దేశంలోనే ప్రముఖ టెలికాం సంస్థ జియో వరుసగా తన రీచార్జ్ ప్లాన్స్ మారుస్తోంది. దీంతో కస్టమర్లు జియో ఇస్తున్న షాకులతో అవాక్కవుతున్నారు. నిజానికి జియో ఇటీవల తన టారిఫ్ ప్లాన్లను మారుస్తూ ఇందులో భాగంగా రూ. 249 రీచార్జ్ తొలగించింది. నిజానికి ఈ ప్లాన్ చాలా మందికి ఫేవరెట్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం రూ. 249 రీచార్జీతో 28 రోజులపాటు వ్యాలిడిటీతో రోజుకు ఒక జిబి డేటా లభించేది. ఇది చాలా మంది ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఫేవరెట్ ప్లాన్ గా ఉండేది. అలాగే అన్లిమిటెడ్ కాలింగ్ ఇందులో ఉన్న ప్రత్యేకమైన ఫెసిలిటీగా చెప్పవచ్చు. దీంతో ప్రతి నెల అటు డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ కోసం కేవలం రూ. 249 తో రీఛార్జ్ చేయిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు ఉన్నఫలంగా జియో తన ప్లాన్స్ మార్పుల్లో భాగంగా రూ. 249 రీఛార్జ్ ప్లాన్ తొలగించింది. దీంతో జియో కస్టమర్లు కాస్త విస్మయానికి గురవుతున్నారని చెప్పవచ్చు.
నిజానికి రిలయన్స్ జియో ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి కారణం డేటా ప్లాన్లను అందించడమే అని చెప్పవచ్చు. అప్పటివరకు ఇంటర్నెట్ డేటా ధర ఎక్కువగా ఉండేది ఎప్పుడైతే జియో ప్రతిరోజు డైలీ లిమిట్ డేటాను అందించడం ప్రారంభించిందో మిగతా టెలికాం కంపెనీలు కూడా డైలీ లిమిట్ డేటాను అందించడం ప్రారంభించాయి. ప్రతిరోజు ఒక జిబి డేటా కస్టమర్లకు చక్కగా సరిపోయేది. ముఖ్యంగా వాట్సాప్, అలాగే ఇతర యాప్స్ పని చేయడానికి ఈ డేటా సరిపోయేది. అయితే రాను రాను ఈ వన్ జీబీ డేటా అనేది రిలయన్స్ డేటా ప్లాన్స్ నుంచి మాయం అవుతోంది. ప్రస్తుతం రూ. 189, రూ. 198, రూ. 239 వంటి ప్లాన్స్ లో 1 జీబీ డేటా ప్రతిరోజు అందుబాటులో ఉన్నప్పటికీ. వీటి వాలిడిటీ అనేది చాలా తక్కువగా ఉంది. గతంలో, రూ.249 ప్లాన్ 1.5GB రోజువారీ డేటాతో వచ్చేది. జియో నెట్‌వర్క్‌ల మొత్తం డేటా వినియోగం గణనీయంగా పెరిగేందుకు ఇది ఉపయోగపడింది.
అయితే రూ. 249 రీచార్జ్ త్వరలోనే తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా జియో తన ARPU (సగటు ఆదాయం ఒక్కో వినియోగదారునికి) పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది, అయితే ఈ బేస్ ప్లాన్లను తొలగించడం ద్వారా కస్టమర్లు భవిష్యత్తులో ఎక్కువ వేల్యూ ఉన్న ప్లాన్‌లకు మారడం లేదా తరచుగా రీఛార్జ్‌లు చేసే అవకాశం ఉన్నందు వల్ల కంపెనీకి ఆదాయం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు రిలయన్స్ జియో భవిష్యత్తులో IPO (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) కోసం వెళ్లాలని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో జియో తన ARPUని మరింత మెరుగుపరచాలని కోరుకుంటోందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జియో రీఛార్జ్ ప్లాన్లలో ముఖ్యంగా 299 రూపాయల ప్లాన్ అందుబాటులో ఉంది. దీని ద్వారా రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తోంది.