BSNL Recharge Plan: భారతదేశంలో టెలికాం కంపెనీ అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు బిఎస్‌ఎన్‌ఎల్. ఒకప్పుడు టెలిఫోన్ అంటే, మొబైల్ నెట్‌వర్క్ అంటే మొదట గుర్తుకువచ్చేది ఈ సంస్థే. 2జి, 3జి కాలంలో సిగ్నల్ విషయంలో బలంగా నిలిచిన నెట్‌వర్క్ బిఎస్‌ఎన్‌ఎల్. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తరించి ఉన్న పెద్ద నెట్‌వర్క్‌ని ఈ సంస్థ ఏర్పరచుకుంది. కానీ ప్రైవేట్ కంపెనీలు మార్కెట్లోకి వచ్చాక పోటీ పెరిగింది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా లాంటి సంస్థలు తక్కువ ధరలతో ప్లాన్లు ఇస్తూ వినియోగదారుల్ని ఆకర్షించాయి. దాంతో బిఎస్‌ఎన్‌ఎల్ కొంత వెనుకబడినా ఇప్పటికీ ఒక విశ్వాసం ఉన్న కస్టమర్ బేస్‌ను కొనసాగిస్తోంది. ముఖ్యంగా తక్కువ ధరల్లో ఇచ్చే ప్లాన్లు చాలా మందికి బాగా నచ్చుతుంటాయి.
సోషల్ మీడియాలో పుకార్లు నమ్మొద్దు
ఇప్పుడు అలాంటి ప్లాన్ గురించి సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. అదే బిఎస్‌ఎన్‌ఎల్ రూ.107 ప్లాన్. చాలా చోట్ల రూ.107 రీచార్జ్ చేస్తే 84 రోజుల వాలిడిటీ వస్తుందని వార్తలు ప్రచారం అవుతున్నాయి. వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో చాలామంది షేర్ చేస్తూ మరింత గందరగోళం సృష్టిస్తున్నారు. నిజానికి ఈ ప్లాన్‌లో ఏమి వస్తుంది? ఎంతకాలం వాలిడిటీ ఇస్తారు? 84 రోజుల విషయం నిజమా? ఇప్పుడు క్లారిటీగా చూద్దాం.
35రోజులు మాత్రమే
బిఎస్‌ఎన్‌ఎల్ రూ.107 ప్లాన్‌లో వినియోగదారులు పొందే ప్రయోజనాలు చాలా పరిమితంగా ఉంటాయి. మీరు రీచార్జ్ చేస్తే మొత్తం 3 జీబీ డేటా ఇస్తారు. ఇది రోజువారీగా కాకుండా ఒకేసారి 3 జీబీగా లభిస్తుంది. అంటే ఎప్పుడైనా వాడుకోవచ్చు కానీ వాలిడిటీ ముగిసేలోపు వినియోగించుకోవాలి. అంతేకాకుండా 200 నిమిషాల ఫ్రీ వాయిస్ కాల్స్ కూడా ఇస్తారు. ఇవి లోకల్, ఎస్‌టిడి, రోమింగ్ అన్నింటికీ వర్తిస్తాయి. అంతేకాదు ఎంటీఎన్‌ఎల్ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ ఫ్రీ మినిట్స్ ఉపయోగించుకోవచ్చు. అదనంగా బిఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్ 35 రోజుల పాటు ఉచితంగా యాక్టివ్ అవుతాయి.
Also Read: Be Alert: హైదరాబాద్‌లో శృతి మించుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు
ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం 35 రోజులు మాత్రమే. ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ అన్ని ఈ కాలంలోనే వాడుకోవాలి. ఫ్రీ నిమిషాలు అయిపోయిన తర్వాత మీరు చేసే కాల్స్‌కి ఒక్క నిమిషానికి రూ.1 చెల్లించాలి. ఎస్‌ఎంఎస్ కూడా సాధారణ ప్లాన్ రేట్ ప్రకారం ఛార్జ్ అవుతుంది. కాబట్టి ఇది ఎక్కువ వాడకం ఉన్నవారికి సరిపోదు. తక్కువ డేటా అవసరం ఉన్నవారు, తక్కువ కాల్స్ చేసే వారికి మాత్రం ఈ ప్లాన్ పనికొస్తుంది.
84రోజులు వచ్చే సీన్ లేదు
వినియోగదారులు ఎందుకు 84 రోజుల వాలిడిటీ వస్తుందని అనుకుంటున్నారు? కారణం ఏమిటంటే, చాలామంది వరుసగా రెండు సార్లు లేదా మూడుసార్లు రీచార్జ్ చేస్తే వాలిడిటీ కలిసిపోతుందని భావిస్తున్నారు. కానీ బిఎస్‌ఎన్‌ఎల్‌లో అలా జరగదు. మీరు ప్రస్తుత ప్లాన్ యాక్టివ్‌లో ఉన్నప్పుడే మళ్లీ రూ.107 రీచార్జ్ చేస్తే, పాత ప్లాన్ రద్దయిపోతుంది. కొత్తగా రీచార్జ్ చేసిన 35 రోజుల వాలిడిటీ మాత్రమే లెక్కలోకి వస్తుంది. అంటే డైరెక్ట్‌గా 84 రోజుల వాలిడిటీ వచ్చే అవకాశం లేదు.
84 రోజుల వాలిడిటీ కావాలంటే ఏం చేయాలి?
దానికి ఒకే ఒక మార్గం ఉంది బిఎస్‌ఎన్‌ఎల్‌లో లాంగ్ టర్మ్ ప్లాన్లను ఎంచుకోవాలి. బిఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేకంగా 84 రోజులు, 90 రోజులు, 180 రోజులు లాంటి వాలిడిటీ ఇస్తున్న ప్లాన్లు అందిస్తోంది. అవే సరైన ఆప్షన్ అవుతాయి. 107 ప్లాన్ మాత్రం కేవలం 35 రోజులు మాత్రమే ఇస్తుందని గుర్తుంచుకోవాలి. 84 రోజుల వాలిడిటీ వస్తుందనే ప్రచారం పూర్తిగా తప్పు. మీరు మళ్లీ మళ్లీ రీచార్జ్ చేస్తే కూడా ఒకేసారి ఎక్కువ వాలిడిటీ రావడం అసాధ్యం. కాబట్టి ఎక్కువ కాలం కనెక్టివిటీ కావాలంటే బిఎస్‌ఎన్‌ఎల్‌లో లాంగ్ టర్మ్ వాలిడిటీ ప్లాన్లను రీచార్జ్ చేయడమే సరైన పరిష్కారం.