Jio Unlimited Offer: భారతదేశంలో మొబైల్ ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా డేటా వాడకం ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఉందని చెప్పాలి. ఈ క్రమంలోనే జియో తరచూ కొత్త ఆఫర్లు, కొత్త టెక్నాలజీలతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తోంది. ఇప్పుడు జియో ప్రకటించిన తాజా ఆఫర్ మాత్రం నిజంగానే వినియోగదారులకు పెద్ద సర్‌ప్రైజ్.
కేవలం 51 రూపాయలు
ఇకపై కేవలం రూ.51 యాడ్‌ఆన్ రీచార్జ్‌తో మీ ప్రస్తుత ప్లాన్‌పైనే అన్ లిమిటెడ్ జియో 5జీ సర్వీస్‌ను పొందొచ్చు. అంటే మీరు ఏదైనా ప్లాన్ వాడుతున్నా, దానిపైకి కేవలం 51 రూపాయలు జోడిస్తే సరిపోతుంది. ఆ తర్వాత 5జీ స్పీడ్‌ను ఎలాంటి పరిమితులు లేకుండా ఉపయోగించవచ్చు.
మనం వాడగలమా?
సాధారణంగా 5జీ అంటే చాలా మందికి ఖరీదై నదిగా అనిపిస్తుంది. మనం వాడగలమా? బిల్లులు ఎక్కువవుతాయా? అనే అనుమానాలు వస్తాయి. కానీ జియో ఈ ఆఫర్ ద్వారా ఆ భయాలను పూర్తిగా తొలగించింది. ఎందుకంటే ఇందులో స్పీడ్ లిమిట్ లేదు, డేటా లిమిట్ లేదు. అంటే నిజంగానే అన్ లిమిటెడ్ స్పీడ్, అన్‌లిమిటెడ్ డేటా.
బఫరింగ్ లేకుండా 4కే సినిమా స్ట్రీమింగ్
ఇంటర్నెట్ వేగం ఎంత ముఖ్యమో నేటి రోజుల్లో చెప్పనవసరం లేదు. చదువుకునే విద్యార్థులైనా, ఉద్యోగం చేస్తున్న వారైనా, వినోదం కోసం నెట్ వాడే వారైనా – అందరికీ ఫాస్ట్ కనెక్షన్ తప్పనిసరి అయింది. ఆన్‌లైన్ క్లాసులు, జూమ్ మీటింగులు, హెచ్‌డీ వీడియో కాల్స్, 4కే సినిమా స్ట్రీమింగ్ – ఇవన్నీ అంతా బఫరింగ్ లేకుండా అనుభవించాలంటే 5జీ తప్ప మరో మార్గమే లేదు.
Also Read: Headache Health Tips: రోజు ఒక యాపిల్.. తలనొప్పి సమస్యకు శాశ్వత పరిష్కారం?
5జీ వరల్డ్‌లోకి
ఈ ఆఫర్ ద్వారా జియో స్పష్టంగా చెబుతోంది మీరు ఉన్న ప్రస్తుత ప్లాన్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏ ప్లాన్ ఉన్నా దానిపైకి కేవలం 51 రూపాయలు యాడ్ చేసుకుంటే చాలు, 5జీ వరల్డ్‌లోకి అడుగుపెట్టొచ్చు. ఇది వినియోగదారుల ఖర్చు విషయంలోనూ పెద్ద ఉపశమనం ఇస్తుంది. ఎందుకంటే సాధారణంగా 5జీ డేటా ప్యాక్స్ చాలా ఎక్కువ ఖర్చు అవుతాయని భావన ఉంది. కానీ ఈ చిన్న యాడ్-ఆన్ ధరతో ఆ సమస్యను సులభంగా పరిష్కరించారు.
5జీ వాడాలంటే 5జీ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ ఉండాలి
అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సిన అవసరం ఉంది. 5జీ వాడాలంటే మీ దగ్గర 5జీ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ ఉండాలి. అలాగే మీ ప్రాంతంలో జియో 5G సర్వీస్ అందుబాటులో ఉండాలి. ఇవి ఉంటే, ఇక మీరు అనుభవించేది పూర్తి వేగవంతమైన అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్. జియో ఇప్పటికే దేశవ్యాప్తంగా 5జీ నెట్ వర్క్ ను వేగంగా విస్తరించింది. చిన్న పట్టణాలు, గ్రామాలు కూడా క్రమంగా ఈ సదుపాయం పొందుతున్నాయి. కాబట్టి ఈ ఆఫర్ ద్వారా నిజంగానే కోట్లాది వినియోగదారులు అన్‌లిమిటెడ్ స్పీడ్‌ను ఆస్వాదించే అవకాశం పెంచబోతున్నారు.
కొన్ని సెకన్లలో డౌన్‌లోడ్
చాలా మంది రోజువారీ జీవనంలో సోషల్ మీడియా, యూట్యూబ్, ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్ ఎక్కువగా వాడుతున్నారు. ప్రత్యేకంగా వీడియో క్వాలిటీ పెరుగుతున్న కొద్దీ ఇంటర్నెట్ స్పీడ్ అవసరం కూడా పెరుగుతోంది. 4జీలో ఒక మువీ డౌన్‌లోడ్ చేయడానికి 10–15 నిమిషాలు పట్టవచ్చు. కానీ 5జీలో అదే డౌన్‌లోడ్ కేవలం కొన్ని సెకన్లలో పూర్తవుతుంది. ఇకపై మీరు ఆఫీస్ పనులు చేస్తున్నా, పెద్ద పెద్ద ఫైల్స్ షేర్ చేయాల్సి వచ్చినా, గేమింగ్ చేస్తున్నా – అన్నిటికీ ఈ ఆఫర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక్కసారిగా మీ ప్రస్తుత ప్లాన్‌ను ఫాస్టెస్ట్ ప్లాన్‌గా మార్చేస్తుంది. జియో తీసుకొచ్చిన రూ 51 యాడ్‌ఆన్ అన్‌లిమిటెడ్ 5జీ ఆఫర్ అనేది టెలికాం రంగంలో గేమ్ ఛేంజర్‌గా మారబోతుంది. వినియోగదారులు చాలా తక్కువ ధరకే అత్యధిక వేగాన్ని పొందుతారు. ఇది నిజంగానే ఒక పెద్ద మైలురాయి అని చెప్పొచ్చు.