BigTV English

iPhone 18 Pro: ఆపిల్ 18 ప్రో వచ్చేసింది.. ఫీచర్స్ తెలుసుకుంటే కొనాలనే కోరిక పెరుగుతుంది!

iPhone 18 Pro: ఆపిల్ 18 ప్రో వచ్చేసింది.. ఫీచర్స్ తెలుసుకుంటే కొనాలనే కోరిక పెరుగుతుంది!

iPhone 18 Pro: ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ కోసం టెక్నాలజీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆపిల్ మళ్లీ ఒకసారి తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. 2026 సెప్టెంబర్‌లో విడుదల కానున్న ఐపోన్ 18 ప్రో ఇప్పటికే టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫోన్‌లో ఉండే ఫీచర్లు విన్నప్పుడల్లా టెక్నాలజీ ప్రేమికులు ఆశ్చర్యపోతున్నారు.


ఏ20 ప్రో చిప్ ప్రధాన ఆకర్షణ

ముందుగా ఈ ఫోన్‌లో ఉన్న ప్రధాన ఆకర్షణ ఏ20 ప్రో చిప్. ఇది ఇప్పటివరకు ఆపిల్ తయారు చేసిన అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్. ఆపిల్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ చిప్ వేగం గత మోడళ్ల కంటే 40శాతం వరకు ఎక్కువ. గేమింగ్, హై-లెవెల్ వీడియో ఎడిటింగ్, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాప్‌లు ఏది వాడినా ఈ ఫోన్‌లో సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా, తక్కువ బ్యాటరీ వినియోగంతో ఎక్కువ పనితీరు ఇవ్వడం దీని ప్రత్యేకత. 12జిబి ర్యామ్ వలన యాప్‌ల మధ్య మార్పులు కూడా స్మూత్‌గా జరుగుతాయి.


ట్రిపుల్ 48 మెగాపిక్సెల్ కెమెరా సిస్టమ్

కెమెరా విషయానికి వస్తే, ఐఫోన్ 18 ప్రోలో ట్రిపుల్ 48 మెగాపిక్సెల్ కెమెరా సిస్టమ్ ఉంది. మూడు కెమెరాలు కూడా 48ఎంపి సెన్సార్లతో రావడం అనేది స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోనే పెద్ద అప్‌డేట్ అని చెప్పొచ్చు. ఇందులో ఒకటి అల్ట్రా వైడ్, ఒకటి టెలిఫోటో, మరొకటి మెయిన్ సెన్సార్. ఫోటోలు తీసినప్పుడు ప్రతి చిన్న డీటెయిల్ కూడా క్లియర్‌గా రికార్డ్ అవుతుంది. రాత్రి కూడా తీసే చిత్రాలు కూడా డిఎస్ఎల్ఆర్ అంటే ఇది స్పష్టమైన, ప్రొఫెషనల్ స్థాయి ఫోటోలు తీయగల కెమెరా క్వాలిటీ ఇస్తాయి.

అప్‌డేట్ వైఫై 7 సపోర్ట్

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అప్‌డేట్ వైఫై 7 సపోర్ట్. ఇప్పటివరకు మనం వైఫై 6 లేదా వైఫై 6ఈ గురించి విన్నాం. కానీ వైఫై 7 అంటే మరింత వేగవంతమైన కనెక్టివిటీ. ఆన్‌లైన్ స్ట్రీమింగ్, 4కె, 8కె వీడియోలు, గేమింగ్, లేదా హైస్పీడ్ డౌన్‌లోడ్స్ అన్నీ కలిపి చాలా స్మూత్‌గా అనిపిస్తాయి. ఆపిల్ వెల్లడించిన వివరణ ప్రకారం, వైఫై 7 వలన ఇంటర్నెట్ అనుభవం ల్యాగ్ లేకుండా ఉండబోతుంది.

