Monsoon travel packing checklist: వర్షం పడుతుంటే.. కొత్త ప్రదేశాలను అన్వేషించడం, పచ్చని ప్రకృతిని ఆస్వాదించడం ఎవరికైనా ఇష్టమే ఉంటుంది. అయితే.. వానాకాలం ట్రిప్స్ ఇచ్చే కిక్ మామూలుగా ఉండదు కానీ.. ఒక్క వస్తువు మర్చిపోయినా మీ ట్రిప్ మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. తడిసిన బట్టలు, పాడైపోయే గ్యాడ్జెట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదంటే.. ప్యాకింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ వర్షాకాలంలో మీరు బ్యాగ్ సర్దుకునేటప్పుడు ఖచ్చితంగా పెట్టాల్సిన ఆ ఇంపార్టెంట్ వస్తువులు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
సాధారణ రోజుల్లో.. లాగా వర్షాకాలంలో బ్యాగ్ ప్యాక్ చేయకూడదు. ఈ సీజన్‌లో ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుందో ఊహించడం కష్టం. కాబట్టి.. మీ బ్యాగ్ వాటర్‌ప్రూఫ్ కాకపోయినా, లోపల ఉన్న వస్తువులు తడిసిపోకుండా చూసుకోవడం ముఖ్యం. అందుకోసం ఈ కింది వస్తువులను మీ లిస్ట్‌లో చేర్చుకోండి.
1. వాటర్‌ప్రూఫ్ బ్యాగ్ కవర్స్ & జిప్‌లాక్ పౌచ్‌లు :
మీరు తీసుకెళ్లే లగేజ్ బ్యాగ్ ఎంత కాస్ట్‌లీదైనా సరే, దానికి ఒక వాటర్‌ప్రూఫ్ రెయిన్ కవర్ ఉండాల్సిందే. అలాగే మీ మొబైల్స్, పవర్‌బ్యాంక్స్, కెమెరాలు, ఇంకా మీ ఆధార్ కార్డ్, క్యాష్ లాంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ తడిసిపోకుండా ఉండటానికి కొన్ని జిప్‌లాక్ పౌచ్‌లు లేదా వాటర్‌ప్రూఫ్ బ్యాగులను వాడండి. ఇవి మీ గ్యాడ్జెట్లను ప్రాణప్రదంగా కాపాడతాయి.
2. సింథటిక్ లేదా త్వరగా ఆరిపోయే బట్టలు:
వర్షాకాలంలో కాటన్ బట్టలు వేసుకుంటే అవి తడిస్తే త్వరగా ఆరవు, పైగా మురికి వాసన వస్తాయి. అందుకే.. ఈ సీజన్ ట్రిప్స్‌కి నైలాన్ లేదా సింథటిక్ మెటీరియల్ ఉన్న బట్టలను ఎంచుకోండి. ఇవి తేలికగా ఉంటాయి. ఒకవేళ తడిసినా సరే ఫ్యాన్ కింద వేస్తే ఇట్టే ఆరిపోతాయి. అలాగే ఒక మంచి రెయిన్ కోట్ లేదా ఫోల్డబుల్ గొడుగును బ్యాగ్‌లో పైన అందుబాటులో ఉంచుకోండి.
3. సిలికా జెల్ ప్యాకెట్లు:
మనం కొత్త షూస్ లేదా బ్యాగులు కొన్నప్పుడు చిన్న చిన్న తెల్లటి పౌచ్‌లు వస్తాయి కదా.. అవే సిలికా జెల్ ప్యాకెట్లు. వీటిని వేస్ట్ అని పారేయకండి. వానా కాలంలో బ్యాగ్ క్లోజ్ చేసి ఉంచడం వల్ల లోపల తేమ చేరి బట్టలు, వస్తువులు వాసన వస్తాయి. మీ ట్రావెల్ బ్యాగ్‌లో 3-4 సిలికా జెల్ ప్యాకెట్లు వేస్తే.. అవి లోపల ఉన్న తేమను పీల్చేసి వస్తువులను ఫ్యాష్‌గా ఉంచుతాయి.
4. సరైన ఫుట్‌వేర్:
వర్షంలో స్లిప్పర్స్ లేదా నార్మల్ షూస్ వేసుకుంటే రోడ్లపై జారిపడే.. ప్రమాదం ఉంది. కాబట్టి మంచి గ్రిప్ ఉన్న వాటర్‌ప్రూఫ్ శాండల్స్ లేదా యాంటీ-స్కిడ్ షూస్ వేసుకోండి. ఇవి నీటిలో తడిసినా పాడవ్వవు . త్వరగా ఆరిపోతాయి.
5. ఫస్ట్ ఎయిడ్ & ఇమ్యూనిటీ కిట్:
వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు, కడుపునొప్పి, జ్వరం, జలుబు వంటి సమస్యలు చాలా కామన్. కాబట్టి మీ వెంట కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉంచుకోండి. వీటన్నింటితో పాటు దోమల కాటు నుంచి తప్పించుకోవడానికి మస్కిటో రిపెల్లెంట్ క్రీమ్ లేదా స్ప్రే ఖచ్చితంగా బ్యాగ్‌లో ఉండాలి.
ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ స్మార్ట్‌గా ప్యాకింగ్ చేసుకుంటే.. వర్షం మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టలేదు.సేఫ్ జర్నీనే బెస్ట్ జర్నీ! మరి ఇంకెందుకు ఆలస్యం, మీ బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఈ వానాకాలం బ్యూటిఫుల్ మెమొరీస్‌ను క్యాప్చర్ చేయడానికి బయల్దేరండి.