Assam Earthquake : అస్సాంలోని గౌహతిలో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు ఉత్తర బెంగాల్, భూటాన్ వరకు వ్యాపించాయి. దీని కేంద్రం ఉడల్‌గురి జిల్లాలో ఉందని అధికారుల తెలిపారు. భూకంపం తీవ్రత సుమారు 5.8 ఉన్నట్లు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 4:4ం గంటలకు భూకంపించినట్లు తెలిపారు. భూకంప తీవ్రతకు ఇళ్లు స్వల్పంగా ఊగాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనై బయటకు పరుగులు పెట్టారు. అయితే.. భూకంపం వలన ఇప్పటివరకు ఎవరికి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అదికారులు పేర్కొన్నారు. ఇక్కడ ఈశాన్య ప్రాంతం భూకంప జోన్ గా తెలిపారు. అందువలన ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయని అధికారులు తెలిపారు.
పది రోజుల క్రితం అంటే, అసోంలోని సోనిత్‌పూర్‌లో సెప్టెంబరు 2న 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రస్తుత భూకంపం వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లభించలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదివారం అసోంలో ఉన్న సమయంలో భూకంపం సంభవించటంతో, అక్కడ ఆందోళన నెలకొంది.
EQ of M: 5.8, On: 14/09/2025 16:41:50 IST, Lat: 26.78 N, Long: 92.33 E, Depth: 5 Km, Location: Udalguri, Assam.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/fGgMfM05Lb
— National Center for Seismology (@NCS_Earthquake) September 14, 2025