Yuvraj Singh : మనీ లాండరింగ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఢిల్లీలోని ఈడీ హెడ్ క్వార్టర్స్ లో తాజాగా విచారణకు హాజరయ్యారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ 1XBet వ్యవహారంలో జరిగిన అవకతవకలపై ఈడీ ఆయనను విచారించనుంది. ఇక నిన్న ఇదే కేసులు టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ని కూడా ఈడీ 8 గంటలపాటు విచారణ చేపట్టింది. రేపు సినీ నటుడు సోనూసూద్ హాజరుకానున్నారు.
Also Read : IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంకర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యాడు. అయితే మధ్యాహ్నం అతను ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లాడు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినందుకు అతను ఈ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతకు ముందు అన్వైష్ జైన్ అనే ఇన్ ప్లూ యెన్సర్ కూడా ఈడీ ఎదుట హారయ్యారు. ఇక ఇదే కేసులో ఈడీ అధికారులు.. మాజీ క్రికెటర్లు అయిన సురేష్ రైనా, శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్పను ఇటీవలే విచారించారు. అలాగే నటి, టీఎంసీ ఎంపీ అయిన మిమి చక్రవర్తి, బెంగాళీ నటుడు అంకుశ్ హజ్రా కూడా ఈడీ ముందు హాజరయ్యారు. వీరి వాంగ్మూలాలను దర్యాప్తు సంస్త నమోదు చేసింది. ఇటీవలే ఈడీ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కి కూడా సమన్లు జారీ చేసింది. రేపు అనగా సెప్టెంబర్ 24 ఈడీ ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది.
వీరందరూ 1XBet బెట్టింగ్ యాప్ నకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ బెట్టింగ్ యాప్ లు అనేక మందిని లూటీ చేసినట్టు ఈ విచారణలో పెట్టుబడిదారులు రూ.కోట్లు దండుకొని పన్నులు ఎగవేసినట్టు తేలింది. 1XBet వెబ్ సైట్ ప్రకారం.. గత 18 సంవత్సరాలుగా ఈ కంపెనీ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్పోర్ట్స్ ఈవెంట్ల పై పందెం కాస్తే.. ఎక్కువ మొత్తం గెలుచుకోవచ్చనే ఉద్దేశంతో ఇందులో ప్రాడ్ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 70 భాషల్లో ఈ యాప్ ఉండటం గమనార్హం. ఇటీవల పార్లమెంట్ వేదికగా రియల్ మనీ ఆన్ లైన్ గేమింగ్ ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్ కేసులో మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా వంటి క్రికెటర్లకు ఇప్పటికే ఈడీ నోటిసులు పంపించి విచారణ చేపట్టింది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ పెను భూతాన్ని పారదోలే ప్రయత్నాన్ని అధికారులు ఎన్ని చేసినా అక్కడక్కడా కొందరూ సెలబ్రిటీలు చేసే నిర్వాకం తో చాలా మంది యువత ప్రాణాలను కోల్పోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ముఖ్యంగా సెలబ్రిటీల యొక్క మాటలను నమ్మి ఆ బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడులు పెట్టి తిరిగి పొందలేక నష్టపోయి, ఆ డబ్బును తీర్చలేక అప్పుల పాలవుతున్నారు. కొంత మంది అయితే సూ సైడ్ కూడా చేసుకోవడం గమనార్హం. అందుకే ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టి సెలబ్రిటీలందరికీ నోటీసులు పంపించి ప్రత్యేకంగా విచారణ చేపట్టడం విశేషం.