకం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,620 ఉండగా.. నేడు మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,260 వద్ద పలుకుతుంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,400 కాగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,150 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.1,360 తగ్గింది.
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,45,260 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,150 వద్ద కొనసాగుతుంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,260 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,150 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,260 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,150 వద్ద పలుకుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,410 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,33,300 వద్ద ఉంది.
నేటి సిల్వర్ ధరలు..
బంగారం ధరలు దిగివస్తున్న సిల్వర్ ధరలు మాత్రం అస్సలు తగ్గడం లేదు..
నేటి ధరలు చూసుకుంటే.. సోమవారం కేజీ సిల్వర్ రూ. 2,50,000 వద్ద కొనసాగుతుంది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,45,000 వద్ద పలుకుతోంది.
Also Read: అయోధ్యలో రూ. 5 కోట్ల బంగారు పుస్తకం మాయం? అసలు నిజం బయటపెట్టిన రామాలయ ట్రస్ట్