Also Read: Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. బంగారం షాపుల యజమానుల్లో టెన్షన్

డిజైన్ – డిస్‌ప్లే

డిజైన్ విషయానికి వస్తే, ఐఫోన్ 18 ప్రో మునుపటి మోడళ్ల కంటే సన్నగా, తేలికగా మరింత బలంగా రూపొందించారు. దీని పరిమాణం 71.9 x 150 x 8.8 మిమీ, బరువు 206 గ్రాములు. కొత్త టిటానియం ఫ్రేమ్ వాడటం వలన ఈ ఫోన్ తేలికగా ఉంటుంది. స్క్రీన్‌లో ప్రోమోషన్ డిస్‌ప్లే టెక్నాలజీని మరింత మెరుగుపరచి 1హెచ్‌జెడ్ నుంచి 120హెచ్‌జెడ్ వరకు స్మూత్ అనుభవం ఇస్తుంది. హెచ్‌డిఆర్ క్వాలిటీ కూడా అధికంగా ఉండటం వలన ఫోన్ వాడుతున్నప్పుడు సినిమాటిక్ లుక్ వస్తుంది.

ఎ20 ప్రో చిప్‌ – 2 రోజులు వరకూ సులభంగా బ్యాటరీ

బ్యాటరీ విషయంలో కూడా ఆపిల్ మరో అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి. కొత్త ఎ20 ప్రో చిప్‌తో కలిపి, ఈ ఫోన్‌లో 2 రోజులు వరకూ సులభంగా బ్యాటరీ లైఫ్ ఇస్తుందని చెబుతున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా మరింత వేగంగా జరిగేలా అప్‌డేట్ చేశారు. మ్యూజిక్ ప్లేబ్యాక్‌తో దీర్ఘకాలం వినియోగదారుల అవసరాలను తీర్చగల ఫోన్ ఇదే.

సెక్యూరిటీ పరంగా సేఫ్

సెక్యూరిటీ పరంగా కూడా ఐఫోన్ 18 ప్రో మరింత ఆధునికంగా ఉంది. ఫ్రేస్ ఐడిలో కొత్త ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లు వాడటం వలన కాంతి తక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా లాక్ ఓపెన్ అవుతుంది. అదనంగా, సెక్యూర్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీతో యూజర్ల డేటా మరింత సేఫ్‌గా ఉంటుంది.

ధర ఎంత?
ధర అధికారికంగా ఇంకా ప్రకటించబడలేదు. ఆపిల్ ఎప్పటిలాగే ప్రీమియం రేంజ్‌నే కొనసాగిస్తోంది. 256జిబి మోడల్ నుండి 1టిబి వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉండబోతున్నాయి. మార్కెట్‌లోకి ఈ ఫోన్ వచ్చే సమయానికి ప్రీ-ఆర్డర్స్ భారీగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద, ఐఫోన్ 18 ప్రో అనేది కేవలం ఒక స్మార్ట్‌ఫోన్ కాదు, వేగం, కెమెరా క్వాలిటీ, కనెక్టివిటీ మూడింటినీ కలిపి వినియోగదారులకు ఆపిల్ మరోసారి అద్భుత అనుభవం ఇవ్వబోతోంది.

Related News

Samsung Galaxy: సామ్‌సంగ్ గెలాక్సీ ఎ37 5జి.. మిడ్ రేంజ్‌లో మాస్టర్ ఫోన్

Jio New Offers: జియో సెప్టెంబర్ హాట్ డీల్స్! వినియోగదారులు తప్పక తెలుసుకోవాల్సిన తాజా ఆఫర్లు

DMart Jobs: డిమార్ట్ లో జాబ్ కావాలా? జస్ట్ ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు!

5G Phone Low Price: భారత మార్కెట్లో జియో కొత్త హంగామా.. తక్కువ ధరకే 5జీ ఫోన్

Smart Phone: కొత్తగా వచ్చిన మోటో జి85 5జి.. స్టైలిష్ డిజైన్‌తో అద్భుతమైన ఫీచర్స్

OPPO Smartphone: ఇది కదా కావాల్సింది.. ప్రీ-ఆర్డర్ ఆఫర్‌లో దుమ్ము రేపుతున్న ఒప్పో కొత్త ఫోన్

Flipkart Offers 2025: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025.. షాపింగ్ పండుగకు సిద్ధమా?

Big Stories

×