BigTV English

Samantha: మరో గౌరవం అందుకున్న సమంత.. ప్రముఖ  మ్యాగజైన్ పై మెరిసిన నటి!

Samantha: మరో గౌరవం అందుకున్న సమంత.. ప్రముఖ  మ్యాగజైన్ పై మెరిసిన నటి!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత (Samantha) ఇటీవల సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లపై కూడా ఫోకస్ చేశారు. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతోంది. ఇలా దశాబ్దన్నర కాలం నుంచి అవకాశాలను కోల్పోకుండా పెద్ద ఎత్తున అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. కేవలం సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల కాలంలో సమంత సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ ల పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.


లెక్కలేనని పాత్రలు.. అద్భుతమైన సినిమాలు

సినిమాలు వెబ్ సిరీస్ లతోపాటు నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా సమంతకు అరుదైన గుర్తింపు లభించింది. నేడు ఫోటోగ్రఫీ దినోత్సవం కావడంతో ప్రముఖ మ్యాగజైన్ నుంచి సమంతకు మరొక గుర్తింపు లభించింది. గ్రేజియా ఇండియా ఫ్యాషన్ మ్యాగజైన్(Grazia India FashionMagazine) కవర్ పేజీ పై సమంత తళుక్కుమన్నారు. ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలను రిలీజ్ చేయడమే కాకుండా.. సమంత సినీ జర్నీ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.” 15 సంవత్సరాల సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన, లెక్కలేనని పాత్రలలో నటించారు”.


నటి నుంచి నిర్మాత వరకు…

“నటిగా మాత్రమే కాకుండా ఇప్పుడు మరొక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. నటి నుంచి నిర్మాతగా ఈమె తన మార్గాన్ని ఎంతో విభిన్నంగా ఎంచుకున్నారని” సమంత గురించి ఎంతో అద్భుతంగా చెప్పుకు వచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సమంత అద్భుతమైన లుక్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇలా గ్రేజియా ఇండియా ఫ్యాషన్ మ్యాగజైన్ పై సమంత రావటంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత కెరియర్ విషయానికి వస్తే ఈమె తెలుగులో చివరిగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషీ సినిమా (Khushi Movie)ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనంతరం తెలుగులో ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు.

ప్రస్తుతం ఈమె రక్త్ బ్రహ్మాండ్, ది ఫ్యామిలీ మెన్ 3 వెబ్ సిరీస్ పనులలో బిజీగా ఉన్నారు అలాగే తన సొంత నిర్మాణ సంస్థలు బంగారం అనే సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో ప్రముఖ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకు కమిట్ అయ్యారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన తెలియజేయనున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే సమంత నిత్యం తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె డైరెక్టర్ రాజ్ నిడుమోరి(Raj Nidumori)తో రిలేషన్లో ఉన్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు జంటగా వెళ్లడం ఇద్దరు చాలా సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు వస్తున్నాయి కానీ సమంత మాత్రం ఇప్పటివరకు ఈ వార్తలపై స్పందించలేదు.

Also Read: Suriya: ఆర్థిక ఇబ్బందుల్లో సూర్య సినిమా… వెనకడుగు వేస్తున్న నిర్మాతలు?

Related News

Coolie Film: హైకోర్టును ఆశ్రయించిన కూలీ చిత్ర యూనిట్, అసలు మేటర్ ఏంటంటే?

Shivani Nagaram: అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు శివాని.. సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్న ముద్దుగుమ్మలు?

Chandra Bose: ఆస్కార్ రచయితను బెదిరించిన సినిమా డైరెక్టర్

Anil Ravipudi : టైటిల్ గురించి క్లారిటీ ఇచ్చేసిన అనిల్ రావిపూడి, ఇక సంక్రాంతి లేనట్లేనా? 

Suriya: ఆర్థిక ఇబ్బందుల్లో సూర్య సినిమా… వెనకడుగు వేస్తున్న నిర్మాతలు?

Big Stories

×