Jio Dasara Offers: భారతదేశ టెలికాం రంగాన్ని పూర్తిగా మార్చేసిన పేరు జియో. 2016లో ప్రారంభమైనప్పటి నుంచి తక్కువ ధరలో అధిక సదుపాయాలు అందించడం ద్వారా ప్రతి ఇంటికి డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చింది.
ఎప్పుడూ ముందుండే ఈ బ్రాండ్ వినియోగదారుల కోసం కొత్త కొత్త ఆఫర్లు తీసుకువస్తూ అందరి జీవితంలో భాగమైపోయింది. కేవలం మొబైల్ నెట్‌వర్క్‌గానే కాకుండా వినోదం, షాపింగ్, హెల్త్‌కేర్, ట్రావెల్, ఫైనాన్స్ ఇలా ప్రతి రంగంలోనూ జియో తన సొంత గుర్తింపును ఏర్పరచుకుంది.
ఈ ఏడాది అనివర్సరీ సందర్భంగా జియో ఒక ప్రత్యేక ఉత్సవాన్ని ప్రకటించింది. అనివర్సరీ సెలబ్రేషన్స్ 2025 పేరుతో నెల రోజులపాటు మెగా ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 5 వరకు కొనసాగే ఈ ఆఫర్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది రూ.349 సెలబ్రేషన్ ప్లాన్.
తక్కువ ధరలో ఎక్కువ సదుపాయాలు కలిగిన ఈ ప్లాన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే ముందుగా అందేది అన్లిమిటెడ్ 5జి డేటా. ఎక్కడ ఉన్నా హైస్పీడ్ ఇంటర్నెట్‌తో ఎటువంటి అంతరాయం లేకుండా కనెక్ట్ అయి ఉండొచ్చు. డౌన్‌లోడ్, స్ట్రీమింగ్, గేమింగ్, వీడియో కాలింగ్ ఏది చేసినా వేగం తగ్గకుండా కొనసాగుతుంది.
Also Read: Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!
అంతేకాకుండా జియోఫైనాన్స్ ద్వారా జియో గోల్డ్ కొనుగోళ్లపై రెండు శాతం అదనపు ప్రయోజనం కూడా లభిస్తుంది. అదనంగా జియోహోమ్ సర్వీసులపై రెండు నెలల పాటు ఉచిత ట్రయల్ అందుతుంది. అంటే ఒక్క రీచార్జ్ చేస్తే ఇంటర్నెట్ మాత్రమే కాదు, ఫైనాన్స్ నుంచి హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ వరకు అన్ని రంగాల్లో ఉపయోగాలు దక్కుతాయి.
ఇదే కాదు, ఈ ప్లాన్‌తో పాటు మరెన్నో బ్రాండ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. జియోహాట్‌స్టార్‌లో వినోదం, జొమాటో గోల్డ్‌లో ఫుడ్ ఆఫర్లు, ఏజియోలో ఫ్యాషన్ డీల్స్, ఈజీమైట్రిప్‌లో ట్రావెల్ రాయితీలు, నెట్‌మెడ్స్‌లో హెల్త్‌కేర్ సౌకర్యాలు, రిలయన్స్ డిజిటల్‌లో ఎలక్ట్రానిక్స్ మీద ప్రత్యేక రాయితీలు అన్నీ కలిపి ప్యాకేజీగా అందుబాటులోకి వచ్చాయి.
మొత్తానికి రూ.349 ప్లాన్ ఒక్క రీచార్జ్‌తోనే అనేక ప్రయోజనాలను అందిస్తోంది. వేగవంతమైన డేటా, వినోదం, షాపింగ్, హెల్త్, ట్రావెల్, ఎలక్ట్రానిక్స్ ఆల్ ఇన్ వన్ ఫెస్టివల్ ఆఫర్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా యువతరానికి ఇది మరింత అనుకూలం. ఎందుకంటే నేటి యువతకు కావాల్సింది ఇంటర్నెట్, ఓటిటి ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్ డీల్స్ అన్నీ కలిపిన ప్యాకేజీ.
కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 5 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే రీచార్జ్ చేసుకుని ఈ అనివర్సరీ సెలబ్రేషన్‌లో భాగమవ్వాలి. జియో ఎప్పుడూ ఇచ్చే వాగ్దానం ఒకటే ప్రతి కస్టమర్ జీవితాన్ని మరింత సులభంగా, మరింత రంగులమయం చేయడం. ఈసారి కూడా అదే నిరూపిస్తోంది.