Notary Plot: మనిషి విలాస వంతమైన జీవితం చేతి నిండా డబ్బు, ఆస్థులు, అంతస్థులు ఉండి సంతోషమైన జీవితం గడపాలని అనుకుంటాడు. కానీ ఇది అందరికి సాద్యం కాదు. ఒక సామాన్యుడు ఎంతో కష్టపడితే తప్ప తాను కోరుకున్న జీవితం రాదనేది జగమెరిగిన సత్యం.. ఈ రోజుల్లో హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి వ్యక్తి సొంత ఇల్లు, ప్లాట్ కొనాలనేది మద్యతరగతి వ్యక్తుల పెద్ద కల. అయితే దీన్ని అదునుగా చేసుకొని కొతం మంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, మధ్యవర్తులు అమాయక ప్రజలకు తక్కవ ధరకే ప్లాట్స్ అంటూ ఆశ చూపుతారు. సార్ ప్రస్ధుతానికి ఇక్కడ ప్రభుత్వంనుండి రిజిస్ట్రేషన్లు అవ్వట్లేదు. అందుకే నోటరీ మీద చాలా తక్కువ ధరకే ప్లాట్ అమ్ముతున్నామిన నమ్మబలుకుతారు. మీమ్మల్ని ఇంకాస్త గట్టిగా నమ్మించడానికి సార్ రేపు పొద్దున జీవో రాగానే క్రమబద్ధీకరణ (Regularization) చేయించుకోవచ్చు అంటూ భవిష్యత్తులో ఫుల్ డిమాండ్ వస్తుంది అంటూ నమ్మించి నోటరీ ఉన్న భూములను అమ్మే ప్రయత్నం చేస్తారు.
చట్టం ప్రకారం ఏదైనా ఒక స్థిరాస్తి (భూమి, ఇల్లు,) ఒకరి పేరు నుండి మరొవ్యక్తి పేరు మీదికి మారాలంటే కచ్చితంగా ప్రభుత్వ సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్‌లో అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. అప్పుడే దానిపై మనకు పూర్తి హక్కులుంటాయి. కానీ, నోటరీ ప్లాట్ల విషయంలో అలా జరగదు. ఇది కేవలం రూ 100, 500 బాండ్ పేపర్ మీద కొనుగోలు దారుడు మరియ అమ్మకం దారుడి వివరాలు మాత్రమే ఉంటాయి. దీనిపై ఓ లాయర్ లేదా నోటరీ పబ్లిక్ అధికారి దగ్గర సంతకంచేసుకుని సీల్ వేయించుకుంటారు. దీన్నే ‘నోటరీ అగ్రిమెంట్’ అంటారు.
రిజిస్ట్రేషన్ చట్టం Act, 1908 ప్రకారం నోటరీ డాక్యుమెంట్ అనేది భూమిపై మీకు ఎలాంటి యాజమాన్య హక్కులను కల్పించదు. కానీ కేవలం కోర్టు దృష్టిలో రిజిస్టర్డ్ సేల్ డీడ్ మాత్రమే చెల్లుతుంది. సాదారణంగా నోటరీ స్థలం కోనుగోలు చేసినపుడు ప్రభుత్వ రికార్డుల్లో ఆ భూమి మీ పేరు మీదకు రాదు. దీనితో పాటుగా (EC) తీస్తే డాక్యుమెంటులో మీ పేరు కనిపించదు. దీంతో స్థలంపై ఉన్న పాత వ్యక్తిపేరే డాక్యుమెంటులో కనిపిస్తుంది దీంతో పెద్దచిక్కుల్లో పడతారు. ఇంకో దారుణం ఎంటంటే ప్రభుత్వ రికార్డుల్లో మీ పేరు ఉండదు కాబట్టి అదే ప్లాట్ ని మీకు తెలీకుండా దొంగ పట్టాలు సృష్టించి మరో వ్యక్తికి అమ్మే అవకాశం ఉంటుంది. దీంతో మీరు రిస్క్‌లో పడటం పక్కా.
ఓక వేల మీరు ఆ ప్లాట్‌లో ఇల్లు కట్టాలనుకున్నా HMDA, GHMC మరియు అక్కడి గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ అధికారులు మీకు పర్మీషన్ ఇవ్వరు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు లోన్ కూడా ఇవ్వరు. కొత కాలం తరువాత భవిష్యత్తులో ఆ భూమిని సర్కారు రోడ్ల విస్తరణ, లేదా మరే ఇతర ప్రభుత్వ ప్రాజెక్టులకు వాడితే నష్టపరిహారం పాత రికార్డుల్లో ఉన్న యజమానికే చెందుతుంది కానీ మీరు అర్హులు కారు. కాబట్టి మద్య తరగతి ప్రజలు ఇలాంటి చిక్కుల్లో పడకుండా ప్రభుత్వ గుర్తింపు కలిగిన భూములను కొని వారి కళను నిజం చేసుకోవడం ఉత్తమం.
Also Read: Server Glitch: మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో నిలిచిపోయిన సేవలు..!