Nokia Phone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రతి సంవత్సరం కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని కంపెనీలు తమ ప్రత్యేక గుర్తింపుతో వినియోగదారులను ఆకర్షిస్తాయి. అలాంటిదే నోకియా. ఒకప్పుడు మనందరి చేతిలో ఉండే నోకియా ఫోన్లు, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ యుగంలో కూడా తమకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. తాజాగా నోకియా మ్యాజిక్ మాక్స్ 5జి అధికారికంగా లాంచ్ అయ్యింది. ఫోన్ ఫీచర్స్ వింటే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇందులో మీకు నచ్చే, మీరు మెచ్చే ఫ్యూచర్లు ఉంటాయి. అవేంటో చూసేద్దామా?.
కెమెరా క్వాలిటీ
నోకియా మ్యాజిక్ మాక్స్ 5జి ఫోన్ లోని కెమెరా అద్భుతంగా ఉంది. 64ఎంపి ఫ్రంట్ సెల్ఫీ సెన్సర్ స్పష్టంగా తీస్తుంది. నైట్ మోడ్ లో ఉన్న కూడా ఫోటోలు క్లారిటీ వచ్చే విధంగా దీనిని రూపొందించారు. సెల్ఫీల కోసం అద్భుతమైన ఫేస్ ఎడిట్ ఫీచర్, రియర్ కెమెరా కూడా మల్టీ లెన్స్ సిస్టమ్ తో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అనుభవం ఇస్తుంది. మాక్రో, వైడ్, టెలిఫోటో లెన్స్ అంటే చిన్న వస్తువులను, టెలిఫోటో లెన్స్ దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చూపించడానికి ఉపయోగిస్తారు. ప్రతి సన్నివేశం ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది.
పనితీరు- సామర్థ్యం
ఫోన్‌లో 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజ్ కలిగి ఉంది. దీనివలన మీరు ఎన్ని యాప్స్ ఓపెన్ చేసి గేమ్స్ ఆడినా సమస్య తలెత్తదు. ఎందుకంటే దీనిలో హై-పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ ఫోన్‌ను ఫ్లూయిడ్‌గా, వేగంగా ఉంచుతుంది. మల్టీటాస్కింగ్‌లోనూ, అంటే ఫోన్‌లో మీరు ఎన్ని యాప్స్ ఓపెన్ చేసి పనులు చేసినా ఏ సమస్య తలెత్తకుండా తయారు చేశారు. హెవీ గేమింగ్, వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటే కూడా ఫోన్ హ్యాంగ్ కాకుండా ఉంటుంది.
Also Read: Navratri Puja Vidhi: దుర్గాపూజ ఇలా చేస్తే.. అష్టైశ్వర్యాలు, సకల సంపదలు
అమోలేడ్ డిస్‌ప్లే
అమోలేడ్ డిస్‌ప్లే ఉండటం వల్ల వీడియోలు, సినిమాలు, గేమింగ్ ఆనందంగా వాడుకోవచ్చు. హెచ్‌డిఆర్10 సపోర్ట్‌తో కాంట్రాస్ట్, కలర్ స్పష్టత, కళ్లకు ఏమాత్రం హాని కలిగించకుండా వెలుతురు కూడా అద్భుతంగా పనిచేసే విధంగా అమర్చారు. పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్‌లో, ప్రతి చిన్న వివరాలు కూడా స్పష్టంగా, సరిగ్గా కనబడతాయి.
5జి కనెక్టివిటీ, ఇంటర్నెట్ స్పీడ్
నోకియా మ్యాజిక్ మ్యాక్స్ 5జిలో 5జి కనెక్టివిటీ కారణంగా ఇంటర్నెట్ స్పీడ్ అసాధారణంగా ఉంటుంది. హెచ్‌డి వీడియో కాల్స్, లైవ్ స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్ సులభంగా జరుగుతుంది. 5జిలో స్పీడ్ ఉండటం వలన ఏదైనా సరే డౌన్లోడ్ చేయాలని అనుకున్నా ఆలస్యం కాకుండా వేగంగా పనిచేస్తుంది.
డిజైన్ సూపర్ స్మూత్
డిజైన్ కూడా సూపర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మన చేతిలో ఉంటే ఆ లుక్ స్లైలిష్ గా, ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా తయారు చేశారు. ఈ ఫోన్ చూడటానికి స్లిమ్, లైట్ వెయిట్‌గా ఉంటుంది. ఫోన్ పట్టుకోవడం సులభం, మోడ్రన్ లుక్ కలిగి ఉంటుంది. బ్యాటరీ, కెమెరా, ప్రాసెసర్ అన్ని కలిపి, నోకియా మ్యాజిక్ మ్యాక్స్ 5జి నిజంగా పవర్‌హౌస్ ఫోన్ అని చెప్పవచ్చు. యూజర్ పూర్తి డివైస్ అనుభవాన్ని పొందగలరు. అమోలేడ్ డిస్‌ప్లే అన్నీ కలిపి మార్కెట్ లోని అత్యంత ఆకర్షణీయమైన ఫోన్‌గా నిలుస్తుంది.